News
News
వీడియోలు ఆటలు
X

Vidudala Part 1: ఓటీటీలోకి 'విడుదల పార్ట్ 1' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'విడుదల పార్ట్ 1'ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 28న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 లో స్ర్టీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Vidudala Part 1 : సంచలన దర్శకుడు వెట్రిమారన్ తాజాగా విడుదల చేసిన 'విడుతలై పార్ట్ 1' ప్రేక్షకులను మాత్రమే కాకుండా విమర్శకులను సైతం ఆకట్టుకుంది. తమిళ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా 'విడుదల పార్ట్ 1'గా విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం OTTలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.

విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'విడుతలై పార్ట్ 1'. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమాను  తెలుగులోనూ 'విడుదల పార్ట్‌1' పేరుతో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా గత కొన్నిరోజుల క్రితమే తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఈ  చిత్రాన్ని చెప్పిన్నట్టుగానే ఏప్రిల్‌ 15వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా విడుదల చేశారు.

'విచారణై', 'అసురన్', 'కాక ముట్టై' సినిమాలతో ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న వెట్రిమారన్..  విడుదల సినిమా ద్వారా మరో సారి తన సత్తా ఏంటో చూపించారు. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించేలా సూరి యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్స్ ఎంతో ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. విడుదల సినిమా ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి సీక్వెల్ కూడా ఉండడంతో ప్రేక్షకులకు వెట్రిమారన్ పార్ట్ 2పై మొత్తానికి ఇంట్రస్ట్ కలిగేలా చేశారు. సహజంగా ఉండేలా తీసిన కొన్ని సీన్స్ ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకున్న టాక్ కూడా వినిపించింది. దీంతో తెలుగులోనూ ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం సినిమా బాగుందంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కూడా.
 
‘ఆడుకాలం’ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్న వెట్రిమారన్ తీసిన తెలుగు వెర్షన్ 'విడుదల పార్ట్ 1' ఓటీటీ రిలీజ్ పై ప్రస్తుతం అంతటా చర్చ సాగుతోంది. ఇటీవలే  ఈ సినిమా తమిళ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపించగా.. ఈనెల చివరి వారంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుందని జోరుగా ప్రచారం కూడా సాగింది. అంతేకాదు ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ZEE5లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఒకవేళ అదే నిజమైతే, తెలుగు వెర్షన్ 'విడుదల పార్ట్ 1' ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లోనూ విడుదల కానుంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ క్యామియోలో నటించాడు. ఈ కాప్ యాక్షన్ డ్రామాలో భవాని శ్రీ మహిళా ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, తమిళ్ తో పాటు ఇతరులు కీలక పాత్రలు పోషిమంచారు. ఈ చిత్రానికి ఇళయరాజా స్వరకర్త.

Published at : 25 Apr 2023 12:27 PM (IST) Tags: Kamal Hassan Vetrimaran Vidudala Part 1 Suri Vijay Sethupati

సంబంధిత కథనాలు

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day:  ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?