News
News
X

#Venky75: అద్భుతమైన యాక్షన్ మూవీతో వస్తున్న వెంకీ - హిట్ సిరీస్ డైరెక్టర్‌తో!

ప్రముఖ హీరో వెంకటేష్ తన తర్వాతి సినిమాను అధికారికంగా ప్రకటించారు.

FOLLOW US: 
Share:

ఇటీవలి కాలంలో బిగ్‌స్క్రీన్, ఓటీటీ రెండిట్లోనూ సక్సెస్ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. ‘హిట్‌వర్స్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన శైలేష్ కొలనుతో వెంకీ చేతులు కలపనున్నారు. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమా. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. హిట్‌వర్స్ కాకుండా కొత్త కథతో శైలేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు జనవరి 25వ తేదీన వెల్లడించనున్నారు.

ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో వస్తువు ఉన్నట్లు చూపించారు. చూడటానికి గన్‌లాగా కనిపిస్తున్నప్పటికీ అది గన్ కాదు. ఆ వస్తువు ఏదో కూడా జనవరి 25వ తేదీనే వెల్లడించనున్నారు. వెంకటేష్ కెరీర్‌లోనే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.

టెక్నికల్‌గా కూడా ఈ సినిమా బాగా వచ్చేందుకు ప్రముఖ టెక్నీషియన్లను తీసుకుంటున్నారు. ఇందులో నటించనున్న ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతానికి హీరో వెంకటేష్ అనే విషయాన్ని మాత్రమే రివీల్ చేశారు.

సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు వెంకటేష్. గతేడాది మే నెలలో ఎఫ్3 విడుదల అయ్యాక వెంకటేష్ ఒప్పుకున్న సినిమా ఇదే. అంతకుముందు కూడా రిస్క్ లేకుండా అసురన్‌ను నారప్పగా, మలయాళం దృశ్యం-2ను అదే పేరుతో రీమేక్ చేశారు.

మరోవైపు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా వెంకటేష్ అడుగు పెట్టారు. తెలుగు సీనియర్ హీరోల్లో వెబ్ సిరీస్ చేసిన ఏకైక హీరో వెంకటేషే. ‘రానా నాయుడు’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న సిరీస్‌లో వెంకటేష్‌తో పాటు రానా కూడా నటిస్తున్నారు. సూపర్ హిట్ అయిన ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ‘రే డొనొవన్’కు అధికారిక రీమేక్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్ కూడా ఈ సంవత్సరమే విడుదల అయ్యే అవకాశం ఉంది. వెంకటేష్‌కు శైలేష్‌తో చేస్తున్న సినిమానే చివరి మైల్‌స్టోన్ మూవీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరిలో మెల్లగా సినిమాలు చేస్తూ వెళ్తుంది వెంకీనే. ఈ స్పీడ్‌లో మరో 25 సినిమాలు పూర్తి చేయడం అంటే దాదాపు ఇంపాజిబుల్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సినిమాను మెమరబుల్‌గా మార్చుకోవడానికి వెంకటేష్ చాలా కష్టపడతారు.

ఇక శైలేష్ కొలను కూడా సూపర్ ‘హిట్’లతో దూసుకుపోతున్నారు. హిట్ 1, హిట్ 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. హిట్ 3లో నాని నటిస్తున్నట్లు ‘హిట్ 2’ క్లైమ్యాక్స్‌లోనే అధికారికంగా ప్రకటించారు. వెంకటేష్‌తో సినిమా పూర్తయ్యాక ‘హిట్ 3’ మీదకు శైలేష్ వెళ్లే అవకాశం ఉంది. హిట్ సిరీస్‌లో మొత్తంగా ఏడు సినిమాలు ఉంటాయని శైలేష్ గతంలోనే చాలా సార్లు తెలిపారు. ఈ స్పీడ్‌ను బట్టి చూస్తే హిట్ వర్స్ పూర్తవ్వడానికి మరో 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati)

Published at : 23 Jan 2023 01:07 PM (IST) Tags: Venkatesh Sailesh kolanu Venky75 Venkatesh Next Movie

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం