అన్వేషించండి

బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డు- ఆ బాలీవుడ్ నటుడికి అస్సలు మింగుడు పడటం లేదా?

అల్లు అర్జున్ కు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం పట్ల పలువురు సినీ ప్రమఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఓ బాలీవుడ్ నటుడు మాత్రం తనకు ఆ అవార్డు రాకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నారట.

2021 ఏడాదికి గానూ చలనచిత్ర జాతీయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డులను జ్యూరీ సభ్యులు గురువారం (ఆగస్టు 24) ఢిల్లీలో వెల్లడించారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు వరించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి ఈ అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ‘పుష్ప’ సినిమాలో అద్భుత నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని ఘనత సాధించిన బన్నీకి ప్రశంసలు వెల్లువెత్తాయి.  సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు చెప్పారు. ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ ఘనంగా సన్మానించారు. అద్భుతమైన సందర్భంగా మర్చిపోలేని రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ తో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు బన్నీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. అభినందనలు చెప్పారు.  

బన్నీకి ఉత్తమ నటుడి అవార్డు దక్కడం అనుపమ్ కు నచ్చలేదా?

మరోవైపు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని భావించి భంగపడ్డ నటులు నిరాశలో మునిగిపోయారు.  తనకు ఉత్తమ నటుడి అవార్డు రాకపోవడం పట్ల బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్ 'ది కాశ్మీర్ ఫైల్స్'లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాశ్మీర్ పండిట్ గా పాత్రలో ఒదిగిపోయిన నటించారు. చుట్టూ అల్లరి మూకలు విజృంభిస్తున్న వేళ ప్రాణభయంతో పారిపోయే శరణార్ధిగా నటించారు. ఈ పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పడం బాగుంటుంది. ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా వచ్చిన అద్భుత స్పందన నేపథ్యంలో తప్పకుండా తనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని ఆయన భావించారు. కానీ, చివరకు ఆ అవార్డు అల్లు అర్జున్ ను వరించింది.

నాక్కూడా అవార్డు వస్తే బాగుండేది- అనుపమ్ ఖేర్

'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం విభాగంలో అవార్డు దక్కించుకుంది. అటు ఉత్తమ సహాయనటిగా ఈ చిత్రంలో నటించిన పల్లవి జోషి అవార్డుకు ఎంపిక అయ్యింది.  అవార్డుల ప్రకటన తర్వాత అనుపమ్ ఖేర్ 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రానికి రెండు అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తన నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. “ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గీస్ దత్ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. నటుడిగానే కాకుండా సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా నేను వ్యవహరించారు. మా సినిమాకు ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. నా నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. ప్రతి విజేతకు నా హృదయపూర్వక అభినందనలు! జై హో!” అని ట్వీట్ చేశారు. అయితే, అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం అనుపమ్ ఖేర్ కు ఇష్టం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Read Also: వరలక్ష్మీ వ్రతంపై చిల్లర కామెంట్స్, చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ganguly Doosra Row: గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
Family Drama OTT : మూడు ఫ్యామిలీస్... ఊహించని షాక్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ
మూడు ఫ్యామిలీస్... ఊహించని షాక్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ
Ramayana Review : సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ
సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget