News
News
వీడియోలు ఆటలు
X

Venkatesh Turns God : దేవుడిగా మారిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ దేవుడిగా మారారు. అదీ ఒక యువ హీరో కోసం! భగవంతుడిగా వెంకటేష్ తన మహిమ చూపించడం కూడా స్టార్ట్ చేశారు. మరిన్ని వివరాలకు వార్త చదవండి!

FOLLOW US: 
Share:

విక్టరీ వెంకటేష్ (Venkatesh) దేవుడిగా మారారు. అదీ యువ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కోసం! ఆల్రెడీ భగవంతుడిగా మారిన వెంకటేష్, తన మహిమలు చూపించడం ప్రారంభించారు. ఆయన ఎందుకు భగవంతుడిగా మారారు? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...

విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఓరి దేవుడా' (Ori Devuda Movie). తమిళంలో అశోక్‌ సెల్వన్‌, 'గురు' ఫేమ్‌ రితికా సింగ్‌ జంటగా నటించిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్‌ ఇది. ఒరిజినల్‌ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్‌ మారిముత్తు తెలుగు సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే... ఇదొక ఫాంటసీ ఫిల్మ్. ఇందులో దేవుడి పాత్ర కూడా ఉంటుంది.

తమిళంలో విజయ్ సేతుపతి...
తెలుగులో విక్టరీ వెంకటేష్!
తమిళ సినిమా 'ఓ మై కడవులే'లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దేవుడి రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ చేస్తున్నారు. దేవుడు అనగానే కిరీటం, స్వర్గం వంటివి ఎక్స్‌పెక్ట్‌ చేయవద్దు. మోడ్రన్ మనిషిలా ఉంటారు. ఇంకా చెప్పాలంటే... వెంకటేష్ 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించినట్లు! ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాలో వెంకటేష్ అలా కనిపించనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వెంకటేష్, ఇతర తారాగణం పాల్గొనగా... 'ఓరి దేవుడా'లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ వీకెండ్ లోపు ఆయన షూటింగ్ కంప్లీట్ అవుతుందని టాక్.

Also Read : బాయ్‌కాట్‌ ట్రెండ్‌ను తీసి పారేసిన నాగార్జున - వందో సినిమా గురించి ఏం చెప్పారంటే?

'ఓరి దేవుడా' చిత్రానికి పెరల్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి, 'దిల్‌' రాజు నిర్మాతలు. హీరోగా విశ్వక్‌ సేన్‌కు 6వ సినిమా ఇది. ఇందులో మిథిలా పాల్కర్‌ (Mithila Palkar) హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, ఒక సాంగ్ విడుదల చేశారు.ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం డైలాగులు రాస్తున్నారు. ఈ మధ్య విడుదలైన 'ఓకే ఒక జీవితం' సినిమాకు ఆయన డైలాగులు రాసిన సంగతి తెలిసిందే. సంభాషణల రచయితగా ఆయన రాస్తున్న మరో చిత్రమిది.

హిందీ సినిమాలోనూ అతిథిగా!
విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా'లో మాత్రమే కాదు... సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న హిందీ సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలో కూడా వెంకటేష్ అతిథి పాత్ర చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారు.  

హీరోగా వెంకటేష్ నెక్స్ట్ ఏంటి?
'ఎఫ్ 3' సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ సందడి చేశారు. ఆ తర్వాత ఆయన మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. వెంకీతో సినిమా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి తేజ వరకు చాలా మంది కథలు చెప్పారు. కానీ, ఏదీ ఓకే కాలేదు. వేరే సినిమాలతో ఆయన దర్శకులు బిజీ బిజీ అవుతున్నారు. హిందీలో హిట్ అయిన 'దే దే ప్యార్ దే' రీమేక్ రైట్స్ వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు దగ్గర ఉన్నాయి. బహుశా... ఆ రీమేక్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు వెంకటేష్ సోలో హీరోగా మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. మంచి కథలు వస్తే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. 

Also Read : రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత హీరోయిన్‌గా నన్ను తీసేశారనుకున్నా - సిద్ధీ ఇద్నాని ఇంటర్వ్యూ

Published at : 14 Sep 2022 09:20 AM (IST) Tags: Venkatesh Vishwak sen Mithila Palkar Ori Devuda movie Venkatesh Plays God

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !