Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న 'ఓ మై కడవులే' అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
సీనియర్ హీరో వెంకటేష్(Venkatesh) ఇటీవల 'ఎఫ్3'(F3) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మోస్తరుగా ఆడింది. ఓటీటీలో కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఈ సినిమాను హిట్ అనే చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వెంకీ రీసెంట్ గా ఓ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న 'ఓ మై కడవులే' అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
తెలుగులో దీనికి 'ఓరి దేవుడా'(Ori Devuda) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటిస్తున్నారు. 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం' వంటి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నారు విశ్వక్. 'ఓరి దేవుడా' సినిమాలో అతడి పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందట. ఈ సినిమాకి అశ్వత్ మరిముత్తు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో దేవుడి పాత్ర కీలకంగా ఉంటుందట.
Venkatesh to play key role in Ori Devuda Movie: తమిళంలో ఈ పాత్రను విజయ్ సేతుపతి పోషించారు. తెలుగులో ఆ పాత్ర కోసం ఓ టాప్ హీరోను తీసుకోవాలనుకున్నారు. ఫైనల్ గా వెంకటేష్ దానికి ఓకే చెప్పారు. సినిమాలో వెంకీ పార్ట్ క్యామియో రోల్ మాదిరి ఉంటుంది. అందుకే నాలుగు రోజుల కాల్షీట్స్ మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వెంకటేష్ పై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అక్కడితో షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. మిథాలీ పార్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా తెరకెక్కిస్తోంది.
ఈ సంగతిలా ఉంటే.. ఈ ప్రాజెక్ట్ తో పాటు వెంకీ చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'కభీ ఈద్ కభీ దివాలి' అనే సినిమాలో వెంకీ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వెంకీ, పూజా ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తుండడంతో తెలుగునాట ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
Rana Daggubati, Venkatesh Daggubati starrer Netflix series Rana Naidu: దీంతో పాటు 'రానా నాయుడు'(Rana Naidu) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు వెంకీ. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. బాబాయ్, అబ్బాయ్ లు కలిసి నటిస్తోన్న సిరీస్ కావడంతో మంచి బజ్ ఏర్పడింది. ఇక 'రానా నాయుడు' స్టోరీ విషయానికొస్తే.. అమెరికన్ క్రైమ్ డ్రామా 'రే డొనోవన్'కు ఇండియన్ అడాప్షన్. భారతీయ నేటివిటీ, ఇక్కడి ప్రేక్షకులో అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను టెలికాస్ట్ చేయనున్నారు.
Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!
Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే