అన్వేషించండి

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న 'వీర సింహా రెడ్డి'ని సంక్రాంతికి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ విడుదల తేదీని ప్రకటించారు. 

నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా రూపొందుతోన్న ఫ్యాక్షన్ సినిమా 'వీర సింహా రెడ్డి'. సంక్రాంతి బరిలో దిగడమే లక్ష్యంగా చిత్ర బృందం పని చేస్తోంది. తొలుత డిసెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... చిత్రీకరణ అనుకున్న విధంగా కంప్లీట్ కాలేదు. అందుకని, సంక్రాంతికి వెళ్ళారు. ఈ రోజు సినిమా విడుదల తేదీ వెల్లడించారు. 

జనవరి 12న 'వీర సింహా రెడ్డి'
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'వీర సింహా రెడ్డి' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. ముందు నుంచి ఈ తేదీకి సినిమా వస్తుందనేది తెలిసిందే. కాకపోతే ఈ రోజు అధికారికంగా వెల్లడించారు.
 
విజయ్ 'వారసుడు' vs 'వీర సింహా రెడ్డి'
సంక్రాంతి బరిలో తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతోన్న 'వారసుడు' వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు తెలుగు రాష్ట్రలో థియేటర్లను విజయ్, బాలకృష్ణ పంచుకోవాలి. వీళ్ళిద్దరూ వచ్చిన మరుసటి రోజు... జనవరి 13న 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ థియేటర్లలోకి రానున్నారు. మూడు సినిమాలకు ఎటువంటి ఓపెనింగ్స్ లభిస్తాయో? అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

'అఖండ' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నుంచి వస్తున్న సినిమా కావడంతో 'వీర సింహా రెడ్డి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా 'క్రాక్' విజయంతో మంచి హుషారుగా సినిమా తీస్తున్నారు.

అటు టర్కీ... ఇటు అనంతపురం!
ఫ్యాక్షన్ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ అంటే ప్రేక్షకులకు, ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది రాయలసీమ. ఆ సీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో కొంత షూటింగ్ చేశారు. అంతకు ముందు టర్కీలో కూడా షూటింగ్ చేశారు. బాలకృష్ణ, శృతి హాసన్ మీద టర్కీలో తీసిన సీన్లు అందరినీ అలరిస్తాయని టాక్. అక్కడ తీసిన ఫైట్ అయితే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందట. 

Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?

వాస్తవ ఘటనల ఆధారంగా 'వీర సింహా రెడ్డి'
ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ. 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అలాగే, 'సింహా' టైటిల్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 'వీర సింహా రెడ్డి'లో కూడా సింహా ఉంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. టైటిల్ సెంటిమెంట్ మాత్రమే కాదు... సినిమాలో అద్భుతమైన కంటెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.  

హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Embed widget