Ghani OTT Release: ఓటీటీలోకి 'గని' రిలీజ్ ఎప్పుడంటే?
వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సయీ మంజ్రేకర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ కి ముందు సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఏ సినిమా అయినా విడుదలైన నాలుగైదు వారల తరువాతే ఓటీటీలోకి వస్తుంది. నిర్మాతలు అలానే అగ్రిమెంట్స్ చేసుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు మాత్రం రెండు, మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తే.. 'రాధేశ్యామ్' సినిమా రెండు వారాల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దర్శనమిచ్చింది.
ఇప్పుడు 'గని' సినిమా కూడా విడుదలైన మూడు వారాలకు అంటే ఏప్రిల 29నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి వారు కీలకపాత్రలు పోషించారు.
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















