అన్వేషించండి

Operation Valentine: మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా- ‘ఆపరేషన్ వాలెంటైన్‘ టీజర్ మరో లెవెల్ అంతే!

Operation Valentine Teaser: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Operation Valentine Teaser: మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన స్టోరీతో ఈ మూవీ రూపొందుతోంది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మితమవుతోంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ విడుదల అయ్యింది. ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.

కళ్లు చెదిరే విజువల్ ట్రీట్, అదిరిపోయే డైలాగ్స్  

“మన ఎయిర్ ఫోర్స్‌ ను ఇంకో దేశానికి పంపించడమంటే.. వార్ ను డిక్లేర్ చేయడమే” అనే ఎయిర్ చీఫ్ చెప్పే మాటలతో టీజర్ మొదలవుతుంది. “ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలు ఉండవు. సరిహద్దులు మాత్రమే ఉంటాయి” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక, వరుణ్ తేజ్ డైలాగ్స్  మరింత పవర్ ఫుల్ గా ఉన్నాయి. శత్రువుకు బుద్ది చెప్పే సమయం వచ్చిందంటూ.. “మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా” అనే డైలాగ్ తో తోటి ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో దేశభక్తిని నింపే ప్రయత్నం చేస్తారు. ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా వరుణ్ తేజ్ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో యుద్ధ విమానాల విన్యాసాలు గూస్ బంప్స్ కలిగించేలా ఉన్నాయి. వైమానిక దాడులను అత్యద్భుతంగా తెరకెక్కించారు. కెప్టెన్ రుద్రగా వరుణ్ చక్కటి పాత్రను పోషించారు. హీరోయిన్ మానుషి కూడా ఎయిర్ ఫోర్స్ లోనే పని చేస్తుంది. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ కూడా జనాలను ఆకట్టుకునేలా ఉంది. ఇక సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో లెవర్ అని చెప్పుకోవచ్చు.

యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న‘ఆపరేషన్ వాలెంటైన్’

నిజానికి ఈ సినిమాను భారత వైమానికి దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజా టీజర్ చూస్తుంటే, పాక్ ఉగ్ర స్థావరాలు, లాంఛ్ ప్యాడ్స్ మీద దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా రూపొందించినట్లు అర్థం అవుతోంది. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచిందని చెప్పుకోవచ్చు.

వరుణ్ ఆశలన్నీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీదే!

అటు గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఒకప్పుడు వరుణ్ సినిమా అంటే కచ్చితంగా ఆడేస్తుంది అని ప్రేక్షకులు భావించేవారు. కానీ, ఆయన గత చిత్రాలు వరుసగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ‘గని’, ‘గాండీవధారి అర్జున’ సినిమాలు మరింత దారుణ ఫలితాలను ఇచ్చాయి. అంతకు మందు వచ్చిన ‘F3’ కూడా మరీ చెప్పుకోదగ్గ విజయాన్ని ఏమీ అందుకోలేదనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని ఆయన భావిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదలకానుంది.  

Read Also: 'సలార్' టికెట్స్ - ఏపీ, తెలంగాణలో ఇంకా ఎందుకు ఓపెన్ కాలేదంటే?

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
Crime Thriller OTT: బావిలో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం... మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
బావిలో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం... మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget