అన్వేషించండి

Salaar: 'సలార్' టికెట్స్ - ఏపీ, తెలంగాణలో ఇంకా ఎందుకు ఓపెన్ కాలేదంటే?

Salaar advance booking AP Telangana: 'సలార్' విడుదలకు ఇంకో రెండు రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఇంకా ఏపీ, తెలంగాణలో బుకింగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదు? అంటే...

Why hasn't advance booking for Prabhas Salaar opened in Andhra Pradesh and Telangana?: సలార్... ఇప్పుడు కేవలం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా! అందులోనూ యాక్షన్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా ఫీవర్ ఒక రేంజ్ అని చెప్పాలి.

ఏపీ, తెలంగాణలో ఎందుకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు!?
అమెరికాలో 'సలార్' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నార్త్ ఇండియాలోనూ సేల్స్ స్టార్ట్ చేశారు. ఆఖరికి తమిళనాడులో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. చెన్నై సిటీలో తెలుగు షోస్ కూడా షెడ్యూల్ చేశారు. టికెట్స్ అమ్మకాలు ప్రారంభించారు. కానీ, ప్రభాస్ (Prabhas)కు పట్టున్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలో ఇంకా టికెట్స్ అమ్మకాలు ప్రారంభించలేదు. ఎందుకు? అంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో టికెట్ రేట్స్ పెంచమని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రభాస్ సన్నిహితులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల, ఇంకా బుకింగ్స్ స్టార్ట్ కాలేదు.

Also Read: 'కెజియఫ్'లో చేసిన తప్పే మళ్ళీ 'సలార్'కు...

ఈ రోజు నుంచి బుకింగ్స్ మొదలు?
'సలార్' టికెట్ రేటును 50 రూపాయల వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం జీవో రావచ్చు. మరోవైపు తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏది ఏమైనా సరే... ఈ రోజు చర్చలు ముగుస్తాయని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే... రేటు ఎంత పెడతారు? అనేది చూడాలి. 

Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!

ప్రభాస్ కథానాయకుడిగా... అతని స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన 'సలార్'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 'కెజియఫ్' చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థపై భారీ నిర్మాణ వ్యయంతో విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు. 

Salaar cast and crew names : 'సలార్'లో ప్రభాస్ జోడీగా స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ నటించారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తే... ఓ షాట్ లో ఆమె కూడా ఉన్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది.

'సలార్' సినిమాలో ఇతర నటీనటుల విషయానికి వస్తే... ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటించారు. 'కెజియఫ్'లో కూడా ఆమె ఉన్నారు. అయితే... అందులో ఆమెది ముస్లిం పాత్ర. ఇందులో హిందూ పాత్ర! ఇక, కథలో కీలకమైన వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget