By: ABP Desam | Updated at : 24 Dec 2022 07:46 PM (IST)
'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంలోని 'వాసవ సుహాస...' పాటలో కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించారు. ఇందులోని తొలి పాట 'వాసవ సుహాస...'ను ఈ రోజు విడుదల చేశారు.
'వాసవ సుహాస...' పాటను ముందుగా కళాతపస్వి కె విశ్వనాథ్‌కు వినిపించింది చిత్ర బృందం. ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. పాట విన్నాక... ''నా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి'' అని విశ్వనాథ్ తెలిపారు. ఇటువంటి పాటను నిర్మాతలు ఎలా ఒప్పుకొన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు విడుదలైన పాట వింటే, ఆ సాహిత్యం చూస్తే... విశ్వనాథ్ అలా ఎందుకు అన్నారో తెలుస్తుంది.
పాట ప్రారంభానికి ముందు తాత, మనవడు మధ్య జరిగే సంభాషణ సినిమాలోని కథా సారాంశాన్ని తెలిపే విధంగా ఉంది. కనిపించే ప్రతివాడు మన పక్కింటి వాడేనని సందేశాన్ని సినిమాలో ఇస్తున్నారని అర్థమైంది. ''నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావ్ అన్నదాని బట్టే ఉంటుంది'' అని 'శుభలేఖ' సుధాకర్ చెప్పే మాట బావుంది. కనిపించే ప్రతి మనిషికి సాయం చేసే గుణం ఉన్న యువకుడిగా హీరో పాత్రను పాటలో పరిచయం చేశారు. కిరణ్ అబ్బవరం లుక్ కూడా పక్కింటి కుర్రాడిలా ఉంది (Vaasava Suhaasa Full Song).
Also Read : బాలకృష్ణ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ - ముగ్గురు హీరోయిన్లు ఏం చెప్పారంటే?
కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని అంత గొప్పగా పాట రాశారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన బాణీ, కారుణ్య గానం కూడా బావున్నాయి. ఈ పాటకు విశ్వ రఘు నృత్య దర్శకత్వం వహించారు. ఇందులోని సాహిత్యం అర్థం కాకున్నా మళ్ళీ వినాలనిపించేలా ఉంది. సాహిత్యానికి అర్థం తెలుసుకోవాలంటే... కింద ఫోటో మీద ఓ లుక్ వేయండి.
ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము...'
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. దానికి మూడు రోజుల తర్వాత... ఫిబ్రవరి 17, 2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ'ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఆల్రెడీ శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్... ఆ తర్వాత జూలైలో టీజర్ విడుదల చేశారు. చిత్తూరు నేపథ్యంలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుమల తిరుపతి కొండల కింద జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది.
Also Read : పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' కోసం హిందీ హీరో వచ్చాడోచ్
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది.
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య గమిడి - శరత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సహ నిర్మాత: బాబు, సంగీతం: చైతన్ భరద్వాజ్.
Movies Release in OTT: ఈ వీకెండ్ ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం
G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!