News
News
X

Bobby Deol In HHVM Movie : పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' కోసం హిందీ హీరో వచ్చాడోచ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరి హర వీర మల్లు' సినిమాలో విలన్‌గా హిందీ హీరో బాబీ డియోల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు' (Hari Hara Veera Mallu). ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ (Bobby Deol) నటించనున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఆయన హైదరాబాద్ వచ్చారు. షూటింగులో జాయిన్ అయ్యారు. 

ఔరంగజేబుగా బాబీ డియోల్!
'హరి హర వీర మల్లు' సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఆయన మల్ల యోధుడు వీరమల్లుగా కనిపించనున్నారు. భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలం నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. ఇందులో మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో  బాబీ డియోల్ నటించనున్నట్లు తెలిసింది.
 
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్లి బాబీ డియోల్‌కు కథ , అందులో క్యారెక్టర్ గురించి వివరించారు. ఆల్రెడీ హిందీలో క్రిష్ సినిమాలు చేసి ఉండటం, ఆయన డైరెక్షన్ గురించి ఐడియా ఉండటం, క్యారెక్టర్ నచ్చడంతో బాబీ డియోల్ వెంటనే ఒకే చెప్పేశారట.
 
తెలుగులో బాబీకి తొలి చిత్రమిది
'హరి హర వీర మల్లు' పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అయితే, బాబీ డియోల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. వెబ్ సిరీస్ కూడా! ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  
  
వచ్చే ఏడాది వేసవిలో విడుదల
ఇటీవల సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇప్పుడు బాబీ డియోల్ షెడ్యూల్ కోసం సిటీలోని ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ కారు దిగిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ఇండియన్ సినిమాలో బిగ్ యాక్షన్ స్టార్ అయిన బాబీ డియోల్‌తో పని చేస్తుండటం సంతోషంగా, ఎగ్జైటెడ్ గా ఉంది'' అని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.  

Also Read : బాలకృష్ణ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగితే - ముగ్గురు హీరోయిన్లు ఏం చెప్పారంటే?

పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. 

'హరి హర వీర మల్లు' సెట్స్ మీద ఉండగా... హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారట. జనవరి తర్వాత ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు టాక్. డీవీవీ దానయ్య నిర్మాతగా సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాకు పవన్ కళ్యాణ్ పూజ చేశారు. వచ్చే ఏడాది ఆ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు టాక్. 

Also Read : '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Published at : 24 Dec 2022 11:26 AM (IST) Tags: Director Krish Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Bobby Deol

సంబంధిత కథనాలు

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన