Radhe Shyam Pre-Release Event: అప్‌డేట్స్ లేట్ అయ్యేది అందుకేనన్న యూవీ వంశీ.. ఆన్సర్ విని ఫ్యాన్స్ అవాక్కు!
యూవీ క్రియేషన్స్ అప్‌డేట్స్ ఎందుకు ఆలస్యం అవుతాయనే ప్రశ్నకు నిర్మాత వంశీ ఫన్నీగా జవాబిచ్చారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎప్పుడూ ఉండే క్లంప్లైంట్ అప్‌డేట్స్ ఆలస్యంగా ఇస్తారు అనే. రాధే శ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హోస్ట్ అవతారం ఎత్తిన నవీన్ పోలిశెట్టి డైరెక్ట్‌గా యూవీ క్రియేషన్స్ వంశీని ఈ ప్రశ్న అడిగేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అప్‌డేట్స్ ఎందుకు ఆలస్యంగా వస్తాయి అని నేరుగా నిర్మాత వంశీని అడిగేయగా.. ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం వీక్ అని ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు నవీన్ పోలిశెట్టి, రష్మి హోస్టింగ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఈవెంట్లో విడుదల చేశారు. ట్రైలర్ నిడివి మూడు నిమిషాలకు పైనే ఉంది. ఈ ట్రైలర్‌లో కథను కొంచెం రివీల్ చేశారు.
ప్రపంచం మొత్తం కలవాలనుకునే హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్‌ను ఇందులో చూపించారు. దీంతోపాటు పూజా హెగ్దే, ప్రభాస్‌ల మధ్య లవ్ ట్రాక్‌ను కూడా ట్రైలర్‌లో చూడవచ్చు. విజువల్స్ మాత్రం స్టన్నింగ్‌గా ఉన్నాయి. ట్రైలర్‌ను సినిమాపై అంచనాలు పెంచే విధంగా కట్ చేశారు.
2022 జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్దే నటించిన ఈ సినిమాలో.. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్, మేజర్ రవిచంద్రన్, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. దక్షిణ భారత భాషల వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
Relive the magical feeling of love. Presenting the #RadheShyamTrailer#RadheShyam
— UV Creations (@UV_Creations) December 23, 2021
Hindi : https://t.co/8nB6GxVwTp
Telugu : https://t.co/F9I4Z8385o
Tamil : https://t.co/cNkqrgVIsw
Kannada : https://t.co/z2dbG2owyn
Malayalam : https://t.co/BJrY3ajHja pic.twitter.com/IujIJw9Qa3
Also Read: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి