News
News
X

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

ఉర్ఫీ జావెద్‌ను ఓ వ్యక్తి రెండేళ్లుగా వేధిస్తున్నాడట. దీంతో ఆమె ఆ వ్యక్తి ఫొటో, వాట్సాప్ చాట్ హిస్టరీ బయటపెట్టింది.

FOLLOW US: 

ఎప్పుడూ తన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారుకు కిక్కెక్కించే ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసే క్యూట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్.. మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ వ్యక్తి తనను గత రెండేళ్లుగా లైంగిక వేధిస్తున్నాడని తెలిపంది. ఆ వ్యక్తి ఫోటోతో పాటు చాటింగ్  స్క్రీన్ షాట్స్ ను ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఆ వ్యక్తి తనను సైబర్ రేపింగ్ చేస్తున్నాడని ఆరోపించింది. డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని తెలిపింది. ఈ వేదింపులపై ఇప్పటికే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆ ఫోటో చూపిస్తూ రెండేళ్లుగా వేధింపులు: రెండు సంవత్సరాల క్రితం ఎవరో తన ఫోటోను అసభ్య రీతిలో మార్పింగ్ చేసినట్లు ఉర్ఫీ జావేద్ తెలిపింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. ఆ ఫోటో వల్ల తాను మానసికంగా కుంగిపోయానని, నరకం అనుభవించానని ఉర్ఫీ వాపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి తనకు ఆ ఫోటోను పంపి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టినట్లు చెప్పింది. ఆ ఫోటోకు సంబంధించిన రియల్ పిక్‌ను సోషల్ మీడియాలో పెట్టానని తెలిపింది. కొందరు వ్యక్తులు కావాలనే దాన్ని మార్పింగ్ చేసినట్లు చెప్పింది. ఈ ఫోటోను బేస్ చేసుకుని ఓ అజ్ఞాత వ్యక్తి తనను వేదించడం ప్రారంభించాడని చెప్పింది. ఆ  ఫోటోను చూపిస్తూ.. తనను వీడియో సెక్స్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వెల్లడించింది. లేదంటే ఆ ఫోటోను బాలీవుడ్ పేజీల్లో పోస్ట్ చేసి కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.  

పట్టించుకోని ముంబై పోలీసులు: రోజు రోజుకు ఆ వ్యక్తి నుంచి లైంగిక వేధింపులు తీవ్రం అవడంతో ముంబై పోలీసులను ఆశ్రయించినట్లు ఉర్ఫీ వెల్లడించింది. ఈ నెల 1వ తేదీన ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. పోలీసుల తీరు కూడా చాలా దారుణంగా ఉందని వెల్లడించింది. ఎఫ్ఐఆర్ నమోదై 15 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పింది. ముంబై పోలీసుల పనితీరు గురించి తాను చాలా గొప్పగా విన్నానని.. ఈ వ్యక్తి పట్ల వారి వైఖరి చాలా విచిత్రంగా ఉందని వెల్లడించింది.  

చాలా మందికి లైంగిక వేధింపులు: తనలాగే చాలా మంది యువతులు, మహిళలను సదరు వ్యక్తి ఇలాగే వేధించినట్లు తనకు తెలిసిందని చెప్పింది. కొంత మంది యువతులు, మహిళలను సదరు వ్యక్తి గురించి అడిగి తెలుసుకున్నట్లు చెప్పింది. వారు కూడా ఆ వ్యక్తితో వేధింపులకు గురైనట్లు చెప్పారని వెల్లడించింది. అతడు తనను ఎలా బ్లాక్ మెయిల్ చేసి వేధించాడో ఆధారాలతో సహా వారికి చెప్పానని తెలిపింది. వారు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారని చెప్పింది. ఆయా మహిళల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చినట్లు చెప్పింది. అయినా ఆ వ్యక్తి మీద వ్యక్తి మీద పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని వెల్లడించింది. పంజాబ్ సినిమా పరిశ్రమలో పని చేస్తున్న ఇలాంటి వ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా తిరగడం.. మహిళలకు చాలా ప్రమాదం అన్నది. వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉర్ఫీ జావేద్  కోరింది. 

View this post on Instagram
 
A post shared by Uorfi (@urf7i)

Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Also Read : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.

Published at : 15 Aug 2022 01:53 PM (IST) Tags: Urfi Javed Urfi Javed harassment case Cyber Raping cyber blackmailing

సంబంధిత కథనాలు

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Bigg Boss 6 Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Bigg Boss 6 Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి - సూర్య మధ్య గొడవ, అతనికి సీక్రెట్ టాస్క్

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam