News
News
X

Harihara Veeramallu: పవన్ సినిమా 50% షూటింగ్ పెండింగ్ - ఎప్పటికి పూర్తవుతుందో?

'వకీల్ సాబ్', 'భీమ్లానాయక్' లాంటి సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. కానీ 'హరిహర వీరమల్లు' మాత్రం ముందుకు కదలడం లేదు.

FOLLOW US: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది.

ఈ సినిమా తరువాత ఒప్పుకున్న 'వకీల్ సాబ్', 'భీమ్లానాయక్' లాంటి సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. కానీ 'హరిహర వీరమల్లు' మాత్రం ముందుకు కదలడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఇంకో యాభై శాతం పెండింగ్ లో ఉందట. అది కూడా చాలా కీలకమైన యాక్షన్ బ్లాక్స్ అని తెలుస్తోంది. అవన్నీ పూర్తి చేయడానికి ఎక్కువ సమయమే పడుతుందట. 

మరిలా చూసుకుంటే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు కేటాయించాలో..? షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడేమో కొత్తంగా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నారు పవన్. తననే నమ్ముకున్న 'హరిహర వీరమల్లు' దర్శకనిర్మాతలకు పవన్ ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి!

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ రాబోతుంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' టీమ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 

ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సినిమా రిలీజ్ అప్డేట్: (HariHara Veeramallu Release Date Update)

మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు. 

Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు

Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ

Published at : 31 Aug 2022 03:17 PM (IST) Tags: Krish Pawan Kalyan Harihara veeramallu AM Ratnam

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!