అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tollywood Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే
ఈ వారం పేరున్న సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం
![Tollywood Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే Upcoming Tollywood Movie Releases Tollywood Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/21/b88322f320278be30cf00a8b83bf596a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే
కరోనా కేసులు తగ్గడంతో థియేటర్లలో సినిమాల హవా బాగా పెరిగింది. వరుసపెట్టి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. గతవారం అరడజనుకి పైగా చిన్న సినిమాలు సందడి చేశాయి. ఈ వారం పేరున్న సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
వలిమై:
కోలీవుడ్ స్టార్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'వాలిమై'. జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందించారు. అజిత్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాను తమిళంలో భారీ ఎత్తున విడుదల చేయాలనుకున్నారు. అలానే బోనీ కపూర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పట్టు కారణంగా హిందీలో అనువాదం చేసి విడుదల చేయాలనుకున్నారు. ఫిబ్రవరి 24న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.
View this post on Instagram
భీమ్లానాయక్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25న అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
గంగూబాయి కతియావాడి:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ నటించిన లేటెస్ట్ సినిమా 'గంగూబాయి కథియావాడి'. సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన మాఫియా క్వీన్ గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఫైనల్ గా ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram
సెహరి:
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన సినిమా 'సెహరి'. జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25నుంచి 'ఆహా'లో సినిమా టెలికాస్ట్ కానుంది.
1 Boy 👨, 3 Girls 👱🏻♀️👩🦳👩🏻, 1 Story 📖. Neither triangle nor quadrangular, Mari intaki e love story ento, aa sehari ento. Teluskondi. Vacchesthundi ga Feb25th #SehariOnAha@HarshKanumilli @SimranCOfficial @gnanasagardwara @prashanthvihari @PicturesVirgo #AdvayaJishnuReddy pic.twitter.com/O1QFtgoPvF
— ahavideoIN (@ahavideoIN) February 18, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion