Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలివే
ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించబోయే సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
హే సినామిక - ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ 'హే సినామిక' అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. మార్చి 3న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి '96' ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు.
View this post on Instagram
ఆడవాళ్లు మీకు జోహార్లు - కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్(Sharwanand), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
View this post on Instagram
సెబాస్టియన్ పీసీ 524 - 'రాజా వారు రాణి గారు', 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' విజయాల తర్వాత కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన సినిమా 'సెబాస్టియన్ పీసీ 524'. మార్చి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరోకి రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్) ఉంటే... పోలీస్ కానిస్టేబుల్‌గా అతడికి నైట్ డ్యూటీస్ పడితే? ఏం జరిగిందనే కథాంశంతో సినిమా తీశారు.
ఓటీటీ రిలీజులు :
డీజే టిల్లు - సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంది. మార్చి 4వ తేదీ నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.
View this post on Instagram
సామాన్యుడు - విశాల్ హీరోగా తు.ప.శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సామాన్యుడు'. డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 26న విడుదలైంది. ఇప్పుడు మార్చి 4న జీ 5 వేదికగా విడుదల కానుంది.