News
News
X

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

ఈ వారం దసరా సందర్భంగా కొన్ని సినిమాలు థియేటర్లలో, కొన్ని ఓటీటీల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

FOLLOW US: 
ఈ వారం దసరా సందర్భంగా కొన్ని సినిమాలు థియేటర్లలో, కొన్ని ఓటీటీల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
 
గాడ్ ఫాదర్:
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
 
ది ఘోస్ట్: 
అక్కినేని నాగార్జున(Nagarjuna) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'(The Ghost). సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. దీనికి ప్రవీణ్ సత్తారు(Praveen Sattharu) దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. 
 
స్వాతిముత్యం: 
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా 'స్వాతిముత్యం'. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఓటీటీ రిలీజెస్
'జీ5'లో 'కార్తికేయ2': 
యంగ్ హీరో నిఖిల్(Nikhil) నటించిన 'కార్తికేయ2'(Karthikeya2) సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై హిట్ టాక్ తో సంపాదించుకుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధించింది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీ5లో తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ ను అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు. 
 
బింబిసార: 
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara) సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 7నుంచి జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 
 
రంగ రంగ వైభవంగా: 
మెగాహీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 
 
రక్షాబంధన్: 
అక్షయ్ కుమార్ నటించిన 'రక్షాబంధన్' సినిమా అక్టోబర్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. 
 
'ఆహా' యాప్ లో అనసూయ నటించిన 'దర్జా', అలానే 'ఉనికి' అనే సినిమాలు అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. 
 
'ఈషో' అనే మలయాళం సినిమాను తెలుగులో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 
 
డిస్నీ హాట్ స్టార్ లో 'ఎక్స్ పోజ్డ్' అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలానే 'ప్రే' అనే సినిమా అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 
 
అమెజాన్ ప్రైమ్ లో 'మజా మా' అనే హిందీ సినిమా అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 
Published at : 03 Oct 2022 03:31 PM (IST) Tags: God Father The Ghost Bimbisara karthikeya2

సంబంధిత కథనాలు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Unstoppable 2 Episode 5 : లెజెండరీ దర్శక నిర్మాతలతో 'లెజెండ్' బాలకృష్ణ - ఈ వారం 'అన్‌స్టాపబుల్' మామూలుగా ఉండదు

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

Singer Jake Flint Died : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్