By: ABP Desam | Updated at : 04 Oct 2022 03:02 PM (IST)
Edited By: Murali Krishna
బాలయ్య అన్‌స్టాపబుల్- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!
Chandrababu In Unstoppable Show: నందమూరి బాలయ్య హోస్ట్‌గా ఉన్న అన్‌స్టాపబుల్-2లో ఫస్ట్ గెస్ట్‌గా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రాబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసక్తికరమైన క్వశ్చన్స్‌తో గెస్ట్‌లను తికమక పెట్టే బాలయ్య... తన వియ్యంకుడు, పార్టీ అధినేతను ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హాట్ టాక్
ఇంతకీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగి ఉంటుంది. పార్టీతో పాటు చంద్రబాబు వ్యక్తిగత విషయాలు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనివి ఏమైనా అడిగి ఉంటారా అనేది కూడా టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ పేరుతో ఆనాటి అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని ఏమైనా టచ్ చేసి ఉంటారా... భవిష్యత్‌లో పార్టీలో జరగబోయే మార్పులు గురించి అడిగి ఉంటారా అనేది చూడాల్సి ఉంది.
ఓ రేంజ్‌లో
నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ గా చేసిన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోకు ఏ రేంజిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సీజన్ తొలి ఎపిసోడ్‌లో కాంట్రవర్సీ కింగ్ మోహన్ బాబు గెస్ట్‌గా వచ్చారు. అప్పట్లో బాలయ్య, మోహన్ బాబు మధ్య జరిగిన డిస్కషన్ చాలా సంచలనంగా మారింది. మంచి రేటింగ్ కూడా వచ్చింది. తర్వాత జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కూడా అదే టెంపోను కొనసాగించారు బాలయ్య.
సెకండ్ సీజన్ ప్రారంభవుతోందని ప్రోమో వచ్చినప్పటి నుంచి గెస్ట్ ఎవరనే ఆసక్తి అందరిలో ఉండేది. ఇంత వరకు గెస్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రోమోగానీ, ప్రకటన గానీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో చంద్రబాబు, బాలకృష్ణ కలిసి ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో తొలి గెస్ట్ చంద్రబాబు అని తెలుస్తోంది.
ప్రశ్నలకు ఫ్యాన్స్
మొదటి ఎపిసోడ్ నుంచి సినీ పరిశ్రమకు చెందిన టాప్ సెలబ్రిటీలు ఈ టాక్ షోలో పాల్గొనడంతో సూపర్, డూపర్ సక్సెస్ అయ్యింది. సెలబ్రీటీలను ఆయన అడిగే ప్రశ్నలు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ షోకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు బాలయ్య. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ఆయన చేసిన సందడి ఓ రేంజిలో ఉండేది. గతంలో ఎప్పుడూ కనిపించని బాలయ్య ఈ షోతో జనాలకు మంచి ట్రీట్ ఇచ్చారు. తొలి సీజన్ అనుకున్న దానికంటే అద్భుత సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం కొనసాగింపుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2తో బాలయ్య మళ్లీ అలరించబోతున్నారు.
యాంథమ్
ఆహాలో త్వరలో ప్రసారం కాబోతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2 షో యాంథమ్ ఆహా విడుదల చేసింది. తాజాగా ఈ షో ట్రైలర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ట్రైలర్ ను తెరకెక్కించారు. హైదరాబాద్‌లో ఈ ట్రైలర్ షూటింగ్ కొనసాగింది. ఈ ట్రైలర్ లో కొంత భాగం సారథి స్టూడియోలో, మరి కొంత భాగం అన్నపూర్ణ సెట్ లో చిత్రీకరించారు. బాలయ్య డిఫరెంట్ గెటప్ లో ఈ షూట్ లో పాల్గొన్నారు. తాజాగా ఈ షూట్ కు సంబంధించిన ఫోటోలను ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ షోకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రానున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా హోస్ట్ అవతారం ఎత్తారు. అంతేకాదు ఓ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. మోహన్ బాబు చిట్‌చాట్‌తో మొదలైన ఈ షో.. మహేష్ బాబుతో ఎండ్ అయింది. ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారు. ఈ షోలో హోస్ట్‌గా బాలయ్య ఎలా రక్తించడానేది సెపరేట్‌గా చెప్పాాల్సిన పనిలేదు.
నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి అలరించిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది.
Also Read : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్
అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు
ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన
Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా