Prema Entha Madhuram July 5th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: బానుని మెచ్చుకున్న వసుంధర, ఈవెంట్ అంజలి వాళ్ళదని షాక్ లో ఉన్న అను?
తను చేస్తున్న ఈవెంట్ అంజలి వాళ్ళ కోసమని అను తెలుసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 5th: అనుని వెతకడం కోసం ఆర్య శంకర్ వాళ్లకు.. త్వరలో ఎన్నికలు రానున్న సందర్భంగా కొత్త ఓటర్ల కోసం అప్లై చేస్తూ ఉంటారు దాంతో సోషల్ సర్వీస్ కోసం మనలో కొంతమందిని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది ఆ సమయంలో అనుని వెతకొచ్చు అని అంటాడు. అప్పుడే శంకర్ ఒకవేళ అను తన డీటెయిల్స్ అన్నీ మార్చుకుని ఉంటే ఎలా అని అనటంతో.. బయోమెట్రిక్ ఆధారంతో పట్టుకోవచ్చు అని అంటాడు ఆర్య. ఇక వారికి కూడా దాని గురించి వివరిస్తూ ఉంటాడు.
ఇక త్వరలో దీనికి సంబంధించి మీటింగ్ పెడతాను అని ఆర్య వాళ్లకు చెప్పి పంపిస్తాడు. ఇక జెండే ఈ ప్లాన్ బాగుంది కచ్చితంగా అను దొరుకుతుంది అని అనటంతో ఆర్య డౌట్ తో దొరుకుతుందా అని అంటాడు. దాంతో జెండే కాస్త బాధపడుతున్నట్లు కనిపిస్తాడు. మరోవైపు ప్రీతి అను, రేష్మలతో కార్ లో ఉంటుంది. వారంతా వసుంధర ఇంటికి డెకరేషన్ చేయడానికి వెళ్తుంటారు. ఇక ప్రీతి అనుని మొదటి రోజే ఈవెంట్ పట్టుకున్నావు అంటూ పొగుడుతూ ఉంటుంది.
మధ్యలో రేష్మ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో వసుంధర ఫోన్ చేసి అను తో టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది. దాంతో అను ఏం టెన్షన్ పడొద్దు అని.. మా టీం తో కలిసి వస్తున్నాము అని చెప్పటంతో వసుంధర కాస్త ధైర్యంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రీతి నువ్వు ఇలా మాట్లాడితే ఒకటి ఏంటి 100 ఈవెంట్లు కూడా చేస్తావు భాను అని అంటుంది. ఇక రేష్మ సరదాగా మాట్లాడుతూ ఉండటంతో మీరిద్దరు అసలు ఎలా పరిచయమయ్యారు అని అడుగుతుంది ప్రీతి.
దానితో రేష్మ అను నేను ఒకటే వీధిలో ఉంటాము కదా అను అనటంతో అను షాక్ అవుతుంది. వెంటనే ప్రీతి భాను పేరును అను అని పిలుస్తున్నావా అంటూ సరదాగా అనటంతో తనకు డౌట్ రాలేదు అని అనుకుంటుంది. మరోవైపు వసుంధరకు అంజలి ఫోన్ చేసి నేరుగా ఇంటికి రాకుండా గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లావు అని అంటుంది. హెల్త్ కూడా డిస్టర్బ్ అయిందని తెలిసింది ఇక్కడికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది.
దాంతో వస్తుంది రా చిన్న సర్ప్రైజ్ ఉంది.. నువ్వు మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసేయ్ అని అంటుంది. ఇక ఇంటికి చేరుకున్న అను వాళ్ళు అక్కడ డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఇక అనుని ప్రీతి టీ తాగమని కాస్త రిలీఫ్ అవుతుంది అనటంతో అను వద్దనడంతో రేష్మ వచ్చి టీ తీసుకొని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వసుంధర వచ్చి డెకరేషన్ చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది.
అంతేకాకుండా వారిద్దరి ఫొటోస్ కూడా ఇస్తాను అది బయట పెట్టండి మరింత సర్ ప్రైజ్ అవుతారు అని ఇప్పుడే ఆ ఫొటోస్ పంపిస్తాను అని వసుంధర అక్కడి నుంచి వెళ్తుంది. మరోవైపు అంజలి వాళ్ళు బయలుదేరి వస్తుంటారు. ఏం జరుగుతుందో అని నీరజ్ కాస్త భయపడుతూ కనిపించడంతో.. డౌట్ రాకుండా అన్నయ్య చూసుకుంటాడు అని అంజలి చెబుతుంది. ఇక మాన్సీ వాళ్ళు లేకపోయేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని తెగ ఆరాటపడుతుంది.
వెంటనే ఆర్య ఇంట్లో పని చేసే అమ్మాయికి ఫోన్ చేయటంతో తను ఇప్పటినుంచి నీకు ఏమి చెప్పను అంటూ తిరిగి షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఫొటోస్ రావటంతో అను అవి చూస్తూ ఉండగా.. అప్పుడే ప్రీతి ఈ కొటేషన్స్ ఎలా ఉన్నాయో చూడమని పేపర్స్ ఇస్తుంది. ఇక ప్రీతి ఆ ఫొటోస్ తీసి అక్కడ స్టిక్ చేస్తుంది. ఇక అందులో ఉన్న కొటేషన్స్ చదివి ఆర్యను గుర్తుకు చేసుకుంటుంది. ఇక రేష్మ వచ్చి జంట చూడముచ్చటగా ఉంది అని అంటుండగా అప్పుడే అను ఆ ఫోటోల వైపు చూడటంతో నీరజ్, అంజలి అని షాక్ అవుతూ వసుంధర అంజలి వాళ్ళ మమ్మీ ఆ అని షాక్ అవుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial