Madhuranagarilo July 4th: ‘మధురానగరిలో’ సీరియల్: కాబోయే భర్తతో ప్రపోజ్ చేయించుకున్న సంయుక్త, రాధపై ప్రేమ పరీక్ష చేసిన శ్యామ్?
సంయుక్త శ్యామ్ తో మధుర ముందు ప్రపోజ్ చేయించుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Madhuranagarilo July 4th: మధుర శ్యామ్ కి చెబుతాను అని పిలుస్తుండటంతో వెంటనే సంయుక్త మధుర చెయ్యి పట్టుకొని పక్కకు తోయటంతో మధుర తలకు గాయం అవుతుంది. ఇక అక్కడే ఉన్న రాధ మౌనంగా చూస్తుంది. అప్పుడే సంయుక్తను మధుర పిలవడంతో అదంతా భ్రమ అనుకొని తేరుకుంటుంది సంయుక్త. ఇక అత్తయ్యకు నిజం చెప్పకూడదు అని చెబితే పెళ్లి చేసేస్తుంది అని సైలెంట్ గా ఉంటుంది.
మధుర ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని అడగటంతో అప్పుడు సంయుక్త.. రాధ అందరికీ పెళ్లిళ్లు చేసి కలుపుతుంది కానీ తన భర్త లేకపోవటంతో ఒంటరిగా ఉంటుంది అని.. తన భర్తను తీసుకొచ్చి తమ పెళ్ళి రోజు వారికి కూడా దండలు మార్పిస్తే బాగుండు అని అనుకున్నానని ఇక ఆ విషయం గురించి అడిగితే రాధ తనపై కోప్పడింది అని అనటంతో అప్పుడే రాధ వచ్చి అవును కోప్పడతాను అని అంటుంది.
గాయం చేసిన గతాలను మళ్లీ గుర్తుకు చేయొద్దు అని రాధ అంటుండగా సంయుక్త సరే సరే కూల్ అంటూ నీ గతంలో అంత బాధ ఉందని తెలియదు ఇప్పటినుంచి మనం ఫ్రెండ్స్ అంటూ చేయగలుగుతుంది. ఇక మధుర కూడా వీరిద్దరూ కలిసిపోయారు అని సంతోషపడుతుంది. మరోవైపు శ్యామ్ రాధ ఇంటి నుంచి వెళ్లిపోవటానికి రీజన్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాడు. రాధ వెళ్తే తనకు సంయుక్తతో బలవంతంగా పెళ్లి జరుగుతుంది అని.. ఎలాగైనా రాధకు తన ప్రేమ విషయం చెప్పాలి అని అనుకుంటాడు.
ఇక ప్రపోజ్ చేయటానికి అందంగా రెడీ అవ్వాలి అని అనుకుంటాడు. దాంతో ఏ కలర్ షర్ట్ వేసుకోవాలా రాధకు ఏ కలర్ ఇష్టం అని అనుకుంటుండగా అప్పుడే రాధ వచ్చి బ్లూ కలర్ చెప్పినట్లుగా భ్రమపడతాడు. ఇక అన్నట్లుగానే బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటాడు. ఏ గులాబీ రంగు నువ్వు తీసుకోవాలి అని అనుకుంటుండగా అప్పుడే మళ్ళీ రాధ భ్రమలో వచ్చి ఎర్ర గులాబీ అని చెప్పి మాయం అవుతుంది. ఇక తను భ్రమలాగా వస్తుంది అని తన చుట్టూ వైఫై లాగా తిరుగుతుంది అని అనుకుంటాడు.
మరోవైపు రాధ కూడా శ్యామ్, సంయుక్తులను బయటికి పంపించి వారిని మరింత ఒకటి చేయాలి అని అనుకొని శ్యామ్ దగ్గరికి వస్తుంది. ఇక శ్యామ్ మళ్లీ రాధ తనకు భ్రమలో వచ్చింది అనుకొని.. ప్రపోజల్ రిహాల్స్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఐ లవ్ యు అని కూడా చెబుతాడు దాంతో రాధ షాక్ అవుతుంది. ఎలా చెబితే బాగుంటుంది అని తెగ వెనుకకు తిరిగి రిహాల్స్ చేస్తూ ఉండగా వెంటనే రాధ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక మళ్లీ వెనుకకు తిరిగి చూసేవారికి అక్కడ మధుర, సంయుక్త ఉంటారు.
ఇక సంయుక్త ఎవరికోసం ప్రపోజ్ చేస్తున్నావు అనటంతో వెంటనే మధుర ఇంకెవరి కోసం తన కాబోయే భార్య కోసం అని అంటుంది. ఇక్కడే ఉంది కదా తనను ప్రపోజ్ చేయమని మధుర అనటంతో కాస్త రిహాల్స్ చేసి వస్తాను అని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దాంతో సంయుక్తకు అనుమానం వస్తుంది. ఇక శ్యామ్ రాధ ఇంటి దగ్గరికి వెళ్లగా తను లేకపోయేసరికి అక్కడ ఒకచోట పువ్వులు కోస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక శ్యామ్ గులాబీ పువ్వు తీసుకొని వస్తుండటంతో తనని ప్రపోజ్ చేస్తున్నాడని తెలుసుకొని భయపడుతుంది.
శ్యామ్ అక్కడికి వెళ్లే లోగా రాధ మాయమైతుంది. అలా కాసేపు శ్యామ్ అక్కడే రాధ కోసం తిరుగుతూ ఉంటాడు. వెంటనే రాధ.. మేడం దగ్గరికి వెళ్తే శ్యామ్ దగ్గరికి రాడు అనుకోని లోపలికి వెళ్తుండగా వెంటనే శ్యామ్ రాధని చూసి పిలుస్తుంటాడు. అప్పుడే సంయుక్త అడ్డంగా వచ్చి నిలబడుతుంది. నువ్వు నా కళ్ళల్లోకి చూసిన కూడా ప్రపోజ్ చెయ్యొచ్చు అని అడుగుతూ ఉండగా అప్పుడే రాధ.. శ్యామ్ సర్ సంయుక్తను ప్రపోజ్ చేస్తున్నాడు అని అరవటంతో మధుర అక్కడికి వస్తుంది.
ఇక మధుర ప్రపోజ్ చేయమని అనటంతో శ్యామ్ కాసేపు మౌనంగా ఉండి గులాబీ పువ్వు ఇచ్చి అక్కడ నుంచి వెళ్తాడు. ఆ తర్వాత శ్యామ్ ఒంటరిగా కూర్చొని ఉండగా అక్కడికి రాధ వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది. పెళ్ళాం గురించి ఆలోచిస్తున్నాను అంటూ టాపిక్ లోకి వెళ్తాడు. ఎలాగైనా తనని ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అనడంతో అలా జరగనివ్వను అని రాధ అంటుంది.
తరువాయి భాగంలో శ్యామ్ సత్యభామ అని ఒక ఆవిడకు ఫోన్ చేసి తను ప్రేమించిన అమ్మాయి వీపు వెనుక పుట్టుమచ్చ ఉంటుంది అని ఫోన్లో చర్చ చేస్తుండగా వెంటనే రాధ ఇంట్లోకి వెళ్లి తన వీపుపై ఆ పుట్టుమచ్చ ఉందా లేదా అని చూస్తుంది. వెంటనే శ్యామ్ కిటికీ దగ్గరికి వచ్చి రాధ ను చూస్తాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial