Rangula Ratnam July 12th: తండ్రికి తన కళ్ళను ఇవ్వమని మాట తీసుకున్న వర్ష.. కూతురి పరిస్థితి తెలుసుకొని కుప్పకూలిన పూర్ణ?
వర్ష తన తండ్రికి తన కళ్ళను ఇవ్వడానికి నిర్ణయించుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam July 12th: హాస్పిటల్ కి వచ్చిన సత్యం తన కళ్ళను ప్రసాద్ కి ఇవ్వమని బ్రతిమాలడంతో వెంటనే ఆ మాటలు విన్న ప్రసాద్ లోపలికి వచ్చి మనస్ఫూర్తిగా సత్యాన్ని పిలిచి పట్టుకొని ఎమోషనల్ అవుతూ.. ఇంతకాలం నువ్వు మంచితనం తెలుసుకోలేదు అంటూ.. నువ్వు నా డబ్బు కోసం ఆశ పడ్డావు అనుకున్నాను అని.. కానీ నువ్వు నా వెనకాల ఉండి నడిపిస్తున్నావు అని తెలియలేదని చెప్పుకుంటూ బాధపడతాడు.
ఇక తనకు కళ్ళు వద్దు.. ఇలాగే ఉంటాను అని అనటంతో వెంటనే డాక్టర్.. ఐ బ్యాంక్ ద్వారా ప్రయత్నిద్దాం అని ధైర్యం ఇస్తాడు. మరోవైపు రేఖ దగ్గరికి మూర్తి వాళ్ళు వచ్చి.. తమకు వచ్చేటివి కట్టాల్సినవి చాలా ఉన్నాయని.. ఆ పేపర్లో చదివి సైన్ చేయమని చెప్పటంతో రేఖ వాళ్లను బయటికి పంపించి.. ఇప్పుడు ఇవి ఎలా చదవాలి.. ఏం చేయాలి.. చైర్మన్ సీట్ లో కూర్చుంటే డబ్బులు వస్తాయనుకున్నాను కానీ కష్టాలు కూడా వస్తాయనుకోలేదు అని తల పట్టుకొని కూర్చుంటుంది.
అప్పుడే అక్కడికి చక్రి రావటంతో చక్రిని చూసి షాక్ అవుతుంది. జైలు నుంచి ఇంత తొందరగా ఎలా వచ్చావు అని అడగటంతో.. మంచివాడిగా నటించాను అందుకే పంపించారు అని అంటాడు. ఇక నాకు ఎవరు దిక్కులేదు ఈ కంపెనీని నమ్ముకుని ఉన్నాను ఉద్యోగం ఇవ్వమని అంటాడు. కానీ రేఖ మళ్లీ నువ్వు మోసం చేయడానికి వచ్చావు అని అంటుంది. దాంతో చక్రి అటువంటిది ఏమీ లేదు అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడే అవతలి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని మూర్తి వచ్చి రేఖకు చెప్పటంతో రేఖ మరింత టెన్షన్ పడుతుంది. ఇక మూర్తిని బయటికి పంపించి.. ఇప్పుడు అందులో ఏముందో తనకు తెలియదని ఈ ఆఫీస్ గురించి చక్రికి తెలుసు కాబట్టి.. ఈ పని చేయించుకుని అప్పుడు నమ్మకం కలిగితే ఇక్కడే ఉంచుకోవాలని అనుకుంటుంది. ఇక చక్రిని ఇక్కడే ఉద్యోగం చేసుకో అని చెబుతుంది.
ఇక హాస్పిటల్లో ఉన్న వర్షకు ఆకాష్.. మీ నాన్న, మామయ్య కలిసిపోయారని చెప్పటంతో వర్ష సంతోషపడుతుంది. మీ నాన్నకు మీ మామయ్య కళ్ళు ఇస్తాను అనడంతో మీ నాన్న మంచితనం తెలుసుకున్నాడు అనగా వర్ష తన మామయ్య చూపు పోతుందేమో అని బాధపడుతుంది. దాంతో ఆకాష్ మీ మామయ్య మంచి మనసుతో ఇస్తా అన్నా కూడా మీ నాన్న వద్దు అన్నాడు అని.. ఐ బ్యాంక్ లు చూపు రావటానికే ఉన్నాయని చెబుతాడు.
దాంతో వర్ష తన కళ్ళను తన తండ్రికి పెట్టి ఇవ్వమని కోరుకుంటుంది. దాంతో ఆకాష్, సీత షాక్ అవుతారు. ఎందుకు అలా ఉన్నారు? ఎలాగైనా చనిపోతా కదా.. నా కళ్ళు మా నాన్నకు పెడితే.. మా నాన్నకు చూపు వస్తుంది.. నేను చనిపోయిన కూడా నా కళ్ళు బతికి ఉంటాయి.. అప్పుడైనా అమ్మానాన్నలు కలిసినప్పుడు నా కళ్ళు వాళ్ళని చూస్తాయని.. ఎలాగైనా తన కళ్ళను పెట్టి ఇవ్వమని ఆకాష్ దగ్గర మాట తీసుకుంటుంది.
ఇక ఆకాష్ మాట ఇవ్వగా అప్పుడే తల పట్టుకుని నొప్పితో బాధపడుతుంది. డాక్టర్లు ఎమర్జెన్సీ అని చికిత్స చేస్తారు. ఇక డాక్టర్ నందగోపాల్.. మరో డాక్టర్ ని అడగటంతో తను ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో నందగోపాల్ అక్కడి నుండి బయటికి వెళ్తాడు. వర్ష పరిస్థితి బాలేదు అని సీత రఘు కి ఫోన్ చేసి చెప్పడంతో రఘు కుమిలిపోతాడు. తరువాయి భాగంలో రఘు ఏడుస్తూ ఫోన్ మాట్లాడటంతో ఏం జరిగింది అని పూర్ణ వచ్చి అడుగుతుంది. వెంటనే ఫోన్ లాక్కొని మాట్లాడగా సీత మొత్తం విషయం చెబుతుంది. దాంతో పూర్ణ ఫోన్ కిందపడేసి కుప్పకూలిపోతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial