Prema Entha Madhuram July 12th: కొడుకుతో కేక్ కట్ చేయించిన ఆర్య.. వర్ధన్ ఫ్యామిలీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మాన్సీ?
ఆర్య తన కొడుకు చే కేక్ కట్ చేయించటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 12th: ఆర్య జెండే వాళ్లకు ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా అప్పుడే అంజలి అక్కడికి వచ్చి ప్రీతీ వాళ్ళు ఈవెంట్ గురించి మాట్లాడటానికి వచ్చారు అని చెబుతుంది. లోపలికి రమ్మని చెప్పటంతో ప్రీతి, అను వచ్చి కూర్చుంటారు. ఇక ప్రీతి నీ సీట్ ఖాళీగా ఉందని చూస్తున్నావా అని మాట్లాడుతూ ఉంటుంది.
వాళ్ళు ఈవెంట్ గురించి మాట్లాడదామన్న సమయంలో వర్కర్స్ వచ్చి తమ టాయ్స్ బిజినెస్ బాగా నడుస్తుంది అని.. అందరూ తమ టాయ్స్ నే చూస్ చేసుకుంటున్నారు అని.. ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్లో ఉందని అనటంతో ఆర్యవాళ్లు సంతోషపడతారు. ఇక చిన్న సెలబ్రేషన్స్ అని వర్కర్స్ అనడంతో.. ఆర్య ఓకే అని.. ప్రీతి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాడు.
ఇక ఆర్య వర్కర్స్ అందరికీ కంగ్రాట్స్ చెబుతాడు. ఇక ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి పిల్లలతో కేక్ కట్ చేయిస్తే బాగుంటుంది అని బాబుని ఎత్తుకొని ఉన్న అనుని పిలుస్తాడు. ఇక బాబుతో కేక్ కట్ చేయించగా బాబుతో ఆర్య నోట్లో కేక్ పెట్టిస్తారు. ఇక ప్రీతి ఆర్య కు తినిపించిన కేకు అనుకి కూడా తినిపిస్తుంది. ఆ సెలెబ్రేషన్స్ అయ్యాక మళ్లీ అందరూ కాన్ఫరెన్స్ రూమ్ దగ్గరికి వెళ్తారు.
ప్రీతి మీ ఈవెంట్ కు మా బానునే ప్లాన్ చేసింది అని ఆ ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక అందులో మొత్తం బటర్ఫ్లై తో కూడిన డిజైన్స్ ఎంచుకున్నాము అని చెబుతుంది. దాంతో ఆర్య బటర్ఫ్లై ఎందుకు ఎంచుకున్నారు అనడంతో.. ప్రీతి దాని గురించి చెప్పడానికి కాస్త తడబడటంతో వెంటనే అను ఆ బటర్ఫ్లై గురించి వివరిస్తుంది.
ఇక అను చెప్పడంతో వాళ్లంతా ఫిదా అక్కడే ఉన్న జెండే సేమ్ మా అను గురించి తెలిసినట్లే చెప్పారు అని అంటాడు. అదే సమయంలో మానసి ఆఫీస్ కి వచ్చి లోపలికి రావటానికి సెక్యూరిటీ వాళ్లతో గొడవ పడుతుంది. ఇక ఆ విషయం ఒక వర్కర్ వచ్చి చెప్పడంతో వెంటనే నీరజ్ కి కోపం వచ్చి ఇప్పుడే పోలీసు వాళ్లకి ఫోన్ చేస్తాను అని ఫోన్ కలుపుతూ ఉండగా.. వెంటనే ఆర్య మాన్సీ ని లోపలికి పంపించమని అంటాడు.
మాన్సీ వచ్చి ఆస్తి పేపర్లో సంతకాలు ఏవి అంటూ నోటి కి వచ్చినట్లు వాగుతూ బాగా రచ్చ చేస్తుంది. దాంతో అంజలి వెటకారంగా సమాధానం ఇస్తుంది. ఇక మాన్సీ మాటలకు అర్యకు కోపం రావడంతో వెంటనే గట్టిగా అరుస్తాడు. ఇక అక్కడ ఉన్న ప్రీతి వాళ్ళను కాసేపు బయటికి వెళ్ళమని అంటాడు. ఇక అను మాన్సీ మేడం ఎందుకు ప్రతిసారి వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు అని అనుకుంటుంది.
మాన్సీ ఆర్యకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంది. నీరజ్ కు బాగా కోపం వస్తుంది. ఇక మీ అందరి పని కోర్టులో చూస్తాను అని బెదిరించడంతో.. వెంటనే ఆర్య తిరిగి నీకే శిక్ష పడుతుంది అంటూ అన్ని సెక్షన్ల నెంబర్స్ చెప్పటంతో ఇక జెండే వాటి గురించి వివరించి మాన్సీ కి తిరిగి ఎదురు దెబ్బ కొడతారు. అయినా కూడా మాన్సీ మీ అంతు కోర్టులో చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళుతుంది. మాన్సీ వెళ్లడానికి గమనించిన అను మాన్సీ దగ్గరికి వెళ్లి వారి జోలికి వెళ్లొద్దు అని.. వెళ్తే బాగుండదు అని చెబుతుంది. కానీ మాన్సీ మాత్రం పొగరుగా సమాధానం ఇస్తుంది.
Also Read: Gruhalakshmi July 12th: తాళి తెచ్చి మాజీ మొగుడి చేతిలో పెట్టిన తులసి- నిద్రమాత్రలు మింగిన దివ్య?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial