Urfi Javed: ఉర్ఫీ జావెద్, ఫైర్ కాదు ‘ఫ్లవర్’ - టాప్ తీసేసి, పువ్వులు మాత్రమే అడ్డుగా పెట్టుకుని రచ్చ!
ఉర్ఫీ జావెద్ అంటే ఫైర్ అనుకుంటిరా.. ఫ్లవర్! ఆమె వేసుకున్న డ్రెస్ కాని డ్రెస్ చూసి ఇప్పుడు అంతా అదే అనుకుంటున్నారు.
![Urfi Javed: ఉర్ఫీ జావెద్, ఫైర్ కాదు ‘ఫ్లవర్’ - టాప్ తీసేసి, పువ్వులు మాత్రమే అడ్డుగా పెట్టుకుని రచ్చ! Urfi Javed Wears only Flowers On Her Body In The Latest Video, Gets Trolled Urfi Javed: ఉర్ఫీ జావెద్, ఫైర్ కాదు ‘ఫ్లవర్’ - టాప్ తీసేసి, పువ్వులు మాత్రమే అడ్డుగా పెట్టుకుని రచ్చ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/25/467f66508e851d49d566c5060296d85b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉర్ఫీ జావెద్, ఫైర్ కాదు ‘ఫ్లవర్’ - టాప్ తీసేసి, పువ్వులు మాత్రమే అడ్డుగా పెట్టుకుని రచ్చ!
ఇండియాలో అత్యంత చెత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే మోడల్, నటి ఎవరని అడిగితే.. వెంటనే వచ్చే సమాధానం.. ఉర్ఫీ జావెద్. ఈమెకు బుల్లితెర నటి కంటే.. ఈ చిత్ర విచిత్ర దుస్తులతోనే ఎక్కువ గుర్తింపు లభించింది. ఈ పాపులారిటీ వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమెకు రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సరికొత్తగా ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఈమెకు ఎవరూ పోటీ రాలేరు. అందుకే, 2021లో హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది.
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
సాధారణంగా ఎక్స్‌పోజింగ్ దుస్తులు వేసుకొనే మోడల్స్ ర్యాంప్ మీద క్యాట్ వాక్‌కే పరిమితం అవుతారు. ఉర్ఫీకి మాత్రం అలాంటి దుస్తులు ధరించి నేరుగా పబ్లిక్‌లోకే వచ్చేస్తుంది. ఆమె ఫోటోలను కెమేరాలో బందించేందుకు బాలీవుడ్ మీడియాకు చెందిన ఫోటోగ్రాఫర్లు బారులు తీరుతారు. తాజాగా ఆమె ధరించిన మరో డ్రెస్(?) ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే, ఆమె పూర్తిగా తన టాప్‌ను తొలగించి తన పరువాలను పువ్వులతో కవర్ చేసింది. కేవలం స్కిన్ కలర్‌లో కలిసిపోయే షార్ట్ మాత్రమే ధరించింది. కాబట్టి, దాన్ని డ్రెస్ అనలేం.
Also Read: 'ఆచార్య' టీమ్ వారిద్దరినీ కావాలనే మర్చిపోయిందా?
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)