Trinayani Serial Today October 13th: 'త్రినయని' సీరియల్: నయని, విశాలకు అమ్మవారి దర్శనం.. గజగండ అంతం!
Trinayani Today Episode నయని గజగండ నుంచి పంచకమణి తీసుకొని దాన్ని మానసాదేవి ఆలయంలో పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode గజగండ పంచకమణికి పూజ చేస్తుంటాడు. అక్కడికి నయని, విశాల్ వస్తారు. క్షుద్రపూజలు ఇక ఆపమని విశాల్ గజగండతో అంటాడు. రాజీకి వచ్చారా అని గజగండ అడుగుతాడు. దానికి నయని నీకు గుణపాఠం చెప్పి పంచకమణి తీసుకెళ్లాలని వచ్చాం అని అంటుంది.
గజగండ: భార్యాభర్తలిద్దరూ తెగించారన్నమాట. సంతోషం అయితే ముందు తెగేది నీ మెడలో మంగళసూత్రమే నయని.
నయని: మోసం చేసి పంచకమణి తీసుకున్న నువ్వు నా మెడలో మంగళసూత్రం ఉండదు అంటున్నావ్ అంటే నీకు మంచిగా చెప్తే అర్థం కాదు అని నాకు అర్థమైంది గజగండ.
విశాల్: వీడితో మాటలు ఏంటి నయని అని విశాల్ గజగండని తన్నేస్తాడు. దాంతో గజగండ తన మంత్ర శక్తితో విశాల్ని బంధించేస్తాడు.
నయనిని వెళ్లొద్దని వాడి చేతిలో పంచకమణితో కట్టడి చేయాలనుకుంటున్నాడని విశాల్ అంటే దానికి నయని మన దగ్గర భుజంగ మణి ఉంది ఇక వీడి ఆటలు సాగవని అంటుంది. భుజంగమణి ఉపయోగించి నయని విశాల్ చుట్టూ ఉన్న అగ్ని కట్లు తెంపుతుంది. ఇక విశాల్ చేయి పట్టుకొని వాడి అంతు చూసే వరకు తన చేయి వదలొద్దని నయని విశాల్‌తో చెప్తుంది. ఓం హీం ఫట్ అని గజగండ ఎన్ని మంత్రాలు చదివినా అవి నయని, విశాల్ మీద పని చేయవు. భుజంగమణి ఉంటే తమకు ఏం కాదని నయని అంటుంది. ఇక గజగండ ఏం చేయలేక పంచకమణితో మాయం అయిపోతాడు. నయని వాళ్లు ఎక్కడున్నారని చూసేలోపు మరో వైపు ప్రత్యక్షమై ఇద్దరిని తన మంత్ర దండంతో కొట్టి ఇద్దరి చేతులు విడిపోయేలా చేస్తాడు. ఇక విశాల్ తోసేస్తాడు. నయని కొట్టి నెట్టి మాయం అయిపోతాడు. నయని చేతిలోని భుజంగమణి కింద పడిపోతుంది. ఇక గజగండ మాయం అవుతూ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. విశాల్ భుజంగమణి తీసుకునేలోపు గజగండ నయని గొంతు పుట్టుకుంటాడు.
నువ్వు నయనిని పట్టుకోలేదని నయని గొంతు మీద ఉన్న అమ్మవారిని పట్టుకున్నావ్ చచ్చిపోతావని అంటుంది. దాంతో ఎవరు మీ అమ్మ అని గజగండ నయని మెడలో ఉన్న అమ్మవారి లాకెట్‌ని తెంపేస్తాడు. మీ అమ్మవారిని విసిరేస్తాను అని దాన్ని విసిరేస్తాడు. ఆ తాడు, లాకెట్ ఓ రాయి మీద పడుతుంది. దాంతో ఆ అమ్మవారి లాకెట్ చుట్టూ పెద్ద కాంతి వచ్చి అమ్మవారు బయటకు వస్తుంది. నయని, విశాల్ అమితానందంతో మోకాల మీద పడి దండం పెట్టుకుంటే గజగండ వణికి పోతాడు. అమ్మవారు తన త్రిశూలంఓ గజగండని పొడిచేస్తుంది. దాంతో గజగండ చేతిలోని పంచకమణి కింద పడిపోతుంది. అమ్మవారు మళ్లీ నయని లాకెట్‌ని మళ్లీ నయని మెడలో కడుతుంది. ఇద్దరూ దండం పెట్టుకుంటారు. అమ్మవారి దర్శనం కలిగినందుకు చాలా అదృష్టవంతులమని అంటుంది. ఇక అమ్మవారు నయనికి పంచకమణి, భుజంగమణిని మానసాదేవి ఆలయంలో పెట్టమని అదృష్యం అవుతుంది.
తిలోత్తమ, వల్లభలు మాట్లాడుకుంటారు. గజగండ చనిపోయాడని తిలోత్తమతో వల్లభ చెప్తాడు. రక్తపు మడుగులో పడ్డాడని చెప్తాడు. గంటలమ్మని కలిసి విషయం చెప్తే గంటలమ్మ రక్తం కక్కుతోందని అందరూ సర్వనాశనం అయిపోయారని అంటాడు. నిన్ను నమ్ముకొని నీ వెంట నుడుస్తున్నందుకు నేను ఖతం అయిపోతానేమో అని వల్లభ టెన్షన్ పడతాడు. మరోవైపు నయని, విశాల్ పంచకమణి, భుజంగమణి తీసుకొని మానసాదేవి ఆలయానికి వెళ్తారు. ఆలయంలో పంచకమణి, భుజంగమణి పెడతారు. ఇక సుమన విక్రాంత్ దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు మీ అన్నావదినలు ఇంకా రాలేదని అంటుంది. దాంతో విక్రాంత్ నయని, విశాల్‌లు పంచకమణి తీసుకెళ్లారని గజగండ చనిపోయాడని చెప్తాడు. సుమన షాక్ అయిపోతుంది. ఇక సుమన అక్కా బావల కోసం వంట చేస్తానని హడావుడి చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.