![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Trinayani Serial Today November 4th: 'త్రినయని' సీరియల్: నయనికి మరో ఆపద.. ఈ సారి విష ప్రయోగం.. చనిపోతా అని హడావుడి చేస్తున్న నయని!
Trinayani Today Episode నయనికి మరోసారి త్రినేత్రి మీద విష ప్రయోగం జరిగినట్లు కనిపించడం దాంతో తానే చనిపోతున్నా అని నయని అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today November 4th: 'త్రినయని' సీరియల్: నయనికి మరో ఆపద.. ఈ సారి విష ప్రయోగం.. చనిపోతా అని హడావుడి చేస్తున్న నయని! trinayani serial today november 4th episode written update in telugu Trinayani Serial Today November 4th: 'త్రినయని' సీరియల్: నయనికి మరో ఆపద.. ఈ సారి విష ప్రయోగం.. చనిపోతా అని హడావుడి చేస్తున్న నయని!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/04/96f248679d28ab85db0fd9f81527e5011730683063552882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Serial Today Episode హాల్‌లో సుమన, తిలోత్తమలు నెయిల్ పాలీష్ పెట్టుకుంటే భోజనం టైంలో ఇదేం పని అని హాసిని సెటైర్లు వేస్తుంది. తిలోత్తమకు వల్లభ తినిపిస్తా అంటే విక్రాంత్ వచ్చి సుమనకు నేను తినిపించను అంటాడు. ఇక నయని వంట చేసింది వంట అద్భుతంగా ఉందని హాసిని అంటే నయని వండిందా వంట చేస్తే షాపింగ్‌కి ఎప్పుడు వెళ్తామని తిలోత్తమ అంటుంది. ఇంతలో నయని, విశాల్ వస్తారు. షాపింగ్‌కి తీసుకెళ్తా అని చెప్పి మాట తప్పిందని సుమన అంటుంది.
తిలోత్తమ: గండం కదా ఇంట్లోనే ఉంటాం అని చెప్తే మేం రెడీ అయ్యేవాళ్లం కాదు కదా.
వల్లభ: అందుకేనా చిన్న మరదలు గోళ్లరంగు పెట్టుకుంటుంది. ఇక విక్రాంత్, సుమనలు కొట్టుకుంటారు. విశాల్ ఆపుతాడు.
పావనా: పాము రాలేదు అంటే నయనమ్మకి గండం రానట్లే కదా. పదండి షాపింగ్‌కి వెళ్దాం.
సుమన: బాబాయ్ మీకు మా అక్క ఉద్దేశం అర్థం కానట్లుంది. రేపు అయినా మనం షాపింగ్‌కి వెళ్లం ఎందుకంటే రేపు పులి వస్తుంది. తినడం నిద్ర పోవడం ఇంక వేరే పని ఏముంది.
విశాల్: సుమన ఒక్క నిమిషం నువ్వు సైలెంట్‌గా ఉండి మేం చెప్పేది విను. నయనికి గండం వచ్చి ఏమైనా అయితే నేను కానీ పిల్లలు కానీ ఏమైపోతామా అని నయని ఎంత మానసికంగా నలిగిపోతుందో నాకు తెలుసు. గండం రాలేదు రాకూడదు. కానీ నయనికి అలా అనిపించినప్పుడు ఇన్నాళ్లు జరిగింది ఇప్పుడు జరగలేదు కాబట్టి మనం నయనికి ధైర్యం చెప్పాల్సింది పోయి వెటకారం చేస్తే ఎలా.
తిలోత్తమ: సాయంత్రం వరకు అంటే నాలుగు, ఐదు వరకు ఓకే కానీ రాత్రి వరకు వెయిట్ చేయించి ఇప్పుడు షాపింగ్ లేదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది.
సుమన నయని మీద సెటైర్లు వేసి మా అక్కకి గండం వచ్చి అక్క పోతే ఇక ఇంట్లో పండగ ఏం ఉంటుంది అని అంటే గాయత్రీ పాప చిన్న పూల కుండీ విసిరి కొడుతుంది. పాప కొట్టిందా అని విశాల్ అంటే దానికి విక్రాంత్ పాప చేతిలో ఉన్న ఇంకోటి చూపించి మళ్లీ కొట్టడానికి రెడీగా పాప ఉందని అంటాడు. సుమన కోపంతో పిల్లకి రెండు తగిలిస్తాను అంటే హాసిని బుద్ధుందా అని తిడుతుంది. నయనికి వచ్చిన కల ఏదో నిజం కావడం లేదని హ్యాపీ అని అంటుంది. నయనికి ఇక విశాలాక్షి అమ్మవారు అందించిన దివ్య దృష్టి లేనట్లే అని అంటుంది తిలోత్తమ. నయని తనకు దివ్య దృష్టి లేకపోయినా ఉందని అందరినీ నమ్మించడానికి ఇలా గండాలు వస్తున్నాయని చెప్తుందని తిలోత్తమ అంటుంది.
విక్రాంత్ గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని ఎప్పుడో చెప్పేసి ఉంటే నయనికి ఇంత కష్టం ఉండేది కాదని సుమన అంటే విక్రాంత్‌ని విలన్‌లా చూపించొద్దని హాసిని అంటుంది. దానికి తిలోత్తమ అన్నీ తెలిసిపోయిన నయనికి కూడా ఆ విషయం తెలియలేదని ఇప్పుడు నయని ఎందుకు తనకు గండం ఉందని నాటకం ఆడుతుందని అంటుంది. దానికి నయని ఎందుకు ఎవరు నా మాట నమ్మడం లేదని అంటుంది. దానికి సుమన నీకు ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్‌లో చూపించుకో అని కానీ మాతో ఇలా చెప్పకు అని అంటుంది.
ఇంతలో నయనికి మళ్లీ భవిష్యత్ కనిపించి త్రినేత్రి విషం కలిపిన ప్రసాదం తిని అమ్మవారి విగ్రహం ముందు నేల కొరిగిపోయి నట్లు కనిపిస్తుంది. నయని ఇంట్లో వాళ్లతో తన మీద విష ప్రయోగం జరగబోతుందని అంటుంది. తిలోత్తమ వాళ్లు నమ్మరు. నేను చనిపోతే మీరు ఎలా బతుకు తారు అని విశాల్‌తో చెప్పుకొని నయని ఏడుస్తుంది. సీన్ కట్ చేస్తే చిత్రగుప్తుడి చిట్టాలో త్రినేత్రి త్రినయని అని పేరు కనిపించి యమపాశం నరకం నుంచి ప్రయాణిస్తుంది. నయని గాయత్రీ పాపని పట్టుకొని నువ్వే చెల్లిని నాన్నని చూసుకోవాలి అని చెప్పి ఏడుస్తూ పాపని తీసుకొని బయటకు వెళ్తుంది.
మరోవైపు నయని గురించి తిలోత్తమ, వల్లభ మాట్లాడుకుంటుంది. నయనికి ఆపద వస్తే తనకు ఇప్పుడు తనకి తెలుస్తుందని ఆలోచిస్తారు. ఎందుకు ఒకే సారి అన్ని ఆపదలు కనిపిస్తున్నాయని అనుకుంటారు. ఇక వల్లభ నయని ఆత్మ హత్య చేసుకుంటాడేమో అని అంటాడు. దానికి తిలోత్తమ నయని ఆత్మహత్య చేసుకోదని మనం చంపాలని అంటుంది. నయని పోతే గాయత్రీ పాప అనాథ అయిపోతుందని తర్వాత పాపని చంపేయాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)