Trinayani Serial Today November 29th: 'త్రినయని' సీరియల్: అసలా 3 గంటల్లో ఏం జరిగింది? త్రినయని.. త్రినేత్రి.. గుర్తుంచుకునేదెలా?
Trinayani Today Episode గురువుగారు త్రినేత్రితో గాయత్రీదేవి వచ్చిన తర్వాత మూడు గంటలు ఏం జరిగిందో గుర్తు చేసుకొని గుర్తించుకో అని త్రినేత్రికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode ఇన్నాళ్లకు నా కొడుకు నీ కొడుకుతో మీ అమ్మ మా అమ్మ అని వేరు చేసి మాట్లాడాడు అని గాయత్రీ దేవి తిలోత్తమతో అంటుంది. ఇక నయనితో కొద్ది సేపటికి పాపకి మెలకువ వస్తుందని చెప్తుంది. ఇక తిలోత్తమ గదిలోకి వెళ్లి గాయత్రీదేవి కొట్టిన కొట్టుడుకి నొప్పి అని మొత్తుకుంటుంది. వల్లభ తన తింగరి మాటలతో తల్లిని ఇబ్బంది పెడతాడు.
వల్లభ: మమ్మీ నువ్వు ఎవరితో అయినా పెట్టుకో కానీ పెద్ద మరదలితో పెట్టుకోవద్దని ఇప్పటికే చాలా సార్లు చెప్పా కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు అనుభవిస్తున్నావు.
తిలోత్తమ: అవున్రా నయని కాదని నిరూపిస్తే తను నా కాళ్ల బేరానికి వస్తే అప్పుడు తనని అడ్డు పెట్టుకొని ఆస్తులు మొత్తం నా ఆధీనంలోకి తీసుకోవాలి అనుకున్నా.
వల్లభ: ఊరుకోమమ్మీ ఇలా అంటే గాయత్రీదేవి పెద్దమ్మ వచ్చి మళ్లీ వాయించేస్తుంది. మొత్తానికి నువ్వు దెబ్బలు తిన్నావు కానీ త్రినేత్రిని నయని అని చెప్పావు.
సుమన: ఏ క్షణం ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పలేకపోతున్నామండీ. పెద్దత్తయ్యని మా అక్క చూసేసింది కదా అండీ అంటే తనే మా అక్క అని పూర్తిగా ఒప్పుకోవాలా
విక్రాంత్: అదే మంచిదేమో.
సుమన: అవును లేదంటే తిలోత్తమ అత్తయ్యని కొట్టినట్లు పెద్దత్తయ్య ఆత్మ నన్ను కొట్టేయగలదు. మా అక్కని పూర్తిగా నమ్మొచ్చా నయని అక్క ఫిక్స్ అయిపోవచ్చా
విక్రాంత్: అయిపో నీకే మంచిది.
సుమన: ఒక డౌట్ అడుగొచ్చా. ముందు ఎందుకు నయని అక్కకి ఆత్మ కనిపించలేదు తర్వాత ఎందుకు కనిపించింది.
విక్రాంత్: సింపుల్ సుమన ముందు మా అమ్మ అబద్ధం చెప్పింది ఇప్పుడు వదిన నిజం చెప్పింది అంతే.
గురువుగారు ఇంటికి వస్తారు. త్రినేత్రి ఎక్కడుందో చూడాలి అని వచ్చానని గురువుగారు అంటే త్రినేత్రి కాదు త్రినయని అని అంటాడు వల్లభ. నయని తీరుని చూసి అందరూ ఒకసారి ఒక్కోలా అనుకుంటున్నారని పావనా అంటాడు. దానికి హాసిని, విశాల్‌లు తనని మేం నయని అనే అనుకుంటున్నామ్ అంటారు. దానికి గురువుగారు మీరు అనుకోవడం కాదు నయని తనని తాను గుర్తించిందా లేదా అన్నది ముఖ్యమని అంటారు.
విశాల్: స్వామి అమ్మ ఆత్మ వస్తే ముందు నయని చూడలేదు. ఆత్మ నాకు కనిపించడం లేదని చెప్పింది ఎందుకు అలా చెప్పిందో మాకు అర్థం కాలేదు.
హాసిని: పాపం అప్పుడు చెల్లి ఏడ్చింది కూడా.
గురువుగారు: చేతికి గడియారం పెట్టుకున్నావా నయని.
నయని: అవును స్వామి అనుకున్న పనులు టైంలో చేయాలని.
గురువుగారు: గాయత్రీదేవి ఆత్మని ఏ టైంకి చూశావు నయని.
నయని: టైం అంటే
విక్రాంత్: అప్పుడు సుమారు మధ్యాహ్నం మూడు అయింటుంది.
నయని: స్వామీజీ గారికి నేను ఇంకా ఐదు నిమిషాలే నయనిలా ఉంటానని తర్వాత మారిపోతానని తెలుసా. ఇంకో ఐదు నిమిషాల తర్వాత నేను త్రినేత్రిగా మారితే హేళన చేసేలా ఉన్నారే.
నయని తప్పించుకోవడానికి ఒంట్లో బాలేదు రెస్ట్ తీసుకుంటానని అంటే గురువు గారు ఆపి బాలేనప్పుడు అందరు ఉన్నప్పుడే ఉండాలని అంటారు. నయనిని కూర్చొమని అంటారు. నయని కూర్చొంటుంది. అయితే వెంటనే నయని మారిపోయి త్రినేత్రిగా మారిపోతుంది. అందరూ ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా నయని అంటే త్రినేత్రి తనని త్రినేత్రి అనమని అంటుంది. చేతికి గడియారం పెట్టుకోవడం గుర్తుందా త్రినేత్రి అని అంటే నాకు వాచ్‌లు ఇష్టం లేదని త్రినేత్రి అంటుంది. వాచ్ ఎందుకు పెట్టుకున్నావ్ అని హాసిని అడిగితే ఎందుకు పెట్టుకున్నానో తెలీదని అంటుంది.
విక్రాంత్: క్లాప్స్ కొట్టి బాగుంది అండీ భలే నటిస్తున్నారండీ మీరు. విశాల్ బ్రో అంటే నాకు ప్రాణం మా బ్రో పెళ్లి చేసుకున్న నయని వదిన అంటే మాకు దేవత. ఎవరు ఎలా అనుకుంటారో తెలీదు కానీ మా వదినను నేను పూజిస్తున్నాను. కానీ మీరు ఎవరండీ మా వదినలా వచ్చి మమల్ని ఇలా మోసం చేయడానికి.
త్రినేత్రి: నేను మోసం చేయడం ఏంటి.
విక్రాంత్: దేవీపురం నుంచి వచ్చాను అన్నారు కదా. మా వదిన కూడా దేవీపురం నుంచే వచ్చారు. మా వదినకు అక్కడ యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో చేరింది. ఇప్పుడు నయని వదినలా నువ్వు వచ్చావ్ ఎవరు నువ్వు.
విశాల్: విక్రాంత్..
విక్రాంత్: తను నయని వదిన కాదు.
గురువుగారు: అనాలోచితంగా ఆలోచించి తప్పు చేయకు విక్రాంతా తను నయనినే.
త్రినేత్రి: నేను నయని కాదు త్రినేత్రిని.
గురువుగారు: నువ్వు త్రినేత్రివే. త్రినేత్రి సరిగ్గా మూడు గంటలకు ఏం జరిగిందో గుర్తు చేసుకొని ఈ మూడు గంటలు ఏం చేశావో గుర్తు చేసుకోకపోయినా తర్వాతా ఏం చేయాలో గుర్తు పెట్టుకో గుర్తుగా పెట్టుకో. ఆ తర్వాత ఇలా వీళ్లందరి చేత నువ్వు మాటలు పడాల్సిన అవసరం ఉండదు. శుభం భుయాత్.. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.