Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారితో తన కొటేషన్ టెండర్‌లో వేయించిన లక్ష్మీ.. చివరి నిమిషంలో ట్విస్ట్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ తాను కొటేషన్ వ్యాల్యూ సిద్ధం చేసి విహారికి ప్రాజెక్ట్ వచ్చేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ టెండర్ కొటేషన్ వ్యాల్యూని విహారి ల్యాప్‌టాప్‌లో మార్చేస్తుంది. ఆ పేపర్లను రెడీ చేసి ఎలా అయినా వాటిని విహారికి అందజేయాలని అనుకుంటుంది. వాటిని తీసుకొని టెండర్ జరుగుతున్న చోటుకి పరుగులు తీస్తుంది. లక్ష్మీ ఎప్పుడూ ఏడస్తూ కూర్చొంటే అమాయకురాలు అనుకున్నా కానీ తనలో ఆది శక్తి కూడా ఉందని ఇప్పుడే తెలిసిందని అనుకుంటాడు.
విహారి, అంబిక అందరూ గోల్డెన్ ప్రాజెక్ట్ టెండర్ జరుగుతున్న చోటుకి చేరుకుంటుంది. టెండర్ మనకే వస్తుందని విహారి అంటే దానికి అంబిక ఇంకేంటి విహారి మనకు వచ్చేది నీ రహస్యం నేను చేరకూడని చోటుకి చేర్చాను అని అనుకుంటుంది. ఇంతలో సుభాష్ కూడా వచ్చి విహారిని కలుస్తాడు. అంబిక టెండర్ వాల్యూ చేరవేసిన పురుషోత్తం, గోవింద్ వాళ్లు విహారితో ఛాలెంజ్ చేస్తారు. మీ ప్రాజెక్ట్ ఇవ్వకుండా మమల్ని పురుగును చూసినట్లు చూశావ్ కదా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గెలిచి మేం ఏంటో చూపిస్తామని అంటారు.
విహారి: వీళ్లేంటి అత్త ఓ చిన్న చేపని కూడా గ్యాలం వేయలేరు అలాంటిది తిమిగలం లాంటి ఈ ప్రాజెక్ట్ దక్కించుకుంటామని అంటున్నారు.
అంబిక: ఎవరి దగ్గర ఏ అస్త్రం ఉందో మనకు తెలీదు కదా విహారి బలమైన అస్త్రం ఉన్నట్లుంది అందుకే అలా మాట్లాడుతున్నారు.
లక్ష్మీ: టెండర్ స్టార్ట్ అయ్యేలోపు నేను అక్కడికి వెళ్లాలి లేదంటే విహారి గారు ప్రాజెక్ట్ కోల్పోతారు.
విహారి: అత్త టెండర్ స్టార్ట్ అయింది కొటేషన్ డ్రాప్ బాక్స్‌లో వేద్దామా అత్త.
అంబిక: విహారి ముఖ్యమైన కాల్ వచ్చింది నువ్వు వెళ్లి డ్రాప్ బాక్స్‌లో కొటేషన్ వేయ్ నేను వస్తా. కాస్త దూరం నుంచి చూస్తూ నీ పతనానికి తొలిమెట్టు పడబోతుంది విహారి.
లక్ష్మీ: విహారి కొటేషన్ డ్రాప్‌బాక్స్‌లో వేస్తుండగా.. విహారి గారు అని అరుస్తుంది లక్ష్మీ.
విహారి: లక్ష్మీ నువ్వేంటి ఇక్కడ.
లక్ష్మీ: విహారి గారు మీరు వేయాల్సింది ఆ కవరు కాదు ఈ కవరు. మీరు తయారు చేసుకున్న పేపర్లు ఇవి.
విహారి: లక్ష్మీ ఇది ఫన్నీ కాదు లాస్ట్ మినిట్‌లో ఇలా చేయకు.
లక్ష్మీ: విహారి గారు నన్ను నమ్మండి. ప్లీజ్ ఇంకేం ఆలోచించకుండా ఈ కవరు వేయండి. టైం అయిపోవడంతో విహారి కంగారు పడుతూనే లక్ష్మీ తెచ్చిన కవరు వేస్తారు.
మరోవైపు వసుధ పద్మాక్షితో పెళ్లి పనులు ప్రారంభం చేయాలని చీరలు కొందామని యమునకు చీరల గురించి బాగా తెలుసని యమునకు పిలిచి చీరలు బాగా నేచే ఊరు చెప్పమని అంటుంది. యమున ధర్మపురంలో బాగుంటాయని మనకు నచ్చినట్లు నేచి ఇస్తారని చెప్తుంది. వసుధ అక్కడికి వెళ్లి అర్డర్ ఇద్దామని అంటే పద్మాక్షి కోపంగా ఉంటుంది కానీ సహస్ర కూడా వెళ్దామని అంటే పద్మాక్షి సరే అంటుంది. ఇక వసుధ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తానని వెళ్తుంది. ఇక సహస్ర యమునతో నాకు నచ్చిన చీరలు తీసుకుంటా మీరు మీ ఇష్టం నచ్చినట్లు చేయొద్దని అంటుంది. యమున సరే అని వెళ్లిపోతుంది.
మరోవైపు లక్ష్మీ వల్ల చివరి నిమిషంలో డాక్యుమెంట్ల మార్చి టెండర్ వేశాను ఏమువుతుందో అని విహారి టెన్షన్ పడతాడు. టెండర్ ఎవరికి వస్తుందో కంగారు పడుతుంటాడు. ఇక డ్యాక్యుమెంట్స్ ఎందుకు మారిపోయావా అని వాటిని చూడటానికి ప్రయత్నించడంతో లక్ష్మీ కంగారు పడుతుంది. ఇక విహారి కనకాన్ని పార్కింగ్ దగ్గర వెయిట్ చేయమని చెప్తాడు. దాంతో లక్ష్మీ వెళ్తుంది. మరోవైపు అంబిక, సుభాష్ మాట్లాడుకుంటారు. టెండర్ అనౌన్స్ చేయగానే విహారి ఓటమి ముఖం చూడాలని అంబిక సుభాష్ మాట్లాడుకుంటారు. టాప్ సెకండ్ కోట్స్ చెప్తామని రెండ్ స్థానంలో పురుషోత్తం, గోవింద్‌లు నాలుగు వందల అరవై కోట్లకు కోట్ చేశారని చెప్తారు.
అంబిక, సుభాష్‌తో పాటు వాళ్లిద్దరూ కూడా షాక్ అవుతారు. ఇక విహారి వీళ్లు తనకంటే బాగా కోట్ ఇచ్చారని వాళ్లకంటే ఎక్కువ కోటే చేసిన తనకు కూడా ప్రాజెక్ట్ రాదని అనుకుంటాడు. ఈసారి తాను మిస్ అయ్యానని అనుకుంటాడు. బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోతుంటాడు. ఇంతలో నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతో విహారి సంస్థ ప్రాజెక్ట్ దక్కించుకుందని అనౌన్స్ చేస్తారు. అంబిక వాళ్లతో పాటు విహారి కూడా షాక్ అయిపోతాడు. లక్ష్మీ చాలా సంతోషిస్తుంది. నేను కోట్ చేసిన దాని కంటే తక్కువతో ఎలా వచ్చిందని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: గంగ వెనకున్న కర్త, కర్మ నేనే అని మామ కాని మామకి షాకిచ్చిన సత్య.. భైరవి యాక్టింగ్ సూపర్!