అన్వేషించండి
Brahmamudi January 16th Episode: రాజ్ తో ఆడేసుకున్న కావ్య.. క్లాస్ వేసిన స్వప్న.. రుద్రాణి నగల పంచాయతీ - బ్రహ్మముడి జనవరి 16ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 16th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 16th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/10

రూమ్ లోకి వచ్చిన కావ్యను హగ్ చేసుకుంటాడు రాజ్..ఎవరైనా చూస్తారండీ అనగానే...నిన్ను పిలిచింది అందుకు కాదంటూ.. గిఫ్ట్ చేతిలో పెడతాడు. తనకోసమే అనుకుని మెలికలు తిరుగుతుంది.
2/10

తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో నక్లెస్ ఉంటుంది. స్వప్న నక్లెస్ కొనుక్కుంటే తిట్టావ్ కదా ఇప్పుడు గిఫ్ట్ గా ఇవ్వు అంటాడు. అంతేనా ఇంకేం లేదా అంటూ రాజ్ ని రెచ్చగొట్టి వెళ్లిపోతుంది
3/10

ఆ తర్వాత ఈ పేద ఫంక్షన్, పేద మొహాలు చూడలేకపోతున్నాం బయటకు వెళ్లి కూర్చుందాం అని వస్తారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. కాలు విరిగిన ఛైర్ పై శాలువా వేసి కవర్ చేస్తుంది కనకం. అందులో కూర్చునేందుకు రుద్రాణి ప్రయత్నిస్తే కనకం, శీను ఆపుతారు
4/10

ఏదైమైనా నేను కూర్చుని తీరుతా అని కూర్చుని పడిపోతుంది రుద్రాణి. ఆ తర్వాత కనంపై నోరు పారేసుకుంటుంది. శీనుని కొడుతుంది
5/10

అపర్ణ, ఇందిరాదేవి, కనకం.. స్వప్నను రెడీ చేస్తుంటే..నీకో సర్ ప్రైజ్ అంటూ నక్లెస్ గిఫ్ట్ గా ఇస్తుంది కావ్య. నీ సీమంతానికి దుగ్గిరాలవారింటివారు ఇచ్చే కానుక అంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి,రుద్రాణి వచ్చి నోటికి పనిచెప్తారు. ఇద్దరూ తోడు దొంగలు అని నిందలు వేస్తారు.
6/10

తోడబుట్టిన అక్కను ఓలా చూసి మనందర్నీ మరోలా చూస్తోందంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రకాశం, సుభాష్ మనం సీమంతానికి వచ్చాం , సీమంతం జరిపించి వెళదాం అంటారు. అయినా నీ కోడలి సీమంతానికి నువ్వే గొడవ చేస్తున్నావ్ బుద్ధుందా అంటాడుసుభాష్.
7/10

కావ్య, స్వప్నని అవమానిస్తుంటే అక్కడకు వచ్చిన రాజ్ ఆ నక్లెస్ కళావతి తీసుకురాలేదు నేను తీసుకొచ్చానంటాడు రాజ్.
8/10

ఏమత్తా నాకు నా చెల్లికి దూరం పెంచాలని ఏదేదో చెప్పావ్..మేం ఇద్దరం ఎప్పటికీ ఒకటే ఇక వెళ్లు అంటుంది. ధాన్యలక్ష్మీ, రుద్రాణి బయటకు వెళ్లిపోతారు.
9/10

ఎంక్వరీ పనిలో ఉన్న రాహుల్ వచ్చి రుద్రాణిని పిలుస్తాడు. హాస్పిటల్ బిల్ కట్టింది కంపెనీ చెక్ తో కాదు.. క్యాష్‌తో కట్టింది. అది నగలు తాకట్టు పెట్టి బిల్ కట్టారని చెబుతాడు. కావ్యపై నాకు ముందే డౌట్ వచ్చింది..అయినా నగలు తాకట్టు పెట్టి బిల్లు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటారు. కంపెనీ దివాలా తీసిందేమో అనుకుంటారు
10/10

బ్రహ్మముడి జనవరి 17 ఎపిసోడ్ లో... రుద్రాణి మరో రచ్చ మొదలెట్టింది.. కావ్య నగల గురించి అందరి ముందూ నిలదీస్తుంది..అసలు కావ్య నగలు ఉన్నాయా లేవా అని నిలదీస్తుంది... రాజ్-కావ్య షాక్ అవుతారు
Published at : 16 Jan 2025 08:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion