Kohli In Ranji Trophy: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రంజీల్లో బరిలోకి కోహ్లీ.. ఆ తేది నుంచి మైదానంలోకి రన్ మేషిన్
ఇటీవల ఆసీస్ టూర్లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టుల్లో కలిపి 9 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకేతరహా ఔటై విమర్శల పాలయ్యాడు.జట్టులో అతని స్థానం ప్రశ్నార్థకమైంది.

Virat Kohli News: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. మళ్లీ రంజీల్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23నుంచి మలిదశ పోటీల్లో భాగంగా రాజకోట్ లో సౌరాష్ట్ర జట్టుతో డిల్లీ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం రాజకోట్ కు వెళ్లే ఢిల్లీ జట్టులో కోహ్లీ కూడా వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్ లో తను ఆడేది లేనిది అనే దానిపై స్పష్టత లేదు. అయితే తను మాత్రం రంజీ జట్టుతో గడపడం అనేది పక్కా అని తెలుస్తోంది. ఒకవేళ తను జట్టులో ఆడకపోయినా, వర్థమాన ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటూ వారికి మెళకువలు నేర్పే అవకాశముందని తెలుస్తుంది. ఒకవేళ కోహ్లీ బరిలోకి దిగితే దాదాపు 13 సంవత్సరాల తర్వాత రంజీ మ్యాచ్ అఢినట్లు అవుతుంది. చివరిసారిగా 2012లో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత తను టీమిండియా టెస్టు కెప్టెన్ అయ్యాడు. ఈ 13 ఏళ్ల కాలంలో దేశవాళీల్లో కోహ్లీ ఆడలేదు.
పంత్ కూడా సిద్దం..
ఇక రంజీల్లో ఢిల్లీకే ప్రాతినిథ్యం వహిస్తున్న భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా రంజీల్లో బరిలోకి దిగనున్నాడు. కోహ్లీతో కలిసి తను యువ ఢిల్లీ రంజీ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూంను పంచుకోనున్నాడు. ఇక దేశవాళీల్లో ఆడాలంటూ బీసీసీఐ హుకుం జారీ చేయడంతో భారత క్రికెటర్లు అంతా ఒక్కొక్కరుగా తమ సొంత రంజీ జట్ల తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముంబై తరపున రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్లేయర్లను గాడిలో పెట్టేందుకు పది సూత్రాలతో కూడిన ఒక డాక్యుమెంట్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. బోర్డు సూచించిన మార్గదర్శకాలను ఆటగాళ్లు కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మ్యాచ్ ఫీజులో కోత, సస్పెన్షన్ తోపాటు ఐపీఎల్ లాంటి బీసీసీఐ నిర్వహించే టోర్నీలలో ఆడకుండా నిషేధం విధిస్తామని పేర్కొంది.
కోత్త బ్యాటింగ్ కోచ్ గా సితాన్షు కోటక్..
ఇటీవల టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతున్న టీమిండియాను గాడిలో పెట్టేందుకు కొత్త బ్యాటింగ్ కోచ్ ను బీసీసీఐ నియమించింది. 52 ఏళ్ల సీతాన్షు కోటక్ ను టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా నియమించినట్లు బోర్డు తెలిపింది. అపార అనుభవం గల సితాన్షు.. జట్టు బ్యాటింగ్ ను గాడిలో పెట్టగలడని పేర్కొంది. తన సుదీర్ఘ కాలంలో జాతీయ క్రికెట్ అకాడమీ లో కోచ్ గా సేవలందిస్తున్నాడు. కొంతకాలంగా స సీనియర్ జట్టుతో పాటు ఏ జట్టు కోచ్ గాను సేవలందించాడు. ఐర్లాండ్ టూర్లో ప్రధాన కోచ్ గాను వ్యవహరించాడు.
సితాన్షు రాకతో అభిషేక్ నాయర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆసీస్ టూర్లో భారత బ్యాటర్ల టెక్నిక్ లోపాలు బయట పడినా టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాయర్ పై వేటు వేసేందుకే బోర్డు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అతని ప్లేస్ లోనే సితాన్షు ను ఎంపిక చేసినట్లు సమాచారం.
Also Read: IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

