అన్వేషించండి

Trinayani Serial Today November 21st: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి ఫొటోకి దండ తీసేసి బొట్టు చెరిపేసిన స్వామీజీ.. పరిస్థితి చేజారిపోతుందన్న విక్రాంత్!

Trinayani Today Episode త్రినేత్రి చనిపోలేదని తన దేహం సజీవంగా ఉందని ఓ స్వామీజీ త్రినేత్రి ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode త్రినేత్రి విశాల్‌తో మీరు నన్ను స్వార్థంతో ఇక్కడుండనిస్తున్నారు అని అంటుంది. దానికి విశాల్ ఇక్కడుండకపోతే ఇంకెక్కడుంటావ్ అని అడుగుతాడు. దాంతో త్రినేత్రి ఆలోచనలో పడుతుంది. విశాల్ కూడా త్రినేత్రిని డౌట్‌గా చూస్తాడు. త్రినేత్రి ఏం గుర్తు రావడం లేదు ఏమైంది నాకు అని అనుకొని వెళ్లిపోతుంది. మరోవైపు త్రినేత్రి ఇంటికి ఓ స్వామీజీ వస్తారు. 

ముక్కోటికి వైకుంఠం వడ్డిస్తుంది. స్వామీజీకి కూడా వడ్డించమని బామ్మ వైకుంఠంతో చెప్తుంది. ఇక త్రినేత్రి చనిపోయిందని స్వామీజీతో వైకుంఠం చెప్తుంది. దాంతో స్వామీజీ ముద్ద చుట్టిన అన్నం ఆకులో వదిలేసి త్రినేత్రి ఫొటో దగ్గరకు వెళ్లి పరీక్షగా చూస్తారు. ఇక సీన్ కట్ చేస్తే విశాల్, విక్రాంత్‌లు బిసినెస్‌ పనులు చూస్తుంటారు. గాయత్రీ పాప పేపర్ చింపి పడేస్తే సుమన క్లీన్ చేయలేక నా నడుం పడిపోతుందని చిరాకు పడుతుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. 

సుమన: ఈ పిల్ల అల్లరి చేస్తే మేం చాకిరీ చేయాలా.
విక్రాంత్: ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నావేంటి.
సుమన: మా అక్కకి అయినా కష్టమే కదా. ఇప్పటికే తలకు గాయం అయి రోజుకోలా ప్రవర్తిస్తుంది.
విశాల్: సుమన ప్లీజ్ నయని నీ సొంత అక్క అయినా అంత చనువు తీసుకొని నా దగ్గర తన గురించి తక్కువ చేసి మాట్లాడకు. 
హాసిని: చిట్టీకి దెబ్బలు తిని చాలా రోజులు అయినట్లుంది.
విక్రాంత్: బ్రో అటు చూడండి లంగావోణిలో వచ్చిన త్రినేత్రిని చూపించి.
హాసిని: ఏంటి చెల్లి ఇలా వచ్చావ్.
త్రినేత్రి: ఏంటి అక్కా అలా అడిగావ్. 
పావనా: అలా అని కాదు నయనమ్మా మళ్లీ లంగావోణిలో వచ్చావ్ ఏంటా అని. 
త్రినేత్రి: నయని అని బాబుగారు పిలిస్తే తనకు ఆ పేరు ఇష్టమని అనుకున్నా కానీ మీరు కూడా అలాగే అంటారేంటి బాబాయ్.
వల్లభ: అంటే ఏంటి మమ్మీ.
తిలోత్తమ: నయని కాదురా త్రినేత్రి.
వల్లభ: అమ్మబాబోయ్ నా వల్ల కాదు నేను వెళ్లిపోతా ఈ కన్ఫ్యూజన్ నా వల్ల కాదు.  

తిలోత్తమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. త్రినేత్రి తనకు ఏం దెబ్బ తగల్లేదని అంటుంది. ఇక తిలోత్తమ మందులు తీసుకొచ్చి త్రినేత్రికి వేసుకోమని ఇస్తుంది. మందులు నేను వేసుకోవడం ఏంటి అని త్రినేత్రి ట్యాబ్లెట్స్  విసిరేస్తుంది. అలా విసిరేశావెందుకి విశాల్ అడిగితే ఊరికే మందులు వాడటం మంచిది కాదని త్రినేత్రి అంటుంది. త్రినేత్రి ఇలా చేయడంతో తనకు మతి పోయి అయినా ఉండాలి లేదంటే తలకు గాయం అయినా అవ్వకుండా ఉండి ఉంటుందని అంటుంది.. దాంతో విక్రాంత్ తాను నయని కాదని నాకు అనిపిస్తుందని అంటాడు. తాను చెల్లి కాదు అని అంటావేంటి అని హాసిని అంటుంది. ఇక సుమన త్రినేత్రి అక్క మందులు వేసుకో నీకు పిచ్చి అని అంటుంది. దాంతో త్రినేత్రి సుమన చెంప వాయిస్తుంది. విక్రాంత్ విశాల్‌తో పరిస్థితి చేయి దాటేలా ఉందని అంటాడు. 

మరోవైపు స్వామీజీ ఫొటోకి దండ ఎందుకు వేశారు చనిపోయిందని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు. దాంతో ముక్కోటి, వైకుంఠం తాము గతంలో అల్లిన కథ చెప్తారు. ఇక స్వామీజీ త్రినేత్రి ఫొటోకి ఉన్న దండ తీసేసి బొట్టు తుడిచి ఫొటో ఎదుట ఉన్న దీపం తులసి కోట దగ్గర పెట్టమని అంటారు. దేహం కాలడం మీరు చూశారా పూడ్చడం చూశారా అని అడుగుతారు దాంతో ఇద్దరూ లేదని చెప్తారు. దాంతో త్రినేత్రి దేహం పచ్చగా ఉంటే ఇలా ఎలా చేస్తారని అడిగి మీరు చేసిన పనికి నా ఆకలి  చచ్చిపోయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు విక్రాంత్ నయని వదినను డాక్టర్ ఎక్కడ పెట్టారు. ఇంటికి వచ్చింది ఎవరు నయని వదినలా ఉంది నయని వదినేనా ఏంటి ఇదంతా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుమన అక్కడికి వస్తుంది. బాగా తగిలిందా దెబ్బ అని సెటైర్లు వేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కంగారు పెట్టించి చక్రవర్తి నిజం ఒప్పుకునేలా చేసిన సత్య.. క్రిష్‌, చక్రిలను కలుపుతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
Tirumala News: అమరావతిలో పెళ్లి చేసుకోనున్న తిరుమల శ్రీనివాసుడు- విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
అమరావతిలో పెళ్లి చేసుకోనున్న తిరుమల శ్రీనివాసుడు- విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ  
SLBC Tunnel News:కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
కేరళ కెడావర్ డాగ్స్‌ రాకతో కీలక దశకు ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్
Embed widget