శంఖం పూలను కొందరు అందం కోసం.. మరికొందరు పూజల కోసం పెంచుకుంటారు.

వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఎక్కువమందికి తెలీదు. తెలిస్తే కచ్చితంగా రోజూ వీటిని తీసుకుంటారు.

ఒత్తిడిని తగ్గించి యాంగ్జైటీని పోగొట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయి. జ్ఞాపకశక్తిని కూడా ఇది మెరుగుపరుస్తుంది.

డిప్రెషన్​ను తగ్గించి.. మెరుగైన నిద్రను అందిస్తుంది. నిద్ర సమస్యలున్నవారికి ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు రెగ్యూలర్​గా వీటితో చేసిన టీ తాగితే చాలా మంచిది. మలబద్ధకం కూడా దూరమవుతుంది.

ఇమ్యూనిటీ పెంచి.. సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి.

ఆస్తమా, దగ్గు, బ్రోంకైటీస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచి ఫలితాలిస్తుంది.

స్కిన్ హెల్త్​ని ప్రమోట్ చేసి.. యాక్నే సమస్యల్ని దూరం చేస్తుంది.

జుట్టు పెరుగుదలకు కూడా ఇది చాలా మంచిది. చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Freepik)