అన్వేషించండి

Satyabhama Serial Today November 20th: సత్యభామ సీరియల్: కంగారు పెట్టించి చక్రవర్తి నిజం ఒప్పుకునేలా చేసిన సత్య..  క్రిష్‌, చక్రిలను కలుపుతుందా!

Satyabhama Today Episode క్రిష్ కండీషన్ సీరియస్‌గా ఉందని సత్య చక్రవర్తితో చెప్పి చక్రవర్తి క్రిష్ తన కన్న కొడుకు అని ఒప్పుకునేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సంధ్యని రెస్టారెంట్‌లో సంజయ్ కలుస్తాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని ఫ్లర్ట్‌ చేసినట్లు రష్యా, క్రూడాయిల్, విధి మనల్ని కలుపుతుంది అని కాఫీ తాగుదామని అంటాడు. దాంతో సంధ్య ఈసారి విధి మనల్ని కలిపితే అప్పుడు కాఫీ తాగుదామని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు నిజం దాచినా సత్యకు ఎలా తెలిసిపోయిందని చక్రవర్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చక్రవర్తికి సత్య కాల్ చేస్తుంది.

సత్య: చిన్నమామయ్య మీ కొడుకు బైక్‌ మీద వెళ్తుండగా రౌడీలు అటాక్ చేశారు. కత్తితో పొడిచేశారు.
చక్రవర్తి: ఎలా ఉంది నా క్రిష్‌కి ఇప్పుడు ఎలా ఉంది.
సత్య: హాస్పిటల్‌లో ఉన్నాడు వెంటనే రండి. 
చక్రవర్తి: ఎలా ఉందమ్మా క్రిష్‌కి ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు కదా. డాక్టర్లు ఏమన్నారు వెంటనే నేను క్రిష్‌ని చూడాలి పద క్రిష్‌ని చూడాలి.
సత్య: ఒక్క నిమిషం చిన్నమామయ్య నేను కండీషన్ సీరియస్‌గా ఉంది అన్నది మీ కొడుకుది మీరేంటి క్రిష్ క్రిష్‌ అని కంగారు పడుతున్నారు. మీ కొడుకు సంజయ్‌ కదా. మీ గుండె చప్పుడు నాకు ఇక్కడ వరకు వినిపిస్తుంది చిన్న మామయ్య. మీరు ఎంత బాధ పడ్డారో మీ కళ్లలో నాకు తెలిసింది. కన్నకొడుకు ప్రమాదంలో ఉన్నాడు అంటే ఏం తండ్రి అయినా మీ లాగే ప్రవర్తిస్తాడు. దాచుకున్న మీ కన్న ప్రేమ కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది కదా ఒప్పుకోండి చిన్నమామయ్య ఇప్పటికైనా ఒప్పుకోండి. పాతికేళ్లగా ఓ నిజం గుండెల మీద దాచుకున్నా అని చెప్పండి. ఎవరు మీ కన్న ప్రేమని తొక్కేస్తున్నారు. ఎవరు ఎవరు అది.


చక్రవర్తి: మహదేవయ్య..

ఆ మాట వినగానే సత్య చక్రవర్తి చేయి పట్టుకొని లాక్కెళ్తుంది. మరోవైపు హర్ష రెడీ అవుతుంటే నందిని కాఫీ తీసుకెళ్తుంది. ఇక హర్ష నందిని ఈవినింగ్ ఫుడ్ ఫెస్ట్‌కి తీసుకెళ్తానని రెడీగా ఉండమని అంటాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇక నందినికి మైత్రి ముద్దు పెట్టుకుంటాడు. ఇక నందిని హర్షని డ్రాఫ్ చేస్తూ కిస్‌లు పెడుతూ పంపిస్తుంది. ఇక శాంతమ్మతో నందిని సరదాగా మాట్లాడుతుంది. హర్ష బయటకు తీసుకెళ్తాడని చెప్పి నీకు ఫుడ్ తీసుకొస్తా అని చెప్పి నడుం తిప్పుకొని నడిస్తే శాంతమ్మ అది చూసి అల్లరి పిల్ల అని అనుకుంటుంది.

సత్య: ఈ రోజుతో ఈ కథ ముగిసిపోవాలి చిన్నమామయ్య.
చక్రవర్తి:  ఆ అవకాశమే ఉంటే కథ ఇక్కడి వరకు రానిచ్చేవాడినే కాదమ్మా 
సత్య: బిడ్డల్ని మార్చి మీ అన్నయ్య తప్పు చేశారు అడ్డుకోకుండా మీరు తప్పు చేశారు. ఇప్పుడు మీతోపాటు క్రిష్‌ కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. మీ అన్నయ్యని క్షమించేస్తున్నారా. మీ కొడుకు క్షేమంగా లేడు మామయ్య ఆ మహదేవయ్య క్రిష్‌ ప్రాణాలతో రోజు రోజు ఆడుకుంటున్నాడు. మీ కొడుకు జీవితాన్ని బలి పెడుతున్నాడు. మీ అన్నయ్య మన అందరి జీవితాలతో ఆడుకుంటున్నాడు. 
చక్రవర్తి: ఇవన్నీ నాకు తెలియని విషయాలు కాదమ్మా. నేను కష్టాలకు కొడుకుని బలి తీసుకొనే వాడిని కాదు. నేను ఇలా సైలెంట్‌గా ఉంటే నా కొడుకు జీవితం బాగుంటుందని మౌనంగా ఉండిపోయా. మహదేవయ్య పేరుకే నా అన్నయ్యా కానీ నరరూప రాక్షసుడు. అతను చేసింది ఒక నేరం కాదు రెండు. మొదటిది బిడ్డల్ని మార్చడం అయితే రెండోది నా భార్యని పురిటి మంచం మీదే చంపేయడం. 
సత్య: ఏంటి మామయ్య మీరు అనేది మీ భార్యని మీ అన్నయ్య చంపేశాడా. ఈ విషయం మీకు తప్ప ఇంకెవరికైనా తెలుశా.
చక్రవర్తి: చేసిన నేరాల తాలూకు సాక్ష్యాలు మిగల్చడం తనకి అలవాటు లేదు నా సుఖాన్ని నా సంతోషాన్ని లాక్కున్నాడు. నా కంటే దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరూ ఉండరు. జీవితానికి సరిపడా బాధ మిగిల్చాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలి అని ఉంది. 
సత్య: మామయ్య ఇప్పటికైనా నిజం చెప్పొచ్చు కదా.
చక్రవర్తి: క్రిష్‌ ఆవేశం తెలిసి ఆగుతున్నా నేను నాన్నఅని తెలిస్తే సంతోషపడతాడు కానీ తన తల్లిని చంపింది మహదేవయ్య అని తెలిస్తే ఆయన్ను చంపేసి జైలుకి  వెళ్లిపోతాడు అందుకే నిజం దాచేస్తున్నా.
సత్య: కన్న తండ్రి ఎవరో తెలుసుకొనే అవకాశం క్రిష్‌కి లేనట్లేనా.  
చక్రవర్తి: క్రిష్‌కి నువ్వు ఉన్నావమ్మా నిజం తెలియకపోయినా పర్లేదు నువ్వు చూసుకుంటావ్ క్రిష్‌ని ముందు ఆ ఇంటి నుంచి క్రిష్‌ని బయటకు తీసుకురా.

సత్య నిజం మీనోటితోనే చెప్పమని చక్రవర్తిని అడుగుతుంది అయినా చక్రవర్తి వద్దని అంటాడు. దాంతో సత్య నేను నా భర్త కోసం ఎంత దూరం అయినా వెళ్తానని మీ సాయం దొరుకుతుందేమో అని వచ్చానని కానీ మీరు సాయం చేయడం లేదు నేనే మిమల్ని నాన్న అని పిలిపిస్తా మీరు చూస్తూ ఉండండి అంటుంది. మరోవైపు మహదేవయ్యకి క్రిష్ కాళ్లు నొక్కడం సత్య చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌లపై విరుచుకుపడ్డ శివనారాయణ.. కార్తీక్ కోసం తాతపై చేయెత్తిన దీప!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget