Trinayani Serial November 20th Episode పిల్లల్ని కాపాడిన నందీశ్వరుడు.. చిత్రగుప్తుడికి నయని ఫ్యామిలీ పూజలు
Trinayani Serial Today Episode నయని కుటుంబం ప్రాణ గండం పోవడానికి చిత్ర గుప్తుడికి పూజలు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
తిలోత్తమ: పాలు బదులు పిండి నీళ్లు తాగిన పిల్లలు గింజుకుంటున్నారు. వాళ్లని కాపాడటానికి అమ్మలను కన్న అమ్మను రమ్మనండి చూద్దాం.
గురువుగారు: తిలోత్తమ ఎగతాళి చేయొద్దు
తిలోత్తమ: నామీద ఒట్టు గురువుగారు నేను ఎగతాళి చేయడం లేదు అప్పుడొచ్చిన అమ్మవారు ఇప్పుడెందుకు రావడం లేదు. ఏదిఏమైనా పిల్లల్ని రక్షించమనే కదా వేడుకునేది
పావనామూర్తి: నయని అమ్మా మాలాంటి వాళ్లు కోరితే ఆ తల్లి కరుణించదు. నీవే పిలువుతల్లి
నయని: తలచుకోగానే ఆ తల్లి రావాలి కదా
సుమన: పిలువు అక్కా అవన్నీ నాకు చెప్పకు నా బిడ్డకు ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తా మీ అందరి సంగతి ఎవర్ని వదిలిపెట్టను
విశాల్: పదండి డాక్టర్ దగ్గరకు తీసుకెద్దాం
తిలోత్తమ: అయితే ఇప్పుడు అమ్మవారు రారు అన్నమాట
గురువుగారు: కంగారు పడకు విశాలా అమ్మలను గన్న అమ్మ బిడ్డలను కాపాడే దూతను పంపిస్తుంది.
మరోవైపు ఎద్దులయ్య అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక అక్కడ పిల్లలు తిన్న ఆ పిండి తాను గ్రహించేలా అనుగ్రహించు తల్లీ అని వేడుకుంటారు. తర్వాత ఆయన ఎద్దులా మారి నయని ఇంట్లోకి వెళ్తారు. ఆ ఎద్దును చూసి అందరూ షాక్ అవుతారు.
గురువుగారు: పిల్లల్ని కాపాడటానికి నందీశ్వరుడు వచ్చాడు. అమ్మా నయని గాయత్రీని, ఉలూచీని కింద పడుకోపెట్టండి అని చెప్తారు.( దీంతో ఇద్దరూ పిల్లల్ని కింద పడుకోపెడతారు. దీంతో ఎద్దు అక్కడికి వచ్చి వాళ్లు తాగిన పిండి నీళ్లను తాగేస్తుంది.) విశాలాక్షి అమ్మ ఆజ్ఞతోనే వచ్చావా నందీశ్వరా అని గురువుగారు అడిగితే ఎద్దు తల ఆడిస్తుంది. వెళ్లి మళ్లీ రా నందీశా. అని గురువు గారు చెప్పడంతో ఎద్దు వెళ్లిపోతుంది. పిల్లలు ఇక సెట్ అయిపోతారు.
హాసిని: అత్తయ్య ఇంకా కోలుకున్నట్లు లేరు. భక్తుల్ని కాపాడటానికి అమ్మవారు అదే పనిగా రానవసరం లేదు ఏదో రూపంలో వస్తారు అని తెలుసుకోండి. పిచ్చిపని చేసింది మీరు.
విశాల్: స్వామి ఇదంతా ప్రాణ గండం ప్రభావం అనిపిస్తుంది
గురువుగారు: అవును విశాలా
నయని: స్వామి శాంతి చేయాలి అంటే చేస్తాం సెలవివ్వండి
గురువుగారు: అందరి పాపాలను లెక్కించే చిత్రగుప్తుడ్ని పూజిస్తే ఈ పాపల మీద దయ చూపిస్తాడేమో చూద్దాం
సమన: (విక్రాంత్, హాసిని, గురువుగారు చిత్రగుప్తుడి ఫొటో ప్రింట్ తీస్తుంటే)మనసులో.. ఎక్కడో ఉండే పెద్దత్తయ్య గాయత్రీ దేవి గారు క్షేమంగా చల్లగా ఉండాలని మా ఆయన హడావుడి పడటం ఏంటి నా మొగుడ్ని పనోడిని చేసిన వీళ్లందరి పనిని ఇప్పుడు చెప్తా. ఎంత టెక్నాలజీ ఉన్నా ఆయుష్షును పెంచే టెక్నాలజీని సాధించలేకపోయారు.
విక్రాంత్: నీలాంటి వాళ్ల వల్లే అలాంటి పని మానుకొని ఉంటారు.
సుమన: (ఇక గురువుగారు చిత్రగుప్తుడి ఫొటో చూస్తున్నప్పుడు సుమన దానిమీద నీరు పోసేస్తుంది) చూసుకోలేదు పొరపాటున చేయి జారింది క్షమించండి గురువుగారు
గరువుగారు: నువ్వు చాలా వరకు చేయి జారుతుంటావని నాకు తెలుసుకదా అమ్మా పడేసుకుంటే తప్పుకాదు కానీ మళ్లీ అది రాబట్టుకోవడం కష్టం. ఇంకో ప్రయత్నం వద్దు విక్రాంత్. పాపాలు లెక్కించే వారి చిత్రపటం అవసరం లేదు అని అర్థమైంది. రండి..
ఇక నయని కుటుంబ ఫ్యామిలీ మొత్తం చిత్రగుప్తుడి పూజకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో నయని ఎద్దులయ్యకు స్వయంపాకానికి కావల్సినవన్నీ తీసుకొని రమ్మని చెప్తుంది. సరే అని ఎద్దులయ్య, పావనామూర్తి వెళ్తారు.
తిలోత్తమ: గుమ్మడి కాయ కాడ తీసి అందులో ఏదో వేస్తూ.. చిత్రగుప్తుడి పూజ చేసి గురువుగారికి స్వయం పాకం దానం చేస్తే ఎక్కడో ఉన్న గాయత్రీ అక్కయ్యకు ప్రాణాపాయం ఉండదట.. నా శత్రువు అయిన తను బాల్యంలోనే ఈ జన్మను కూడా చాలించాలి అనుకొని గుమ్మడికాయ కాడ మూసివేస్తుంది. ఇంతలో ఎద్దులయ్య, పావనామూర్తి అక్కడికి వస్తారు. అన్నీ సామాగ్రీ తీసుకెళ్తారు. ఇక పీట మీద కలశం పెడుతుంది నయని. దానికి సుమన వెటకారం చేస్తుంది. మరోవైపు తిలోత్తమ, హాసిన సరదాగా గొడవ పడతారు. ఇక గురువుగారు పసుపు దేవుడికి, చిత్రగుప్తుడికి హారతి ఇమ్మని నయనికి చెప్తారు. మరోవైపు మీ పిల్లల ప్రమాదాలు మా పిల్లలకు వస్తున్నాయి గట్టిగా మొక్కుకోండి బావగారు అని సుమన విశాల్‌కు చెప్తుంది. నయని హారతి ఇస్తుంది. ఇంతలో తిలోత్తమ హారతి ఇవ్వడం అయిపోతే స్వయం పాకం ఇవ్వమని చెప్తుంది. దీంతో నయని మీరే ఇవ్వాలి అని చెప్తుంది. సోదరుడి వరసైన వారికి ఇవ్వాలని అందుకు సుమన పావనా మూర్తికి ఇమ్మని చెప్తారు. అయితే పావనామూర్తి బయపడతాడు. అందరూ అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.