అన్వేషించండి

Trinayani November 18th Today Episode : గాయత్రి, ఉలూచిలకు ఫేస్‌ ప్యాక్‌ తాగించేసిన హాసిని.. ప్రాణాపాయంలో పిల్లలు

Trinayani Serial Today Episode : పాలు అనుకొని గాయత్రీ, ఉలూచిలకు హాసిని ఫేస్ ప్యాక్ తాగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Trinayani Serial November 18th Episode : సుమన: ఛా పాడు పాము నా చీరంతా పాడు చేసేసింది. లక్షా పాతిక వేలు పెట్టి కొన్న చీర మీద నూనె పోసేసింది. ఇంకెందుకు పనికొస్తుంది ఈ చీర

విక్రాంత్: డబ్బులు కాలిపోయానా నీ కోరికలు మాత్రం బూడిద కాలేదన్నమాట. లక్షలు తగలేస్తున్నావ్ దానివల్ల ఏం వస్తుంది. బాణాసంచా కాల్చినా సంతృప్తి అయినా ఉండేది. 

సుమన: నా చీర కాలిపోయానా మీకు పర్లేదు. నేను మసి కొట్టుకుపోవాలి. నేను కూడా కాలిపోవాలి అని మీ కోరిక. మా అక్క నా చెంప పగలగొట్టినప్పుడు ఒక్కమాట అయినా అడిగారా

విక్రాంత్: మా అన్నయ్య అడిగాడు కదా

సుమన: నా మొగుడు మీరా ఆయనా.. ఉక్రోషానికి మీకు కొదవ లేదు.

విక్రాంత్: విశాల్ బ్రో విన్నాడంటే ఫీల్ అవుతాడు. నువ్వు ఏ కళ్లతో చూస్తున్నావో తెలీదు కానీ నిన్ను తన బిడ్డలా చూస్తున్నాడు విశాల్‌ బ్రో

సుమన: గాయత్రీని కన్న తల్లిదండ్రులు చావలేదా.. బతికే ఉన్నారా ఉంటే చూపించండి

విక్రాంత్: ఓసేయ్ నీకు దండం పెడతానే నా గురించో నీ గురించో మాట్లాడు వేరేవాళ్ల కోసం ఎందుకు 

సుమన: ముందు నన్ను చెప్పనివ్వండి అప్పుడు మీకు అర్థం అవుతుంది. నన్ను విశాల్ బావగారు బిడ్డగా చూస్తున్నప్పుడు అనాథగా ఉన్న గాయత్రిని దత్తత తీసుకొని కన్నకూతురు గానవితో పాటు తనకి కూడా 25 కోట్లు రాసిచ్చారు కదా అలాంటప్పుడు నాకు కూడా ఎంతో కొంత రాసివ్వమను. అప్పుడు నేను కూడా బావగారు అనకుండా తండ్రిగారు అని పిలుస్తాను

విక్రాంత్: డబ్బు కోసం నువ్వు ఎంత కైనా తెగిస్తావని నాకు తెలుసు. బిడ్డలా చూస్తారు అంటే సంతోషించక ఆస్తి రాసిస్తారా అంటున్నావ్ చూడు.. ఛీ అసలు నువ్వు ఏం చేశావో చెప్పు లేదంటే నయని వదిన నీ చెంప ఎందుకు పగలగొడుతుంది. 

తిలోత్తమ: నాగయ్య పాము కాకరపువ్వొత్తు తీసుకొని దీపాలు వెలిగిస్తే షాక్ అయ్యాను కానీ నేను తెచ్చి పెట్టిన అఖండ దీపం వెలిగించలేదు ఎందుకని ఆలోచిస్తున్నాను

వల్లభ: పాపిస్టిదానివి నువ్వు మూకుడు తెస్తే మూతి ముడుచుకుందేమో.. ఇది నా అభిప్రాయం కాదు మమ్మీ పాము ఫీలింగ్ ఇంతకీ నువ్వు ఏం అనుకుంటున్నావ్. 

తిలోత్తమ: పాము పిల్లను కన్న చిన్న కోడలు సుమన పిల్ల విలన్‌లా ఎదిగే ప్రయత్నం చేస్తుందేమోనని డౌట్‌గా ఉందిరా. ఇన్నాళ్లు ఎవర్ని ఏం చేయాలా అని మనం ఆలోచించేవాళ్లం. ఇప్పుడు సుమన ఆలోచిస్తుంది ఏమో అనిపిస్తుంది. నయనిపై తనకు తానుగా విషపు ప్రయోగాలు చేస్తుంది అనుకుంటా. 

వల్లభ: ఏం అంటున్నావ్ మమ్మీ సొంత అక్క ఒకే తల్లి కడుపున పుట్టిన తన అక్కకు అలా చేస్తుందా

తిలోత్తమ: నువ్వు, విక్రాంత్ నా కొడుకులే. అయినా విక్రాంత్ మన ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాడు. అలాగే నయని విషయంలో రిపీట్ అయింది. కాకపోతే విక్కీ మంచోడు అయ్యాడు. సుమన చెడ్డదానిగా మిగిలిపోతుంది. నయనికి తనకు ప్రమాదం జరిగితే తెలీదు అన్నవిషయం సుమనకు బాగా తెలుసు. నయని ఎలా కాలిపోవాలి అనుకుందో సుమన ఊహలకే తెలుసు. ఇక్కడే లోతుగా ఆలోచించాలి. నేను అఖండ దీపం వెలిగించాలి అని వెళ్తుంటే నయని అడ్డుకుంది. అంటే నా అంచనా ప్రకారం నాకు ఏదో ప్రమాదం జరగనుంది అన్న విషయం నయనికి కనిపించొచ్చు. దాని ప్రకారమే సుమనను రమ్మని చెప్పింది

వల్లభ: అలా అయితే సొంత చెల్లినే ఎందుకు ప్రమాదంలో పెడుతుంది నయని

తిలోత్తమ: నయని టెస్ట్ చేసిందిరా. పరీక్షలో పాసయ్యింది. సుమన చెంప మీద కొట్టి నువ్వు ఫెయిల్ అయినట్లు నాగయ్య చేసిందని వార్నింగ్ ఇచ్చింది. రక్త సంబంధం మధ్య చిన్న పొర ఏర్పడినా దాన్ని పెద్ద చీలికలా చేసి విడదీయాలి. చేస్తాను. 

సుమన తన పాపను హాల్‌లో ఆడిస్తుంటుంది. హాసిని వస్తే తనకు పాలు తీసుకురమ్మని చెప్తుంది. గాయత్రీకి కూడా పాలు పట్టమని నయని చెప్పిందని చెప్తుంది. ఇక గాయత్రీని సుమన దగ్గర పెట్టి హాసిని వెళ్తుంది. మరోవైపు తిలోత్తమ ఇంట్లోనే పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటుంది. ఇంతలో ఫోన్ వచ్చి తిలోత్తమ బయటకు వెళ్తుంది ఈలోపు హాసిని ఆ ప్యాక్‌కు పాలు అనుకొని పిల్లలకు పట్టడానికి తీసుకెళ్తుంది. మరోవైపు విక్రాంత్, విశాల్, నయనిలు ఆఫీసు గురించి మాట్లాడుకుంటారు. హాసిని ఆ ప్యాక్‌ను పాలు అనుకొని గ్లాస్‌లలో పోసి పిల్లలకు తాగించడానికి సిద్ధమవుతారు. ఇక ఎద్దులయ్య మీరు తాగించేవి పాలేనా అని అడుగుతారు. మరోవైపు ఏదో అనర్థం జరుగుతుంది అని స్వామీ నయని ఇంటికి వస్తుంటారు. 

గురువుగారు: (వస్తూ.. తనలో తాను)విశాలాక్షి అమ్మ ఒకరు చేసే తప్పిదానికి మరొకరి శిక్ష అనుభవించడం ఏమేరకు న్యాయం. ప్రాణాపాయం సంభవిస్తే ఎవరు బాధ్యులు. 

పావనామూర్తి: అక్కయ్య కనిపించడం లేదు ఏంటి

తిలోత్తమ: ఇక్కడే ఉన్నా మూర్తి వల్లభ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా.. ఎక్కడ పెట్టావ్ మూర్తి.. నేను చేసిన ఫేసియల్ క్రీమ్

పావనామూర్తి: ఇక్కడే ఉంది కదా అక్క అని పాలను చూపిస్తాడు. నువ్వు చేసింది ఇలాగే ఉంది కదా అంటాడు..  

ఇక తిలోత్తమ, పావనా మూర్తి బయటకు వచ్చి హాసిని, సుమనలను అడుగుతారు. ఇంతలో హాసిని తెచ్చిన గిన్నె చూసి షాక్ అవుతారు. అయితే ఇందులో ఉండేవా మీరు తాగించినవి అని పావనామూర్తి అడుగుతాడు. అవును అని వాళ్లు చెప్పడంతో మీరు తాగించినవి పాలు కావు అని చెప్తాడు. మరోవైపు పిల్లలు గట్టిగా ఏడుస్తారు. నయని, విశాల్, విక్రాంత్ వాళ్లు ఏమైందని అడగగా పావనా మూర్తి పిల్లలకు పాలు కాకుండా వేరేది పట్టారని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు గురువుగారు ఇంటికి వస్తారు. 

గురువుగారు: ఏం జరిగింది

తిలోత్తమ: సమయానికి వచ్చారు గురువుగారు. నేను సున్నిపిండి, బియ్యపుపిండి ఇలా ఇంట్లో ఉండేవాటితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటే ఈ తింగరి హాసిని పాలు అనుకొని పిల్లలకు తాగించేసింది. 

నయని: ఎంత పని చేశావ్ అక్కా

ఎద్దులయ్య: నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను ఏం తాగిస్తున్నారు అనీ

విక్రాంత్: అతను అడిగినప్పుడైనా చూడాలి కదా ఆమాత్రం చూసుకోలేరా

హాసిని: నన్ను కూడా అంటున్నావ్ కదా విక్రాంత్ 

విక్రాంత్: సుమనను కూడా అంటున్నాను వదిన చూసుకోవాలి కదా

విశాల్: పాలలా కనిపించడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు

గురువుగారు: పిండి కలిపిన నీరు కదా విశాలా గొంతులలో ఇరుక్కు పోయినట్లు ఉంది అందుకు పసిబిడ్డలు అవస్థ పడుతున్నారు. చిరుప్రాణాలు కదా అరగదు. నలుగుతాయి. అప్పుడు ఏదైనా జరగొచ్చు. 

సుమన: అయ్యో దేవుడా వస్తే గిస్తే పెద్దత్తయ్య పేరు పెట్టుకున్న ఈ గాయత్రీ పాపకు ఏదైనా గండం రావొచ్చని అనుకున్నాను. గండం కాస్తా నా కూతురుకి కూడా ఎక్కడ తగులు తుందా అనుకుంటూ భయపడ్డాను. ఇప్పుడు అనుకున్నట్లే నా కూతురికి కూడా ఆ పరిస్థితి వచ్చింది. నా బిడ్డను కూడా బలి తీసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు.

హాసిని: పొరపాటు జరిగింది చిట్టీ

సుమన: ఏంటి అక్కా పొరపాటు. ఇదే పరిస్థితి నీ కొడుకుకు పట్టించాల్సింది.

విశాల్: అమ్మా నువ్వైనా చూసుకోవాలి కదా కిచెన్‌లో ఎందుకు చేశావ్ వేరే ఎక్కడైనా చేయాల్సింది 

అందరూ ఆపండి అంటూ పావనా మూర్తి అంటారు. ముందు పిల్లల్ని ఎలా కాపాడాలో అది చూడండి అంటారు. అప్పుడు తిలోత్తమ చెప్పు నయని అంటుంది. నయని నేనేం చెప్పేది అత్తయ్య అంటుంది. బిడ్డలు ఏడ్పులు చూస్తుంటే నా గుండె కదిలిపోతుంది. కదిలిపోవాల్సింది నీ గుండె కాదు ఆ అమ్మవారు అని తిలోత్తమ అంటుంది. పండగ పూట పాలు తాగడానికి వచ్చిన విశాలాక్షి అమ్మను ఇప్పుడు రమ్మని చెప్పండి చూద్దాం. తిలోత్తమ నువ్వు ఎగతాళిగా మాట్లాడకు అని గురువుగారు అంటారు. అయితే తాను వెటకారం చేయడం లేదని పిల్లల్ని కాపాడాలని పిలుస్తున్నానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget