Trinayani Serial Today May 14th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపకి ప్రమాదం వస్తే ముందే ఎందుకు పసిగట్టలేకపోయానని ఫీల్ అయిన నయని.. విశాలాక్షి పరువు తీసే ప్లాన్లో తిలోత్తమ!
Trinayani Serial Today Episode : విశాలాక్షి, గాయత్రీ పాపకు ప్రమాదం జరిగితే తనకు ఎందుకు తెలీలేదని నయని విశాల్‌ని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode : విశాలాక్షి, గాయత్రీ పాప చుట్టూ మంట అంటుకుంటుంది. అందరూ కంగారు పడతారు. కానీ విశాలాక్షి తనకు, పాపకు ఏం కావడం లేదని ఆందోళన చెందొద్దని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
విశాల్: నిజంగా ఇదో వండర్. కేవలం భగవంతుడి దయాదాక్ష్యిణ్యాలు ఉంటే తప్ప ఇలా అవ్వదు.
విశాలాక్షి: చెప్పాను కదా నాన్న ఏం కాదు అని.. మంటలు రేగడానికి కారణం అయిన సుమనకు కూడా ఏం కాలేదు అంటే అందుకు కారణం తను కూడా ఓం నమఃశివాయ అని స్మరించుకుంది అని.
దురంధర: విశాలాక్షి నువ్వు మామూలు పిల్లవి కాదు మహాద్భుతానివి.
పావనా: చెప్పాను కదే సోదరి ఇప్పుడు నా కంటికి దేవతలా కనిపిస్తుంది.
విశాలాక్షి: చూశావా మంటల్లో గాయత్రీ ఎలా కూర్చొని ఉందో.
నయని: చూస్తున్నాం విశాలాక్షి. సాక్ష్యాత్తు ఆ విశాలాక్షి అమ్మవారే నా కూతుర్ని ఎత్తుకొని కూర్చొందనిపిస్తుంది. అందుకే నా కూతురికి ఏం కాలేదని అనిపిస్తుంది.
విశాలాక్షి: మరి వీరికేమనిపిస్తుంది.
వల్లభ: మమ్మీ నా వైపు చూసే అడుగుతుంది. నాకు భయం వేస్తుందమ్మ.
తిలోత్తమ: రేయ్ ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించకురా.
విక్రాంత్: అందరూ కలిసి ఓం నమఃశివాయ అనుకుందాం. అందరూ ఓం నమఃశివాయ అనగానే మంటలు ఆరిపోతాయి.
విశాలాక్షి: సుమన పూజ బాగా చేయ్ హారతి పళ్లెం మాత్రం ఈ సారి బాగా పట్టుకో.
తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి కోసం వస్తారు. జరిగింది చెప్తారు. అఖండ కంగారుగా మాట్లాడుతారు. అయితే వల్లభ జరిగిందంతా చెప్తారు. విశాలాక్షి దెయ్యం అని వల్లభ అంటే తిలోత్తమ దేవత అయినా అయింటుందని అంటుంది.
అఖండ: హారతి పళ్లెం పట్టుకున్నందుకే సుమనకు ఏం కాలేదు అన్న సత్యాన్ని గ్రహించాలి. భక్తి భావాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండాలి.
తిలోత్తమ: ఏమో స్వామి ఇంతకు ముందు ఇలాంటి గారడి చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. తనని ఏమనుకోవాలి.
అఖండ: మహా శక్తి అని భావించి రెండు చేతులు జోడించి సాగనంపండి.
వల్లభ: ఇలా అంటారేంటి స్వామి ఈయన.
తిలోత్తమ: ఆయన మూడ్ బాలేదు మనం ఏం చేయాలనుకున్నామో అది చేద్దాం.
మరోవైపు నయని గాయత్రీ పాపను రెడీ చేస్తూ తనని అదృష్ట వంతురాలివని పొగిడేస్తుంది. ఇక విశాల్ నయనితో విశాలాక్షిని జాగ్రత్తగా ఉండాలని చెప్పమంటాడు. దీంతో నయని విశాలాక్షి అమ్మవారిని నమ్ముకుందని తనని ఏ ఆపద ఏం చేయలేదని అంటుంది.
నయని: నాకు ఓ డౌట్ బాబు గారు. విశాలాక్షి, గాయత్రీ పాపలకు మంట అంటుకుంది అంటే ఆపద వచ్చినట్లే కదా మరి నాకు ఎందుకు ముందుగా తెలీలేదు. విశాలాక్షి అంటే గారడీ చేసిందనుకోవచ్చు. మరి గాయత్రీకి ఏమైనా అయినట్లు నాకు ఎందుకు తెలీలేదు. నాకు కానీ నేను జన్మనిచ్చిన గానవికి గానీ ఏమైనా జరుగుతుందంటే కనిపెట్టలేను సరే కానీ గాయత్రీకి ఏమైనా అయితే నేను కనిపెట్టాలి కదా.
విశాల్: అందంతా భ్రాంతి అయింటుంది. విశాలాక్షి మ్యాజిక్.
నయని: అది కాదు బాబు గారు దాని వెనక ఏదో రహస్యం ఉంది.
విశాల్: నేను కనిపెడతానులే..
ఇక సుమన విక్రాంత్‌తో తన అనుమానాలు వ్యక్తం చేస్తుంది. విశాలాక్షి, గాయత్రీ పాప ఇద్దరూ మనుషులేనా అని అడుగుతుంది. దీంతో విక్రాంత్ తిడతాడు. నువ్వే మనిషివి కాదు అని సుమనను అంటాడు. గాయత్రీ పెద్దమ్మ పేరు పవర్ వల్ల గాయత్రీకి ఏం కాలేదు అని అంటాడు విక్రాంత్.
ఇంతలో డమ్మక్క తీర్థం తీసుకొని వచ్చి అందరి మీద చల్లుతుంది. ఇక మంటలు చెలరేగడం వల్ల మంత్రించిన తీర్థం జల్లుతున్నానని అంటుంది. ఇక విశాలాక్షి వచ్చి పూజ చేస్తానని అందరకి చెప్తోంది డమ్మక్క. విశాలాక్షిని దేవత అంటూ పొగిడేస్తారు. విశాలాక్షిని అందరూ పొగడటం తిలోత్తమకు నచ్చదు అందుకే వెళ్లిపోతుంది. ఇక సుమన కూడా వెళ్లిపోతుంది. వల్లభ కూడా వెనకాలే వెళ్లిపోతాడు.
విశాలాక్షి స్నానం చేస్తున్న గది దగ్గరకు ముగ్గురు వస్తారు. విశాలాక్షి గది నుంచి బయటకు రాకుండా చేయాలని అంటుంది. స్నానం చేసి వచ్చిన విశాలాక్షికి బట్టలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'నాగ పంచమి' సీరియల్ : తోటికోడళ్ల కడుపు పోగొట్టడానికి చిత్ర కన్నింగ్ ప్లాన్.. పంచమిని తిట్టిన మోక్ష!