అన్వేషించండి

Trinayani Serial Today May 10th: 'త్రినయని' సీరియల్: బంగారు కొబ్బరి కాయ తీసుకొచ్చిన విశాలాక్షి.. నోరెళ్లబెట్టిన కుటుంబ సభ్యులు!

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి రహస్యాలు అన్నీ తిలోత్తమకు తెలుసని వాటిని తనకు చెప్తే కోట్లు సంపాదిస్తానని సుమన విక్రాంత్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode రమణమ్మ బతికే ఉందా అని తిలోత్తమ అంటుంది. వెంటనే విక్రాంత్ అందుకే కదా తనని ఏం చేయొద్దని రాసిందని అంటాడు. దీంతో తిలోత్తమ నోర్ముయ్‌ అని విక్రాంత్‌ని అంటుంది. ఇంతలో విశాల్ విక్రాంత్ రమణమ్మ ఏం చెప్పిందని అడుగుతాడు. 

విక్రాంత్: ఆవిడ మాట్లాడింది నయని వదినతో బ్రో.
నయని: ఆవిడే రమణమ్మ అని నాకు తెలీదు. సాధువుగా ఉంది కదా అని నా బాధని చెప్పుకున్నాను బాబుగారు. వాయు మరణం వెనుక రహస్యం తెలుసుకోవాలి అంటే పూల దండ పసుపు కుంకుమ ఇచ్చింది. 
సుమన: అది అత్తయ్యకు వేయించి పసుపు కుంకుమ అత్తి బాగానే ప్లాన్ చేశావు అక్క.
తిలోత్తమ: గుడ్ ఎవరికి వారు నా గురించి ఆరా తీయాలని చూస్తున్నారు అన్నమాట. విశాల్ నిన్ను కన్న తల్లి ఎక్కడ ఉందో తన గురించి ఆరా తీయకుండా నిన్ను పెంచి తల్లి మీద బాగానే ఫోకస్ చేశావు నాన్న.
విశాల్: నేనే ఏం చేయలేదు అమ్మ. నీ మీద నాకు ఇంకా కృతజ్ఞతాభావం ఉంది. 
హాసిని: అది లేకపోయి ఉంటే ఎప్పుడో అత్తయ్య మెడలో, ఫొటోకి దండ పడుండేది.
తిలోత్తమ: నేను చావను. అని గట్టిగా అరుస్తుంది.
నయని: తెలుసు.
తిలోత్తమ: ఒక్కొక్కరూ నా చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు అని నాకు అర్థమవుతుంది.
పావనా: అపార్థం చేసుకోకు అక్కయ్. రమణమ్మ సంగతి వదిలేయ్. వాయుని ఎందుకు చంపావో ముందు అది చెప్పు. 
తిలోత్తమ: వాయు ఒక రేసు గుర్రం. పరుగు పందాల్లో అది పాల్గొంటే లక్షలు వచ్చేవి. అప్పట్లోనే గాయత్రీ అక్క అపర కోటీశ్వరురాలు అవ్వడానికి అదీ ఒక కారణం అవ్వొచ్చని నా దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మి వాయు మీద పందెం కాశాను. ఓటమి ఎరగని వాయు ఆ రోజు ఓడిపోయింది. ఓడిపోవడం జరగదని గాయత్రీ అక్క ఆలోచనలో పడింది.
విశాల్: నువ్వు ఈ పందెం కాసినట్లు అమ్మకి తెలీదా.
తిలోత్తమ: నా పేరు రానివ్వలేదు. మీ నాన్న జగదీష్ గారి పేరు వాడాను. ఆయన సీరియస్ అయితే క్షమించమని కాళ్లు పట్టాను. వాయు ఆరోగ్యం బాలేదు అని విశాలాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన పూల దండకు విషాన్ని పూసి వాయి మెడలో వేశాను. పూల దండ తినే అలవాటు ఉండే వాయు ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి.
నయని: మూగ జీవి ప్రాణాలు తీసి ఆనెపాప్ని విశాలాక్షి అమ్మ దయ చూపలేదని నిందించారు. 
విశాల్: రమణమ్మ భర్త వీరన్నకు ఈ భర్తకు ఈ విషయం తెలుసనుకుంటా. ఎస్టేట్‌లో పూలు పూయలేదని ఏడ్చాడు. 
విక్రాంత్: ఆ తర్వాత వీరన్న కనిపించలేదు. రమణమ్మ ఇప్పుడు కనిపించింది.
నయని: అత్తయ్య వారి జాడ తెలుసా.
తిలోత్తమ: తెలీదు. 

సుమన: మీరు తప్పు చేశారండి ఆ లెటర్ మీరు రాయకుండా నాతో రాయించి ఉంటే చాలా విషయాలు బయట పడేవి.
విక్రాంత్: ఆ తర్వాత నువ్వు అమ్మని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించేదానివి అంతే కదా. 
సుమన: బెదిరించడం అంత ఈజీ కాదు. వాయు అనే గుర్రం 20 ఏళ్లు క్రితం లక్షలు సంపాదించి పెట్టిందంట కదా. గాయత్రీ అత్తయ్య విషయంలో అది కోట్లు రాబట్టి ఉంటుందండి.
విక్రాంత్: నువ్వు కరెక్ట్‌గా గెస్ చేశావు కానీ మా అమ్మ పప్పులో కాలు వేసింది.
సుమన: అత్తయ్య బాగానే ప్రయత్నించారండి ఇప్పుడు అత్తయ్య ప్రయత్నించిన దారులు మీరు నాకు చెప్తే చాలు. 
విక్రాంత్: అర్థమైంది నేను దెబ్బలు తిన్నా పర్లేదు కానీ నీకు జాక్ పాకెట్ కావాలి అంతే కదా. 
సుమన:  కన్న కొడుకు కాబట్టి మిమల్ని ఏం చేయదు అత్తయ్య. మీరు గాయత్రీ అత్తయ్యకు తనకు సంబంధించిన ఆస్తి పాస్తులకు బిజినెస్‌లకు  అన్నింటికి మీ అమ్మే సాక్ష్యంగా ఉంది. ఆవిడ ఏం చేసిందో మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. అవేంటో నాకు చెప్తే మిగతా కథ నేను చెప్తాను. 
విక్రాంత్: నిజంగా..
సుమన: నన్ను నమ్మారా..
విక్రాంత్: నేను బలి అయిపోతే..
సుమన: అబ్బా బొట్టు లేకుండా నేను ఉండను అని మీకు తెలుసు కదా. 
విక్రాంత్: సరే నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. నాకు నమ్మకం కలగగానే.. నిన్ను ఇందులో భాగం చేస్తా.. (నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలుసే అందుకే నీ దారిలో నిన్ను పాతాళానికి తీసుకెళ్తా)

పావనామూర్తి గాయత్రీ పాపని ఆడిస్తుంటాడు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. ఇంతలో విశాలాక్షి చేతిలో ఓ సంచి వేళాడదీసుకొని అక్కడికి వస్తుంది. తిలోత్తమ, సుమన, వల్లభలు ఆ సంచిని చూసి అన్ని గుడులు తిరిగి ప్రసాదం తీసుకొని వచ్చిందని వెటకారం చేస్తారు. 

ఇక విశాలాక్షి అది కొబ్బరి కాయ అని చెప్తుంది. ముందు ఆశపరులకు అవకాశం ఇస్తాను అని మీకు కావాలా అని ఆ ముగ్గురిని అడుగుతుంది. తిలోత్తమ కొబ్బరి చిప్ప అవసరం లేదు అనేస్తుంది. మళ్లీ విశాలాక్షి రెట్టించి అడుగుతుంది. బ్యాగ్ అక్కడ పెడతాను అవసరం అయిన వాళ్లు తీసుకోండి అని అంటుంది. 

విశాల్ ఎందుకు కింద పెట్టావ్ అని అడితే.. అవసరం అయిన వాళ్లు కాళ్లు తల వంచి తీసుకోవాలి అని అంటుంది. ఇక సుమన వల్లభ వాళ్లు విశాలాక్షి కాళ్లు దగ్గర తల వంచాలి అని అలా చేసిందని అంటారు. తిలోత్తమ అది దిష్టి కాయ అయింటుంది అందుకే కింద పెట్టిందని అంటుంది.

ఇక పావనా మూర్తి తాను తీసుకుంటానని వెళ్తాడు. అయితే కొబ్బరికాయ ఉన్న ఆ సంచి విశాలాక్షి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తుంది. పావనా పట్టుకోలేకపోతాడు. అందరూ పట్టుకోలేమని చేతులెత్తేస్తారు. 

ఇంతలో గాయత్రీ పాప సంచి పట్టుకుంటుంది. ఆశ పడకూడదు అర్హత సంపాదించుకోవాలి ముందు అని అర్థమయ్యేలా గాయత్రీ చేసిందని విశాలాక్షి అంటుంది. ఇక నయని ఆ బ్యాగ్ తీసుకొని కొబ్బరి కాయను బయటకు తీస్తుంది. అందులో బంగారం కొబ్బరి కాయ చూసి అందరూ నోరెళ్లబెడతారు. శివుడే తనకు ఇచ్చాడని విశాలాక్షి చెప్తే సుమన వెటకారంగా నవ్వుతుంది. దేవుడి దిగి వచ్చి ఇచ్చాడని చెప్పొద్దని తిలోత్తమ వాళ్లు అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ ప్రోమో: గాయత్రీ పాప చేతిలో బంగారు కొబ్బరికాయ.. బిత్తరపోయిన విశాల్, నయని!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 4th:విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
నువ్వులేక నేను లేను: విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
Podarillu Serial Today August 4th:మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?
Gundeninda Gudigantalu August 4th Episode:నిర్దోషిత్వం నిరూపించుకున్న బాలు...బంగారం దొంగలను పట్టుకున్న మీనా
గుండెనిండా గుడిగంటలు: నిర్దోషిత్వం నిరూపించుకున్న బాలు...బంగారం దొంగలను పట్టుకున్న మీనా

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Embed widget