అన్వేషించండి

Trinayani Serial Today March 27th: గాయత్రీ అదృశ్యం వెనుక ఆ ముగ్గురి హస్తం.. నిరూపిస్తానన్న నయని!

Trinayani Serial Today Episode గాయత్రీ పాపను అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించాలి అనుకున్న సుమనను ఉలూచి సాయంతో పెద్దబొట్టమ్మ అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode: గాయత్రీ పాప మాయం కావడంతో నయని చాలా కంగారు పడుతుంది. విశాల్, హాసినిలు గుసగుసలాడుకోవడంతో వాళ్లకి తన బాధ చెప్పుకుంటుంది. దీంతో విశాల్ కంగారు పడటానికి పాప జాతరలో తప్పిపోలేదు. ఇంట్లోనే మాయం అయిపోయింది అంటాడు. 

నయని: మాయం అయిపోయింది అని ఎవరి మానానా వాళ్లు ఉంటే సరిపోతుందా.
కళ్లెదురుగా ఉన్న పిల్ల సడెన్‌గా మాయం అయిపోతే మీరు బయట వెతికితే ఏం లాభం.
విశాల్: ఎక్కడా కనిపించడం లేదు అని నువ్వే అంటున్నావ్. మళ్లీ వెతకడం లేదు అని నువ్వే అంటున్నావ్. 
నయని: మీరేం చేస్తారో నాకు తెలీదు బాబుగారు గాయత్రీ పాప జాడ నాకు తెలియాలి.
హాసిని: చెల్లి నువ్వు కన్న గాయత్రీ అత్తయ్య జాడే ఇంకా తెలుసుకోలేకపోయాం. ఇందాక మిస్ అయిన గాయత్రీ పాప ఆచూకి వెంటనే ఎలా తెలుస్తుంది.
నయని: తెలియాలి. మనం కాకపోతే పోలీసులకు అయినా చెప్తే వాళ్లే 24 గంటల్లో చెప్పి తీరాలి.

గాయత్రీ పాప బాల్యానీలో ఓ చోట ఉంటుంది. రాత్రి డమ్మక్క అక్కడికి బొమ్మలు తీసుకొని వచ్చి ఆడుకో పాప అని చెప్తుంది. ఆ మాటలు సుమన వింటుంది. గాయత్రీ పాపను సుమన చూసేస్తుంది. ఇక డమ్మక్క గాయత్రీ పాపతో నిన్ను మాయం చేసింది నేను అనడం సుమన వినేసి డమ్ము మ్యాజిక్ చేశావా అనుకుంటుంది. 

డమ్మక్క: పాప నిన్ను మాయం చేసి ఇలా అందర్ని కంగారు పెట్టడం వెనుక కారణం ఉందిలే. ఉండు తినడానికి నీకు ఏమైనా తెస్తా..
సుమన: ఏయ్ నిన్నే అమ్మానాన్న లేకుండా ఇప్పటివరకు బాగానే ఉన్నావ్. ఎందుకు ఉండవులే. దత్తత తీసుకున్న వాళ్లని నువ్వు తేలికగా తీసుకుంటావ్. నిన్ను కన్న వాళ్లు నువ్వు పుట్టగానే స్వర్గానికి వెళ్లిపోయారు అంట కదా. పైగా కోట్లు కలిసి వచ్చిన శ్రీమంతురాలివి నీకు ఎవరితో పని ఏంటిలే. నిన్ను మాయం చేసినట్లు డమ్మక్క ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు నిజంగానే నేను నిన్ను మాయం చేస్తే డమ్మక్క చెప్పినా లాభం లేదు. నిన్ను ఇప్పుడు ఎత్తుకెళ్లి వచ్చినప్పుడు కోట్ల మూటను ఎత్తుకొని వస్తా పద..  అని సుమన పాపని తీసుకొని వెళ్లిపోతుంది.

డమ్మక్క పాలు తీసుకొని వచ్చి పాప కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. తన దివ్య దృష్టితో సుమన తీసుకెళ్లడం చూస్తుంది. సుమన పాపను ఓ చోటుకు తీసుకొని వచ్చి కూర్చొపెట్టి వేరే సిమ్ నుంచి నయనికి కాల్ చేసి డబ్బు అడుగుతాను అనుకుంటుంది. ఇంతలో పెద్ద బొట్టమ్మ అక్కడికి వస్తుంది.

సుమన: నువ్వా.. వస్తే వచ్చావు కానీ పక్కకెళ్లు..
పెద్దబొట్టమ్మ: గాయత్రీ పాపను మాయం చేశానన్న నింద నా మీద వేసుకొని నయని వాళ్లకి నిజం చెప్పకపోతే ఎలా..
సుమన: ఏ నిజం..
పెద్దబొట్టమ్మ: గాయత్రీ పాప క్షేమంగా ఉంది అని.
సుమన: నేను క్షేమంగానే తీసుకొని వచ్చాను. 
పెద్దబొట్టమ్మ: ఎలా ఎత్తుకొని వచ్చావో అలాగే తీసుకెళ్లి ఇంట్లో పెడితే మంచిది. పసిబిడ్డను అడ్డుపెట్టుకొని సంపాదించాలి అనుకోవడానికి సిగ్గులేదా.. 
సుమన: నీకు సిగ్గు ఉండాలి. వయసులో పెద్ద దానివి అయినా నా బిడ్డను ఎత్తుకొని వెళ్లిపోవడానికి వేషాలు వేసుకోవడానికి వచ్చావు కదా..
పెద్దబొట్టమ్మ: పసిపిల్లలతో ఆడుకోవడానికి వచ్చాను నేను. నీలా ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి కాదు. దేనికైనా రాసిపెట్టుండాలి. తప్పుడు దారి ఎంచుకోకు సుమన. పిల్లని ఇంటి దగ్గర పెట్టు. 

సుమన ఎంతకీ మాట వినకపోతే పెద్దబొట్టమ్మ పాము రూపంలో ఉన్న ఉలూచిని సుమనకు చూపిస్తుంది. గాయత్రీని విడిచిపెట్టకపోతే ఉలూచిని నాగలోకానికి తీసుకెళ్తాను అని జన్మలో నీకు కనిపించదు అని బెదిరిస్తుంది. దీంతో సుమన గాయత్రీని విడిచిపెట్టేస్తుంది. ఇక పెద్దబొట్టమ్మ పాపను తీసుకొని ఇంటికి వెళ్తుంది. 

ఇంట్లో అందరూ దిగులుగా పాప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ పెద్దబొట్టమ్మనే పాపని తీసుకెళ్లింది అని మాట్లాడుకుంటారు. ఇక విశాల్ డమ్మక్కను తన దివ్యదృష్టితో పాప ఆచూకి అడుగుతాడు. మరోవైపు సుమన ఉలూచి పామును తీసుకొని ఇంటికి వస్తుంది. సుమన ఎక్కడికి వెళ్లావని విక్రాంత్ అడిగితే గాయత్రీ పాపను వెతకడానికి వెళ్లానని చెప్తుంది. సుమన పాపను చూశానని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు.

విశాల్: సుమన గాయత్రీని చూశావా..
సుమన: అవును బావగారు.
నయని: చెల్లి పాప ఎక్కడుంది.
విక్రాంత్: చూసుంటే తీసుకురావాలి కానీ వట్టి చేతులతో వచ్చింది అంటే తన మాటలు నమ్మకండి వదినా.  
సుమన: నాబిడ్డని నేను తీసుకొని వచ్చాను. నీ కూతుర్ని ఎత్తుకుంటే నువ్వు ఊరుకోవు కదా అక్క అందుకే తీసుకొని రాలేదు.
పెద్దబొట్టమ్మ: ఎత్తుకుంటే ఊరుకుంటారు. ఎత్తుకొనిపోతే ఏం చేస్తారు సుమన. అంటూ పాపని తీసుకొని వస్తుంది. 
విశాల్: గాయత్రీని ఎవరు ఎత్తుకెళ్లారు.
సుమన: ఇంకెవరు బావగారు ఈ పెద్ద బొట్టమ్మే.  
పెద్దబొట్టమ్మ: నోర్ముయ్.. పసి బిడ్డను ఎత్తుకొచ్చి చీకట్లో ఏం చేస్తున్నావ్  అంటే నా మీదే కోప్పడతావా. 
సుమన: నోరు మూసుకుంటావా లేదా ఆ పిల్లని నేను ఎందుకు ఎత్తుకొస్తాను.
విక్రాంత్: గాయత్రీ పాపను సుమన కిడ్నాప్ చేయాలని చూసింది. అదే కదా బ్రో పెద్దావిడ చెప్తుంది.
పావనా: మీ అక్క కూతుర్ని ఎత్తుకెళ్తే నీకు ఏమొస్తుంది అమ్మ.
దురంధర: వందల కోట్లు డిమాండ్ చేయాలని అనుకుందేమో.
సుమన: ఆపుతారా మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను. ఆ పిల్ల ఏమైనా పుట్టుకతోనే అపర కోటీశ్వరురాలు. బురిడీ కొట్టించిన ఆమెను అనుమానించిన వాళ్లు ఇప్పుడు ఆమె పాపని తెచ్చి నామీద నింద వేస్తే నమ్మేస్తున్నారా..
నయని: ఊరికే ఎవరూ అనరు కదా చెల్లి.
సుమన: నా మీద అక్కసుతో అంటుందేమో..
పావనా: పొద్దున్న ఏమో నువ్వు కొంగు కప్పి ఉలూచిని తీసుకెళ్తున్నా అన్నావ్. డమ్మక్క ఏమో అది నేనే అంది. ఇప్పుడు పెద్ద బొట్టమ్మ గాయత్రీ పాపని తీసుకొచ్చింది. 
విశాల్: మీ ముగ్గురి మధ్య ఏదో నాటకం జరిగింది అని అర్థం. 
సుమన: అయ్యో బావగారు మీరు కూడా అలా అంటారేంటి. 
తిలోత్తమ: డమ్మక్క నువ్వు కిమ్మనకుండా ఉన్నావేంటి.
డమ్మక్క: నేను ఒకటి తలిస్తే విశాలాక్షి అమ్మవారు ఇంకొకటి అనుకున్నారు. దురాశ దుఃఖానికి చేటు అని నిరూపిద్దామంటే నేను ఇరుక్కుంటాను అనుకోలేదు. 
పెద్దబొట్టమ్మ: బయట జరిగిన నిజం ఏంటో నేను చెప్తా. చీకటిలో గాయత్రీ పాపని ఎత్తుకొని వచ్చిన సుమనను నేను నిలదీశాను. నన్ను బెదిరిస్తే నాకు సాయంగా వచ్చింది ఉలూచి పాప. ఉలూచిని విడిచిపెడితే తప్ప గాయత్రీని వదలను అని సుమన మొండికేయడంతో ఉలూచిని తనకిచ్చి గాయత్రీని తీసుకొచ్చా..

సుమన మాట మార్చేస్తుంది. పెద్దబొట్టమ్మ మొత్తం చేసినట్లు నిందిస్తుంది సుమన. పెద్దబొట్టమ్మను తిడుతుంది. ఇక విక్రాంత్ గాయత్రీ పాపను  ఎత్తుకెళ్లిన వాళ్లని శిక్షించాలి అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం మార్చి 26th: అనుకోని రీతిలో కన్నతల్లిని చేరిన దీప - అదిరిపోయిన కార్తీక్, వంటలక్కల తొలి పరిచయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
MLA Madhavi Reddy: 'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Royal Enfield Bear 650: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
IND vs AUS Test Series: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP DesamUsha Chilukuri vs Kamala Harris |  Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP DesamUsha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
MLA Madhavi Reddy: 'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Royal Enfield Bear 650: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
IND vs AUS Test Series: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ ఓటమిపై జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Second Hand Car Buying Guide: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!
సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!
Vizag News: విశాఖ వాసి టాలెంట్- చిరుధాన్యాలతో డొనాల్డ్ ట్రంప్ చిత్రపటం
విశాఖ వాసి టాలెంట్- చిరుధాన్యాలతో డొనాల్డ్ ట్రంప్ చిత్రపటం
Embed widget