అన్వేషించండి

Trinayani Serial Today March 22nd: 'త్రినయని' సీరియల్: వామ్మో తిలోత్తమ ఇంకా ఎన్ని కుట్రలు చేస్తావ్ తల్లీ, మళ్లీ అదే పని ఛీఛీ!

Trinayani Serial Today Episode గాయత్రీ పాపకు ఇవ్వనున్న పాలలో తిలోత్తమ విషం కలపడం నాగయ్య పాము అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode బియ్యం పల్లెంలో నాగయ్య పాము ఉండటంలో అందరూ షాక్ అవుతారు. హాసిని పల్లెన్ని కిందకు విసిరేస్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అని విశాల్ నాగయ్య పామును అడుగుతాడు. ఇక పల్లెంలో బియ్యం వేసినప్పుడు పాము కనిపించలేదా మీకు అని లలితాదేవి ప్రశ్నిస్తుంది.

ఎద్దులయ్య: బియ్యం పోసిన మాత ఎవరు మాతా. 
డమ్మక్క: తిలోత్తమ అమ్మగారే కదా.
తిలోత్తమ: అప్పుడు ఏం పాము లేదు. 
నయని: నాగయ్య అమ్మగారి త్యాగానికి అర్థం ఉండేలా నువ్వే చెప్పాలి. బియ్యం కింద పడినందుకు క్షమాపణలు చెప్పలేవు కానీ.. జరిగింది మంచిదే అని నిరూపించి ఇక్కడి నుంచి వెళ్లు. 
సుమన: పాము ఎలా నిరూపిస్తుంది అక్క. అని సుమన అడిగితే పాము కింద పడిన బియ్యం మీద గాయత్రీ దేవి అని రాస్తుంది. అది విశాల్ చూస్తాడు.
విశాల్: అమ్మ పేరు గాయత్రీ దేవి అని కనిపిస్తుంది చూశారా.. అందరూ మహా అద్భుతం అని నాగయ్యను పొగుడుతారు.
నయని: అమ్మగారు గాయత్రీ అమ్మగారి పేరును తన కోడలు అయిన గాయత్రీకి నాగయ్య మామయ్యనే పెట్టాడు చూశారా..
లలితాదేవి: సంబంధబాంధవ్యాలు అంత గొప్పవి నయని. 

నయని: బాబు గారు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి.. మారణాయుధాలు, మర్డర్‌ ప్లాన్‌లు జరుగుతున్న ఈ ఇంట్లో సరదాలు సంబరాలు ఉంటాయా బాబుగారు.
విశాల్: అదేంటి నయని అలా మాట్లాడుతున్నావ్. నిన్ను ఎవరో మాటలతో హర్ట్ చేసినట్లు ఉన్నారు. 
నయని: మాట్లాడితే పర్లేదు సమాధానం చెప్పొచ్చు కానీ కుట్రలు కుతంత్రాలు చేస్తేనే కష్టం.
విశాల్: నయని ఏదైనా ప్రాబ్లమ్ అయిందా.
నయని: తన కొంగుకు కట్టిన వేరు ముక్కని విశాల్‌కి చూపిస్తుంది. విశాల్ వాసన చూడటానికి ట్రై చేస్తే.. వాసన చూడొద్దు అని స్ఫృహ కోల్పోతారు అని నయని అంటుంది. 
విశాల్: దీన్ని ఎవరి మీద ప్రయోగించారు.
నయని: మనుషుల మీద అయితే వాళ్లు కోలుకున్నాక తిరిగి దాడి చేస్తారు. మాట్లాడలేని నాగయ్య మీద దీని ప్రభావం పడేలా చేసి పళ్లెంలో స్ఫృహ తప్పి పడిపోవడంతో తన మీద బియ్యం పోశారు. ఈ పని చేసింది ఎవరో మనకు తెలుసు బాబుగారు. ఏ సంబంధం లేని గాయత్రీ పాపను దత్తత తీసుకున్న తర్వాత పాపకు ఇంత ఆస్తి కలిసొస్తుంది అని అసూయ, ద్వేషాలతో నామకరణం అడ్డుకోవాలి అని చూశారు. 

మరోవైపు వల్లభ కాలీ పేపర్‌లో తన వేలి ముద్రలు వేస్తాడు. ఇక తిలోత్తమ వచ్చి నువ్వేంటిరా ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. వల్లభ తన తెలివి తక్కువ సమాధానాలు ఇస్తాడు. ఇక వాళ్లు దర్జాగా బతకాలి అంటే చాలా ఆస్తి కావాలి అని అందుకు చాలా ఆస్తి ఉన్న వారిని ఈ భూమ్మీద లేకుండా చేద్దామని అంటుంది. ఇక లలితాదేవి అడ్డు తొలగించుకుందామని తిలోత్తమ అంటుంది. వల్లభ భయపడిపోతాడు.

వల్లభ: వాళ్ల చెల్లిని చంపినందుకే ఇనాళ్లు అయినా నిన్ను విడిచి పెట్టకుండా ప్రతీకార ప్రయత్నం చేస్తుంది కదా గాయత్రీ పెద్దమ్మ. పెద్ద పెద్దమ్మని కూడా లేపేస్తే ఇక మనకు పుట్టగతులు ఉండవు మమ్మీ.
తిలోత్తమ: కంగారు పడకురా..
వల్లభ: అయినా ఇంక ఆమెకు ఆస్తి ఎక్కడుంది అంతా ఆ పిల్ల పేరుమీదే ఉంది కదా.
తిలోత్తమ: ఇక్కడో లాజిక్ ఉందిరా ఆస్తి అంతా గాయత్రీ అక్క పేరున రాసింది కానీ గాయత్రీ పాప పేరుమీద కాదు. ఆవిడ రాదు. ఈవిడ ఉండదు. పైకి పంపిస్తే సంతకాలు పెట్టకుండా వేలు ముద్రలు వేసిన ఆ వందల కోట్ల ఆస్తిని ఎలా మన వశం చేసుకోవాలో నాకు తెలుసు.
వల్లభ: కానీ జాగ్రత్త మమ్మీ లలిత పెద్దమ్మ ఎంత తెలివైనదో తెలుసుకదా. 
తిలోత్తమ: తెలివిని మోసంతో ముంచేయొచ్చు. 

హాల్‌లో పావనా, డమ్మక్క, ఎద్దులయ్యలు గాయత్రీ పాపని ఆడిపిస్తుంటారు. ఇక లలితాదేవి అక్కడికి వస్తుంది. సుమన తన నోటికి పని చెప్తుంది. 

సుమన: పెద్దత్తయ్య గారికి పిల్లలు లేరు కదా అలాంటప్పుడు ఆస్తి అంతా ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్న మా అక్క వాళ్లకే ఎందుకు రాశారు.
హాసిని: ఎవరికైనా రాస్తారు నీకెందుకు చిట్టీ. 
లలితాదేవి: నేను ఆస్తిని నయనికో విశాల్‌కో రాసి ఇవ్వలేదు. మరోవైపు దురంధర టీ, పాలు పట్టుకొని వస్తుంది. నా తోడబుట్టిన చెల్లి నయని, విశాల్‌ల కూతురుగా పుట్టినా సరే మా అక్కాచెల్లెల ఇద్దరి ఆస్తి తనకే చెల్లుతుంది అని మనస్ఫూర్తిగా రాశాను. 
విక్రాంత్: ఇంకా ఏం డౌట్లు లేవుగా..
విశాల్: సైలెంట్ అయింది అంటే అర్థం అదే.

ఇక నయని, హాసినిలు లలితా దేవికి చీరా సారె పెడతారు. ఇంతలో నాగయ్య పాము దురంధరకు ఎదురుగా వచ్చి నిలబడుతుంది. దురంధర భయపడుతుంది. నయనికి చెప్తుంది. 

నయని: నాగయ్య పిన్ని రాకుండా ఎందుకు అలా అడ్డుగా నిల్చొన్నావ్ తప్పుకో.
దురంధర: తప్పుకో నాగరాజా. నీ ముద్దుల మేనకోడలు గాయత్రీకి పాలు, మా పెద్ద వదినకు కాఫీ తీసుకొచ్చాను. 
తిలోత్తమ: లలితక్కకి పిల్లలు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు విశాల్, విక్రాంత్ లకు తనే ఆడించేది.
లలితాదేవి: నీకు అన్ని విషయాలు బాగానే గుర్తొన్నాయి తిలోత్తమ. 
తిలోత్తమ: అలా ఎలా మర్చిపోతాను అక్క.
వల్లభ: ఇప్పుడు గాయత్రీ పాపకు పెద్దమ్మే పాలు తాగించి కాఫీ తాగి సెలవు తీసుకుంటుంది.
నయని: నాగయ్య పక్కకు వెళ్లు. ఎవరూ ఏం చేయనప్పుడు ఇలా హడల్ ఎత్తించకు అని నీకు చెప్పాను కదా. 
లలితాదేవి: నాగయ్య వెళ్లడు. ధురందర ఆ పాలు తీసుకొచ్చినందుకు ఇక్కడి నుంచి కదలడు.
వల్లభ: మమ్మీ అందులో విషం ఉంది అని పెద్దమ్మకు తెలుస్తుందా..
విశాల్: పెద్దమ్మ అత్తయ్య గాయత్రీ పాప కోసం పాలు తీసుకొస్తే నాగయ్య అడ్డుకోవడం ఏంటి.
నయని: ఆ పాలు బాలేవేమో బాబుగారు.
డమ్మక్క: కలిసిపోనిది కలిసిందేమో.. కలవరానిది కలిపారు ఏమో అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ప్రేమి విశ్వనాథ్: వంటలక్కకు నిజంగా వంట వచ్చా? డాక్టర్ బాబుపై ప్రేమి విశ్వనాథ్ సీరియస్ - ఇది ఊహించలేదు అక్కో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
India vs New Zealand ODI : ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
Embed widget