అన్వేషించండి

Karthika Deepam 2 Preview: వంటలక్కకు నిజంగా వంట వచ్చా? డాక్టర్ బాబుపై ప్రేమి విశ్వనాథ్ సీరియస్ - ఇది ఊహించలేదు అక్కో!

Karthika Deepam 2: ‘కార్తీక దీపం’ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో ఏడాది తర్వాత దీనికి సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన స్పెషల్ ప్రివ్యూలను ఏర్పాటు చేశారు.

Karthika Deepam 2 Preview Event: ఈరోజుల్లో సీరియల్స్ ప్రమోషన్స్ కూడా సినిమా ప్రమోషన్స్ రేంజ్‌లో ఉంటున్నాయి. అంతే కాకుండా సినిమాలలాగానే సీరియల్స్‌కు కూడా సీక్వెల్స్ ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి ‘కార్తీక దీపం’ సీక్వెల్. ప్రస్తుతం బుల్లితెరపై ‘కార్తీక దీపం 2’ గురించే చర్చలు జరుగుతుండగా.. తాజాగా టీమ్ అంతా కలిసి ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ విలేఖరులే అడిగిన ప్రశ్నలకు మేకర్స్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అసలు ‘కార్తీక దీపం 2’ ఎలా ఉండబోతుందా హింట్ ఇచ్చేశారు. ఇక కార్తిక్, వంటలక్కగా ఫేమస్ అయిన నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్.. విలేఖరుల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు.

ఇప్పుడైనా నిజం చెప్పండి..

‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా వంటలక్కగా ఫేమస్ అయ్యారు ప్రేమి విశ్వనాథ్. అయితే నిజ జీవితంలో ఆమెకు వంటలు వచ్చా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆమె వంటను కార్తిక్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా అని కూడా అడిగారు. దానికి నిరుపమ్ ఫన్నీ సమాధానమిచ్చాడు. ‘‘ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం వంటలక్క భోజనం తినకపోవడమే’’ అని చెప్పగానే అందరూ నవ్వుకున్నారు. కానీ ప్రేమి మాత్రం ‘‘నిజం చెప్పమని చెప్పండి’’ అని సీరియస్‌గా అడిగారు. ‘‘కార్తీక దీపం సీరియల్ మొదలయినప్పటి నుంచి అందులో నేను తప్పు చేయలేదు అని అబద్ధాలే చెప్తున్నారు. ఇప్పుడైనా నిజం చెప్పండి’’ అని ఆమె కూడా నవ్వేశారు.

టీఆర్‌పీ భయం ఉందా.?

ఇక తనకు వంట వచ్చా లేదా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు ప్రేమి విశ్వనాథ్. ‘‘నేను కార్తీక దీపం లొకేషన్‌లో కూడా వంటలు చేశాను. నేను చేసిన వంటలు తిన్నారు కూడా. లొకేషన్‌లో గ్యాప్‌లో నేను వంటలు చేస్తాను. చికెన్ చేశాను చాలాసార్లు’’ అని క్లారిటీ ఇచ్చారు. కార్తిక్‌కు, వంటలక్కకు గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రేక్షకులంతా తనను చాలా తిట్టుకున్నారని బయటపెట్టారు దర్శకుడు. ఇక మలయాళంలో ‘కరుత ముత్తు’ అనే సీరియల్‌ను తెలుగులో ‘కార్తీక దీపం’గా రీమేక్ చేశారు. అయితే ముందు ఆ సీరియల్‌కు పాపులారిటీ బాగానే ఉన్నా.. మెల్లగా టీఆర్‌పీ తగ్గడం వల్ల దానిని ఆపేయాల్సి వచ్చింది. తెలుగులో కూడా అలాంటివి జరుగుతాయని భయంగా ఉందా అని డైరెక్టర్‌కు ప్రశ్న ఎదురయ్యింది.

హిమ లేదు..

‘‘సీరియల్‌కు సీజన్ 2 తీయడానికి మాకు కూడా లోపల భయం ఉంటుంది. కానీ ఆ బలమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. ఎమోషన్స్ పండించడంలో నిరుపమ్, ప్రేమి దిట్ట కాబట్టి టీఆర్‌పీ తగ్గదని మాకు నమ్మకం ఉంది’’ అని సమాధానమిచ్చారు దర్శకుడు. ఇక ‘కార్తీక దీపం 2’కు సంబంధించిన పలు ప్రోమోలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రౌడీ బేబీ అంటూ ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. మొదటి భాగంలో కూడా హిమ, శౌర్య అనే రెండు చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఉండేవి. శౌర్యనే రౌడీ బేబీ అని పిలిచేవారు. సీక్వెల్‌లో రౌడీ బేబి క్యారెక్టర్ రీక్రియేట్ అయ్యింది. మరి హిమ క్యారెక్టర్ కూడా రీక్రియేట్ అవుతుందా అనే ప్రశ్నకు లేదు అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. 

Also Read: 'కార్తీక దీపం 2'లో అదే దీప, కార్తీక్‌.. అవే ఎమోషన్స్ చూస్తారు - కానీ ఇది కొత్త కథ

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
Nindu Manasulu Serial Today November 17th: నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
Godavari Serial Today November 17th: 'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 17:భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ
నువ్వులేక నేను లేను: భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget