Trinayani Serial Today March 1st: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లేందుకు తిలోత్తమకు సాయం చేస్తానన్న సుమన.. విశాల్ అడ్డుకుంటాడా!
Trinayani Serial Today Episode గాయత్రీ పాపని అఖండ స్వామి దగ్గరకు తీసుకెళ్లేందుకు తిలోత్తమకు సాయం చేస్తానని సుమన చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode పాలు తాగనని తిలోత్తమ అంటుంది. ఒక గిన్నెలో వద్దు అన్నదని ఇంకో గిన్నెలో పాలు పోసి ఇస్తుంది హాసిని. దీంతో తిలోత్తమ ఈ పాలు కూడా తాగను జ్యూస్ తాగాలి అనిపిస్తుంది అని అంటుంది. ఇంతలో వల్లభ ఆ గ్లాస్ అందుకొని నేను తాగుస్తే అని పాలు తాగేస్తాడు.
తిలోత్తమ: అబ్బా ఈ పాలు తాగిన వెంటనే వీడికి మత్తు వచ్చేస్తుంది. అప్పుడు అందరికీ అనుమానం వచ్చేస్తుంది.
విశాల్: అమ్మా తాగాల్సిన పాలు అన్నయ్య తాగేశాడు.
నయని: పర్లేదులేరా ఇంకో గిన్నేలో ఉన్నాయి కదా..
తిలోత్తమ: ఏం అక్కర్లేదు. నువ్వు రారా అని వల్లభని తీసుకెళ్తుండగా వల్లభ మైకంతో పడిపోతాడు. అందరూ కంగారు పడతారు.
సుమన: పాలు తాగాక కళ్లు తిరగడం ఏంటి..
విశాల్: ఇందాక అమ్మ ఇప్పుడు అన్నయ్య ఎందుకు ఇలా అయింది.
హాసిని: డమ్మక్క చిటికెను వేలు పట్టుకొని లాగితే లేస్తారా..
డమ్మక్క: లాభం లేదు గంట ఆగి లేస్తాడు. తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టండి.
నయని: పాలు పారబోయ్ అక్క ఎవరికీ తాగించొద్దు. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య మీకు.. మత్తు దిగింది కానీ మదం దిగలేదు అనుకుంటా..
తిలోత్తమ: నయని ఏం మాట్లాడుతున్నావ్.
నయని: మీరు చేసిన పనులే మిమల్ని ఏం స్థాయిలో ఉంచాలో నిర్ణయిస్తాయి. చిన్నపిల్లలు తాగే పాలలో మత్తు మందు కలపాలి అన్న ఆలోచిన వచ్చింది అంటే..
తిలోత్తమ: ఏయ్ నేను కలిపానా నీకు చెప్పానా నీకు తోచిన నిందలు వేయకు.
నయని: ఎవరికో అలాంటి ఆలోచన వచ్చిందని మిమల్ని అడగబోయేలోపు హడావుడిగా తడబడిపోయారు ఏంటి అత్తయ్య.
తిలోత్తమ: నీ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు నయని.
నయని: ఈ అసూయ ద్వేషాలు కేవలం నా దగ్గర మాత్రమే చూపించాలి అంటున్నా. అంతే తప్ప ఇంకెవరి మీద మీ దృష్టి మళ్లినా చిన్న పిల్లలకు ఏం జరిగినా నేను అస్సలు ఊరుకోను.
తిలోత్తమ: ఇక్కడి వరకు వచ్చి ముసుగులో గుద్దులాట ఎందుకు నయని. నిజమే పాలలో మత్తు మందు కలిపాను. ఆ పాలు నేను తాగకూడదు అనుకుంటే నా కొడుకు వల్లభ తాగేశాడు.
నయని: బతికే ఉన్నారు బావగారు. కానీ మీరు అలాంటి పనులు చేయడానికి ఎందుకు బతికున్నారో చెప్పారు.
తిలోత్తమ: అది ప్రాణాలు తీసే పని కాదు నువ్వు అంత సీరియస్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు నా పనుల్లో జోక్యం చేసుకోవద్దు.
నయని: తిలోత్తమ చీర కొంగు తన మెడకి చుట్టి గాయత్రీ అమ్మగారు వచ్చేవరకు మిమల్ని నేను ఏం చేయను మీరు ఇంకోసారి పిల్లల జోలికి వస్తే మాత్రం నా నిర్ణయం మార్చుకొనే అవకాశం ఉంటుంది. జాగ్రత్త.
తిలోత్తమ: నీ దత్త పుత్రికని అఖండ స్వామి దగ్గరకు తీసుకెళ్లాక అప్పుడు మీ అందరి సంగతి తేలుస్తా.
పావనా: విశాల్ అల్లుడు ఇంకా మత్తు వదల్లేదు ఏంటి.
విశాల్: ఎక్కువ మత్తు మందు కలిపినట్లు ఉన్నారు.
పావానా: వీళ్లు వేరే వాళ్లని ముంచేయడం ఏమో కాని ఫస్ట్ టైం వాళ్లు తీసిన గోతిలో వాళ్లే పడ్డారు.
ఇక హాసిని అక్కడికి వచ్చి తన భర్త ఇంకా లేవలేదా అంటుంది. వల్లభ ముఖం మీద నీళ్లు కొట్టి తన్ని లేపాలి అని చూస్తుంది. ఇంతలో వల్లభని మత్తులో ఉన్నప్పుడే నిజం తెలుసుకోవాలి అని విశాల్ కూల్‌గా వల్లభతో మాట్లాడుతాడు. అన్ని విషయాలు అడుగుతారు. దీంతో వల్లభ జరిగింది అంతా పూసగుచ్చినట్లు చెప్పేస్తాడు. దీంతో విశాల్, పావనా, హాసినిలు షాక్ అయి.. తిలోత్తమ, వల్లభలు గాయత్రీ పాపని బయటకు తీసుకెళ్లకుండా చూసుకోవాలి అనుకుంటారు.
మరోవైపు వల్లభ, తిలోత్తమ గాయత్రీ పాప కోసం గదికి వెళ్తారు. వాళ్లను సుమన చాటుగా చూస్తుంది. దగ్గరకి వచ్చి ఈ గది దగ్గర ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో వల్లభ చిన్న పిల్లలను ఎత్తుకుపోతున్నాం అని అంటాడు. గాయత్రీ పాపని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే పని అయ్యాక చెప్తామని అంటారు. దీంతో సుమన ఎవరికైనా చెప్పేస్తా అంటుంది. దీంతో తిలోత్తమకు సుమన 20 శాతం వాటా అడుగుతుంది. దీంతో తిలోత్తమ గాయత్రీ పాపని ఎత్తుకొని తీసుకొని వచ్చి ఇమ్మని సుమనకు చెప్తుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.