Trinayani Serial Today June 29th: 'త్రినయని' సీరియల్: మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన అసలు లలితాదేవి.. బిత్తరపోయిన ఫ్యామిలీ!
Trinayani Serial Today Episode లలితాదేవి విశాల్ ఇంటికి రావడం అప్పుడే వచ్చినట్లు మాట్లాడటంతో రెండు రోజులు ఇంట్లో ఉండి ఇలా మాట్లాడటం ఏంటి అని అందరూ ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode లలితాదేవి రూపంలో ఉన్న తిలోత్తమ వెళ్లిపోయిన తర్వాత నయని కూడా సీరియస్‌గా వెళ్లిపోతుంది. ఇంట్లో వాళ్లు అంతా అసలేం జరిగిందా అని ఆలోచిస్తారు. సుమన గదిలో విక్రాంత్ కోసం ఎదురు చూసి విక్రాంత్ రాగానే మా అక్క మీ పెద్ద పెద్దమ్మని ఎందుకు చంపాలని చూసిందని అంటుంది.
సుమన: గాయత్రీ అత్తయ్యని దేవత అనేదా మా అక్క. వాళ్ల అక్క లలితాదేవి గారిని మహానుభావురాలు మంచిది అని పొగిడేది కదా అలాంటిది ఇవాళ ఏకంగా ఆవిడ మీదే గన్ గురి పెట్టింది. ఎంత గానో నమ్మని మిమల్ని కూడా నిర్లక్ష్యం చేసినా హతమార్చిన ఆశ్చర్యం లేదు అని అర్థం చేసుకోండి.
విక్రాంత్: నీ పిచ్చి, అర్థం లేని మాటలకు సమాధానం చెప్పడం అనవసం. నమ్మిన వాళ్ల కోసం నయని వదిని ప్రాణం ఇస్తుందే కానీ ప్రాణం తీయదు. పెద్దమ్మ విషయంలో జరగరానిది ఏదో జరిగితేనో ఇలా ప్రవర్తించుంటుంది. తేడా జరిగి ఉంటుంది కాబట్టే ఎవరూ అడ్డు రావొద్దని చెప్పింది మా వదిన.
విశాల్: నయని ఎదురుగా గన్ పెట్టి.. నేను నీ ముందు పెట్టింది మారణాయుధం కాదు నయని మన ఇంటి పరువు ప్రతిష్ట కూడా. పెద్దమ్మకు ఏం కాలేదు కాబట్టే మనస్శాంతిగా ఉన్నాం తొందర పడి నువ్వు ట్రిగర్ నొక్కుంటే.
హాసిని: ఒక్కటి కాకపోతే రెండో బులెట్‌కి అయినా ప్రాణం పోయేది.
నయని: నువ్వెందుకు నన్ను ప్రశ్నించడం లేదు ఎందుకు అక్క.
హాసిని: చీమకు కూడా హాని చేయని నువ్వు పెద్దత్తయ్యకు గన్ గురి పెట్టావ్ అంటే ఆవిడ ఏదో పాపమే చేసుంటుంది.
నయని: నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు కదా బాబుగారు.
విశాల్: మాకు చెప్తే కదా నువ్వు చేసింది నిజమో కాదు తెలుస్తుంది.
నయని: తెలిస్తే నమ్మరు బాబు. చెప్పడం నాకు ఇష్టం లేదు బాబు.
విశాల్: అయితే అది నాకు సంబంధించిన విషయమే.
నయని: అలాంటిదే అనుకోండి. ఈ విషయం గురించి కొన్ని రోజులు మర్చిపోండి. తర్వాత మీకే సమాధానం దొరకుతుంది.
తిలోత్తమ హాల్ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అందరూ హాల్‌లోకి వచ్చి ఎప్పుడు వచ్చారని అడుగుతారు. వేకువ నాలుగుకి వచ్చా అని తిలోత్తమ అంటుంది. నయని వచ్చి అత్తయ్య రావాలి అక్క అని మీ గురించి ఎవరికీ ఇంకా పూర్తిగా తెలీదు కాబట్టే ఇలా ఉన్నారు అని లేదంటే ప్రశ్నల వర్షం కురిపించేవారు అని అంటుంది.
విశాల్: నయని అమ్మ ఏం చేసింది అలా అంటున్నావ్.
నయని: మేకప్ తీసింది బాబుగారు.
విక్రాంత్: అదేంటి వదినా అలా అన్నావ్. అమ్మ ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్లావ్.
వల్లభ: బిజినెస్ పని మీద వెళ్లుంటుందిరా. అమ్మని చూసి మనం నేర్చుకోవాలి.
నయని: చెడిపోతారు బావగారు. కాపీ కొడితే వారు వీరులా వీరు వారులా అయిపోయి ఎవ్వరూ కాకుండా పోతారు. మీ అమ్మకి అయితే అర్థమవుతుంది.
లలితాదేవి: నయని అంటూ నవ్వుతూ వస్తే అందరూ షాక్ అవుతారు. నయని నవ్వుకుంటుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు. ఇలా వచ్చాను అనా.
నయని: భలే వారు అమ్మగారు ఇది మీ ఇళ్లు ఎప్పుడు అయినా రావొచ్చు ఎప్పుడు అయినా వెళ్లొచ్చు.
లలితాదేవి: అంత సమయం లేదులే. బిజినెస్ పనులు ఉన్నాయ్ మిమల్ని చూసి చాలా రోజులు అయిందని వచ్చా.
పావనా: అదేంటి అక్క ఇప్పుడే ఇంటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.
లలితాదేవి: ఇప్పుడే కదా పావనామూర్తి ఇంట్లోకి వచ్చింది.
వల్లభ: మమ్మీ నువ్వు దొరికిపోయేలా ఉన్నావ్.
హాసిని: నిన్నా మొన్నా ఇంట్లోనే ఉన్నారు కదా.
లలితాదేవి: ఎవరి ఇంట్లో..
సుమన: ఈ ఇంట్లోనే..
లలితాదేవి: నేను వచ్చిందే ఇప్పుడు.
విశాల్: పెద్దమ్మ అంత విచిత్రంగా ఉంది. రెండు రోజులు ఇక్కడే ఉన్నారు కదా. నిన్న నయని సీరియస్ అవ్వగానే వెళ్లిపోయారు కదా.
లలితాదేవి: నవ్వుతూ.. నయని నా మీద కోప్పడటమా అది ఈ జన్మలో జరుగుతుందా. ఏంటి నాన్న వింతగా మాట్లాడుతున్నారు.
విక్రాంత్: పెద్దమ్మ మీ చేతికి కట్టు ఉండాలి కదా.
లలితాదేవి: ఏం కట్టు.
విక్రాంత్: మీ చేతికి మలేషియాలో గాయం అయింది అన్నారు కదా.
లలితాదేవి: నెల రోజులు నేను ఇండియా దాటి వెళ్లలేదు.
నయని: ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునేలోపు జరగాల్సిన జరిగిపోతాయి.
విశాల్: అంత మాయలా ఉంది.
లలితాదేవి: ఇంతకీ ఈవిడ ఎవరు.
నయని: మా తిలోత్తమ అత్తయ్య అమ్మగారు.
తిలోత్తమను మారిపోయిందని గ్లౌజ్ గురించి కూడా చెప్తారు. ఆ చేయి వెనక చాలా విశేషం ఉంటుంది అయితే అని అంటుంది లలితాదేవి. సర్పదీవికి వెళ్లి వచ్చిన తర్వాత అమ్మవారి పూజ చేయాలి చేశారా అని లలితాదేవి అడుగుతుంది. ఇక గంటలమ్మ గురించి కూడా చెప్తారు. గాయత్రీ దేవి ఆత్మ బంధించాలి అని గంటలమ్మ వచ్చిందని చెప్తారు. క్షుద్రపూజలు ప్రోత్సహించే అలాంటి వారిని ఇంట్లోకి ఎందుకు రప్పిస్తారు అని లలితాదేవి అంటుంది. ఆవిడ రెండు మూడు హత్య కేసుల్లో నిందితురాలు అని చెప్తుంది లలితాదేవి. ఇక తిలోత్తమను గాయత్రీ దేవి ఆత్మ పట్టుకొని ఏం చేస్తావ్ అని ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.