![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మి ఫొటో మిత్ర దగ్గర చూసేసిన లక్కీ.. త్వరలోనే లక్ష్మిని భార్యగా చేసుకుంటానన్న అర్జున్!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode మిత్ర జాతకం అమ్మవారి దీపానికి ఆహుతి అయిపోవడంతో కంగారు పడ్డ దీక్షితులుగారు లక్ష్మీతో మాట్లాడాలని కబురు పంపడంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మి ఫొటో మిత్ర దగ్గర చూసేసిన లక్కీ.. త్వరలోనే లక్ష్మిని భార్యగా చేసుకుంటానన్న అర్జున్! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today june 28th episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మి ఫొటో మిత్ర దగ్గర చూసేసిన లక్కీ.. త్వరలోనే లక్ష్మిని భార్యగా చేసుకుంటానన్న అర్జున్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/2611d3a08285cd03b8a90771d3fa4a0d1719547617395882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్ర లక్ష్మి ఫొటో చూస్తూ ఇప్పుడు నిన్ను ఎంత ద్వేషిస్తున్నానో ఒకప్పుడు అంత కంటే ఎక్కువ ప్రేమించాను అని నువ్వు నన్ను మోసం చేశావని అనుకుంటాడు. నువ్వు బతికే ఉన్నావని దీక్షితులు గారు అంటున్నారు. మామ్ కూడా నమ్ముతుందని నువ్వు బతికే ఉన్నావా.. ఉంటే ఎక్కడ ఉన్నావ్.. అని ఆవేశంగా మిత్ర అంటాడు. ఇంతలో లక్కీ నాన్న అంటూ రావడంతో ఫొటో తీసుకొని పర్స్‌లో పెట్టబోతే ఆ ఫొటో కింద పడిపోతుంది. లక్కీ మిత్ర దగ్గరే పడుకుంటాను అని తనకు కథ చెప్పి జోల పాట పాడమని అంటుంది.
ఇక లక్ష్మి కూడా జున్నుకి కథ చెప్తూ పడుకోపెడుతుంది. జున్ను పడుకున్న తర్వాత మిత్రకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో దీక్షితులు గారిని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇక దీక్షితులు గారు అడవిలో అమ్మవారి ఎదుట నిద్ర పోతూ ఉంటారు. ఇంతలో అడవిలో ఉన్నపళంగా పెద్ద గాలి వీస్తుంది. ఉరుములు, మెరుపులు మొదలవుతాయి. అమ్మవారి ఎదుట ఉన్న మిత్ర జాతకం పేపర్ అఖండ దీపానికి కాలిపోతుంది.
దీక్షితులు: అమ్మా ఉన్నపళంగా ఏంటి ఈ వైపరీత్యం. నువ్వు నాకు ఏం చెప్పాలి అనుకుంటున్నావు. నీ దగ్గర పూజకు పెట్టిన మిత్ర జాతకం అగ్నికి ఆహుతి అవ్వడం ఏంటి. నా కళ్ల ముందే అది కాలి భస్మం అవ్వడం ఏంటి.మిత్ర జీవితానికి ఏం జరుగుతుంది. మిత్రని హరించడానికి ఏం ప్రమాదం సంభవించబోతుంది తల్లీ. మిత్రను రక్షించే దారి చూపించే తల్లి. మిత్రకు గండాల నుంచి తప్పించే మార్గం చూపించు తల్లి. మిత్రను కాపాడేది కేవలం లక్ష్మీ మాత్రమే. మిత్రను ఆపద నుంచి కాపాడే నా ప్రయత్నానికి నీ సాయం అందించు తల్లి. అందించు.
తండ్రి దగ్గర పడుకున్న లక్కీ ఉదయం నిద్ర లేస్తుంది. తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి ముద్దు పెట్టి లేస్తుంది. మిత్ర పర్స్ నుంచి కింద పడిపోయిన లక్ష్మి ఫొటో చూస్తుంది. అమ్మ ఫొటో ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారని అనుకుంటుంది. తండ్రిని అడగాలి అని అమ్మ ఫొటో ఇక్కడ ఎందుకు ఉందని అంటుంది. మిత్ర డిస్ట్రబ్ చేయొద్దని అనేస్తాడు. ఇక లక్కీ ఆ ఫొటోని కింద ఉన్న వివేక్కి చూపిస్తుంది.
వివేక్: మనసులో.. ఈ ఫొటో లక్కీకి ఎక్కడ దొరికింది. ఈ ఫొటోలో ఉన్నది ఎవరు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి.
లక్కీ: బాబాయ్ నిన్నే ఈ ఫొటో మన ఇంట్లో ఎందుకు ఉంది.
వివేక్: అదా.. దాని వెనక పెద్ద స్టోరీ ఉంది.
లక్కీ: తినకి మనకి ఏం సంబంధం. ఇక లక్కీ తను జున్ను వాళ్ల అమ్మ అని చెప్పబోయే లోపు వివేక్ తనకు ఏం చెప్పొద్దని ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు.
మనీషా, దేవయానిలు రావడంలో.. మనీషా అంటీ అమ్మ ఫొటో మన ఇంట్లో ఎందుకు ఉంది.
మనీషా: అమ్మ ఫొటోనా..
లక్కీ లక్ష్మి ఫొటో మనీషాకు చూపిస్తుంది. మనీషా, దేవయానిలు షాక్ అయిపోతారు. క్లోజ్ చేసిన గదిలోకి ఎందుకు వెళ్లావ్ అని మనీషా అంటే అది తన డాడీ గదిలో ఉందని లక్కీ చెప్తుంది. మనీషా మిత్ర దగ్గర ఆ ఫొటో ఎందుకు ఉందని ఆలోచిస్తుంటుంది. ఇక మనీషా ఆ ఫొటోలో ఉన్న లక్ష్మిని ఇంకోసారి అమ్మ అన్నావు అంటే నీ పని అవుతుందని లక్కీని తిట్టి ఫొటో చింపేస్తుంది. లక్కీ డల్‌గా ఉండటం అరవింద చూస్తుంది. ఏమైందని అడిగితే అమ్మ ఫొటో నాన్న గదిలో దొరికిందని మనీషా అంటీ చింపేసిందని చెప్తుంది. అరవింద ఆ ఫొటో ముక్కలు తీసుకొని వాటిని పేర్చి లక్ష్మీ ఫొటో చూసి షాక్ అవుతుంది. ఆ ఫొటో చూసి లక్కీ ఎందుకు అమ్మ అంటుందని అరవింద ఆలోచిస్తుంది.
లక్ష్మీకి దీక్షితులు గారి శిష్యుడు కాల్ చేసి దీక్షితులు గారు ఉన్నపళంగా రమ్మన్నారు అని చెప్తాడు. ఇక అర్జున్ వచ్చి టెండర్‌కి వెళ్దామంటే లక్ష్మీ అర్జెంట్ పని ఉందని అంటుంది. అర్జున్ సాయం చేస్తాను అంటే లక్ష్మి వద్దు అనేస్తుంది. లక్ష్మి బయల్దేరుతుంది. ఇక అర్జున్ లక్ష్మిని త్వరలోనే తన భార్యగా చేసుకోవాలని లక్ష్మి మనసులో తన మీద ఉన్న అభిమానం ప్రేమ బయట పడే వరకు ఎదురు చూస్తానని అర్జున్ అనుకుంటాడు. ఇక లక్ష్మీ ఫొటో ముక్కలు మిత్ర ఎదురుగా ఉంటుంది. అరవింద మిత్రను లక్ష్మి గురించి అడుగుతుంది. లక్ష్మి మీద నీకు ఉన్న కోపం నిజమా తన మీద ఉన్న ప్రేమ నిజమా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)