Trinayani Serial Today June 25th: హర్ష ఆత్మ అని, తనని ఎవరో హత్య చేశారని ఇంట్లో వాళ్లకి చెప్పిన నయని.. అక్కకి ఎఫైర్ అంటగట్టిన సుమన!
Trinayani Serial Today Episode హర్ష ఆత్మని చూసిన తిలోత్తమ, గంటలమ్మ తనని పట్టుకోవాలి అని పరుగులు తీయడం హర్ష ఆత్మని వెళ్లిపోమని నయని సాయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode హర్షని అద్దంలో చూసి తిలోత్తమ ఆత్మ అని అరుస్తుంది. గంటలమ్మ గాయత్రీ పాపని చూసి ఆత్మ అని అంటుంది. దానికి తిలోత్తమ గాయత్రీ అక్కయ్య ఆత్మ కాదు గంటలమ్మ వాడి ఆత్మ నాకు అద్దంలో కనిపించిందని అంటుంది. గంటలమ్మ కూడా హర్షని చూసి షాక్ అవుతుంది.
తిలోత్తమ: గంటలమ్మ వాడిని పట్టుకో.
గంటలమ్మ: మమల్ని తప్పించుకొని ఎక్కడికి వెళ్తావురా.
నయని: పారిపో వెళ్లిపో.. త్వరగా వెళ్లు. పారిపో..
గంటలమ్మ: రక్త చాముండీ దొరికిపోయాడు వీడు. గంటలమ్మ గదిలోకి హర్షని వెతుక్కుంటూ వెళ్తే గాయత్రీ పాప గంటలమ్మని టచ్ చేస్తుంది. దాంతో గంటలమ్మ పడిపోతుంది. నయని గంటలమ్మని లేపుతాను అంటే గంటలమ్మ వద్దు అనేస్తుంది. తిలోత్తమ వచ్చి గంటలమ్మని వల్లభని తీసుకొని బయటకు వెళ్లిపోతుంది. నయని కూడా మాట్లాడకుండా వెళ్లిపోతుంది.
విశాల్: నయని ఎవరినో ఇంటి నుంచి వెళ్లిపోమన్నావ్. మా అమ్మని కాదు కదా.
నయని: కాదు. కానీ ఆత్మనే బాబుగారు.
విశాల్: అమ్మ కాకుండా ఇంకో ఆత్మ ఎవరు.
నయని: ఇక్కడికి వచ్చిన తనని పట్టుకోవడానికి వచ్చిన గంటలమ్మ గాయత్రీ పాపని చూసి చాలా భయపడింది. ఒకరి కోసం వచ్చి ఇంకొరిని చూసింది.
విశాల్: పసిపిల్లలు దేవుడితో సమానం అన్నావు కదా అందుకే పాపలో అమ్మవారిని చూసి భయపడి ఉంటుంది.
నయని: అమ్మవారిని చూసిందా.. అమ్మగారిని చూసిందా.
విశాల్: అదేంటి నయని అలా అంటున్నావ్. మా అమ్మ వస్తే నువ్వు చూసి చెప్పేదానివి కదా. నీకు కనిపించలేదు అంటే ఎవరికీ కనిపించదు అమ్మ.
నయని: బాబు గారు పసిపాపగా ఉన్న అమ్మగారిని చూడమని విశాలాక్షి పసిపాప ఛాయ చూడమంది కదా అలాంటి డ్రస్ గాయత్రీ పాప వేసుకుంది అని తిలోత్తమ అత్తయ్య గారు లేనిపోని ఇబ్బంది పెట్టారు. మరి పాప ఈ రోజు అదే డ్రస్ వేసుకుంది ఎందుకని.
విశాల్: అది మామూలే నయని. నీ సిక్త్ సెన్స్ కనిపించి ఎలా చెప్తావో గాయత్రీ పాపకి అలాంటి లక్షణాలు అబ్బుండొచ్చు.
నయని: నా కడుపున పుట్టనప్పుడు లక్షణాలు ఎలా వస్తాయి బాబుగారు.
విశాల్: అలా అంటే ఎలా నయని. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు. అలాంటిది ఏడాదిన్నర అయింది కదా పాప మనతోనే ఉంది కదా నయని అలవాట్లు వస్తాయి కదా.
విశాల్‌కు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. విశాల్ హడావుడిగా విక్రాంత్‌ని పిలుస్తాడు. ఆడిటర్‌కి ఇంకా ఫైల్ ఇవ్వలేదు ఎందుకని అడుగుతాడు. దాంతో విక్రాంత్ డిస్ట్రబ్ అయ్యానని అంటాడు. ఇక విశాల్ విక్రాంత్‌ని తిడతాడు. ఇక సుమన విక్రాంత్‌కి సపోర్ట్ చేస్తుంది. విక్రాంత్ సారీ చెప్తే సుమన చెప్పొద్దని అంటుంది. ఇక సుమన గంటలమ్మ వచ్చినప్పుడు పారిపో అన్నావు కదా అది ఎవరు అని అడుగుతుంది. వల్లభ కూడా సుమనకు వత్తాసు పలుకుతాడు.
సుమన నయని చేసిన పనికి పరువు పోయినట్లు అనిపించడం లేదా అని ఇంట్లో అందరిని అడుగుతుంది. అంత మాట ఎందుకు అన్నావ్ అని విశాల్ అడిగితే అందరి కంటే ముందు హాల్‌లోకి వచ్చిన తన అక్క ఎవరినో ఇంట్లోకి తీసుకొచ్చిందని అందరూ చూస్తారనే టైంలో పారిపో పారిపో అని తప్పించేసిందని అతను ఎవరుని అంటుంది. దానికి కోపంగా నయని సుమన చెంప పగలగొడుతుంది. విక్రాంత్ కూడా కొడతాడు. విక్రాంత్ సుమన గొంతు కూడా పట్టుకుంటాడు. విశాల్ ఆపేస్తాడు.
సుమన: ఎవర్ని వెళ్లిపోమని అంది. పారిపో పరిగెత్తమని ఎవర్ని అంది.
విక్రాంత్: నీకా అందరికా.
వల్లభ: అందరికీ తెలియాలి. ఇంట్లో అందరం ఉన్నాం కదా. విశాల్ తమ్మి నువ్వు అడగాలి.
నయని: చెప్తాను. గంటలమ్మని తిలోత్తమ అత్తయ్య ఇంట్లో ఉండే ఆత్మని పట్టించాలి అని తీసుకొచ్చారు.
విశాల్: ఆత్మ అంటే ఎవరు మా అమ్మేనా నయని.
వల్లభ: ఇంకా ఎవరు ఉంటారు.
నయని: ఉన్నారు.
పావనా: వామ్మో అంటే నువ్వు అప్పుడు వెళ్లిపోమన్నది గాయత్రీ అక్కయ్యని కాదా నయని.
నయని: కాదు అసలు గాయత్రీ అమ్మగారు రాలేదు. వచ్చింది హర్ష.
వల్లభ: హర్ష నీతో ఏం చెప్పాడా.
నయని: మీకు బాగా పరిచయం ఉన్నట్లు అలా అన్నారు ఏంటి బావగారు. ఓ మీ అమ్మ చెప్పిందా. దురదృష్టం ఏంటి అంటే హర్షని హత్య చేశారు. పూర్తి వివరాలు తెలియాలి అంటే ఆ పిల్లాడు నాకు మళ్లీ కనిపించాలి.
వల్లభ: మనసులో.. మా అమ్మే చంపిందని పెద్ద మరదలికి తెలిస్తే పరిస్తితి ఏంటో.
సుమన తన భర్త, అక్కలు కొట్టిన దెబ్బలకు చెంపలు పట్టుకొని కూర్చొంటుంది. ఇక విక్రాంత్ సుమనకు పోలీసులు కేసులు అంటూ భయపెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.