అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: జానుకి పెళ్లి చేస్తానని చెప్పిన మిత్ర.. 'నా జీవితానికి అర్థం నువ్వే' అని అర్జున్‌తో చెప్పిన లక్ష్మి.. ఇది ప్రేమేనా!

chiranjeevi lakshmi sowbhagyavathi today episode జానుని ఇంటికి పిలిచిన మిత్ర వివేక్‌కి దేవయాని వేరే సంబంధం చూసిందని తాను కూడా జానుకి పెళ్లి చేస్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: అర్జున్‌ కంప్లైంట్ ఇచ్చాడని తన ఫొటో పోలీసులకు చూపించాడని తెలిసి లక్ష్మి అర్జున్ మీద సీరియస్ అవుతుంది. తర్వాత తన గదిలోకి వచ్చి అర్జున్‌ని తిట్టినందుకు బాధపడుతుంది. మరోవైపు జాను అరవింద ఇంటికి వస్తుంది. వస్తూనే తనని దేవయాని గతంలో తిట్టడం గుర్తు చేసుకొని ఇబ్బందిగా ఫీలవుతూ ఇంటికి వెళ్తుంది. అరవింద చూసి జానును లోపలికి పిలుస్తుంది. మిత్ర వచ్చి తానే జానుని పిలిచాను అని అంటాడు. 

మిత్ర: జాను మీ అక్క చేసిన తప్పునకు నువ్వు శిక్ష అనుభవించకూడదు. ఆ మోసగత్తె వల్ల నువ్వు బలి కాకూడదు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను అది ఏంటంటే..
అరవింద: మిత్ర చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్‌రా.. లక్ష్మిని మోసగత్తె, మంత్రగత్తె అని అవమానించకు. 
మిత్ర: అవమానిస్తాను అమ్మ. ఇంతకంటే ఘోరంగా అవమానిస్తాను. మన పరువు, ప్రతిష్టను నడివీధిలో పడేసింది. అలాంటి తనని ఇంతకంటే నీచంగా మాట్లాడినా తప్పులేదు.
అరవింద: మిత్ర జరిగింది తెలుసుకోకుండా నిందలు వేయకూడదు.
మిత్ర: జరిగింది నీకు తెలిసి కూడా ఇలా మాట్లాడుతావేంటి అమ్మ. క్షమించరాని నేరం చేసింది కాబట్టే తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది. అయినా ఇప్పుడు లక్ష్మి ఏం చేసిందనేది ముఖ్యం కాదు. లక్ష్మి మూలంగా జాను జీవితం నాశనం కాకూడదు. చూడు జాను మీ అక్క నా జీవితం నుంచి ఈ లోకంలో నుంచి  శాశ్వతంగా వెళ్లిపోయిందని నేను నీ జీవితాన్ని గాలికి వదిలేయను. నీ జీవితానికి ఓ మార్గం వేస్తాను.
జాను: దేని గురించి మాట్లాడుతున్నారు బావగారు.
మిత్ర: వివేక్‌కి మా పిన్ని ఆల్రెడీ ఓ పెళ్లి సంబంధం చూసింది. ఆ అమ్మాయితోనే పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంది. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది. ఎవరి స్వార్థం కోసం వాళ్లు నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది. ఇంకా నువ్వు వివేక్‌ గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అందుకే నేను నీకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా..
దేవయాని: వావ్.. మంచి నిర్ణయం మిత్ర. అలా అయితే వివేక్‌ పెళ్లితో పాటు జాహ్నవి పెళ్లి కూడా చేసేద్దాం.
వివేక్: స్టాపిట్ మామ్..
మిత్ర: పిన్ని అన్నదాంట్లో తప్పు ఏముందిరా. తను అన్నట్లు మీ ఇద్దరి పెళ్లి ఒకే కల్యాణ మండపంలో చేద్దాం.
వివేక్: అన్నయ్య ఏంటిది. మామ్ తెచ్చిన సంబంధం చేసుకుంటాను అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నేను మీకు చెప్పానా.
మిత్ర: సరే నీకు ఎవరు ఇష్టమో ఇప్పుడైనా చెప్పు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావో ఇప్పుడైనా చెప్పు. చూశావా.. నీకు తెగేసి చెప్పడం తెలీదు. మనసులో మాట చెప్పలేవు. ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పలేవు. అలాంటప్పుడు నీ జీవితంతో పాటు జాను జీవితం ఎందుకు నాశనం చేస్తావు. ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో చూసుకో. నిన్ను ఆపుతున్న దానికి లొంగిపోతావో. ధైర్యంగా నీకు కావాల్సింది దక్కించుకుంటావో నువ్వే తేల్చుకోను. 
దేవయాని: మనసులో.. మిత్ర జాను విషయంలో వివేక్‌ని వెర్రిక్కించడానికి పిలిచావని అర్థమైంది. నువ్వేన్ని చేసినా నేను చూసిన అమ్మాయితోనే వివేక్ పెళ్లి అవుతుంది. 

జాను ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోతుంది. మరో వైపు వసుధార ఏడుస్తూ లక్ష్మి దగ్గరకు వస్తుంది. ఏమైందని లక్ష్మి అడిగితే అర్జున్ అని అంటుంది. లక్ష్మి అర్జున్‌ గదికి పరుగులు తీస్తుంది. అర్జున్ తప్ప తాగి పడుకొని ఉంటాడు. వసుధార తన కొడుకు దుస్థితిని లక్ష్మితో చెప్పి ఏడుస్తుంది. తనకు బాధ కలిగిందని అందుకే తాగాను అని అర్జున్ అంటాడు. దానికి లక్ష్మి తన వల్లే తాగావని తాను తిట్టినందుకే తాగవని లక్ష్మి అర్జున్‌కి క్షమాపణ చెప్తుంది. తన గతం గురించి చెప్తే ప్రమాదమని అందుకే ఎవరికీ తెలీకూడదని అందుకే చెప్పడం లేదని అంటుంది. 

అర్జున్‌: లక్ష్మి నీ సమస్య ఎంత పెద్దది అయినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను.
లక్ష్మి: అర్జున్‌ గారు మీరు నా సమస్యను తీర్చలేరు. అది అంత సులువైనది కాదు.
అర్జున్: ఏంటో లక్ష్మి నేను ఎంత సంపాదించిన నీకు సాయం చేయలేకపోతున్నాను అని ఫీలవుతూనే ఉన్నాను. నీ సమస్య తీర్చలేను అన్న వ్యథ నాకు ఇబ్బంది పెడుతుంది.
లక్ష్మి: అర్జున్‌గారు ప్లీజ్ దయచేసి అలా అనుకోకండి. మీరే లేకపోయింటే నా జీవితం ఏమైపోయేదో. మీరు లేకపోయి ఉంటే నా కొడుకు జీవితం ఏమైపోయేదో. మీరు లేకపోతే నా జీవితం ఎప్పుడో అంధకారం అయ్యేది. మీరు నా జీవితానికి ఓ అర్థం కల్పించారు.  మీరు అంటే నాకు ఎంతో అభిమానం. అభిమానం కంటే ఎంతో ఎక్కువే  అది మాటల్లో చెప్పలేను. మళ్లీ ఈ పరిస్థితి రానివ్వకండి. మీ వల్ల మేం బాధ పడేలా చేయకండి. లక్ష్మి వెళ్లిపోతుంది. 
అర్జున్‌: అమ్మ ఇప్పుడు లక్ష్మి ఏం చెప్పిందో విన్నావా తన జీవితానికి నేను అర్థం కలిపించానంట. తన జీవితానికి నేనే ఆధారం అంట. నా మీద అభిమానం కంటే మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఉందంట. ఇన్నాళ్లకు లక్ష్మి తన మనసులో నా మీద ఫీలింగ్ చెప్పంది.
వసుధార: అవును అర్జున్ లక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది. తన మనసులో మాట చెప్పింది.
అర్జున్: పోనీలే అమ్మ ఒకప్పుడు ఈ మందే నన్ను లక్ష్మిని కలిపింది. ఇప్పుడు ఈ మందే తన మనసులో మాట నాకు చెప్పేలా చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. 

జాను వెళ్తుంటే వివేక్ ఎదురు వస్తాడు. జాను నీ బాధ తీరేలా ఏడ్చేయ్‌మని అంటాడు. రోజుకు వంద సార్లు ఏడ్చిన తన బాధ తీరదని చనిపోతే పోతుందని జాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 24th: కార్తీక్‌ ఇంట్లో దీప హడావుడి.. దీప మాటలకు విషం తాగి చచ్చిపోతానన్న కాంచన..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Embed widget