అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 24th: కార్తీక్‌ ఇంట్లో దీప హడావుడి.. దీప మాటలకు విషం తాగి చచ్చిపోతానన్న కాంచన..!

Karthika Deepam 2 Serial Today Episode శ్రీధర్ రెండో పెళ్లి కుటుంబం గురించి కాంచనకు చెప్పాలని దీప కార్తీక్ ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో దీప, కార్తీక్‌ కారులో రావడం చూసి షాక్ అయిపోతారు. ఇద్దరూ కాంచన గురించి మాట్లాడుకుంటారు. అది చూసిన జ్యోత్స్న, పారులు ఏ విషయం మాట్లాడుకుంటున్నారా అని తెగ టెన్షన్ పడుతుంటారు. ఇక దీప వెళ్తుంటే కార్తీక్ ఆపి జాగ్రత్తలు చెప్తాడు. అది చూపిన పారు దీపని మీ బావ వెళ్లనిచ్చేలా లేడు అని అంటుంది. రేపు ఎక్కడ కలుద్దాం.. ఏం చేద్దాం అని మాట్లాడుతున్నాడని పారు కావాలనే జ్యోత్స్నని ఆటపట్టిస్తుంది. కాంచన ఆరోగ్యం బాలేదని ఇంటి దగ్గర ఒక్కర్తే ఉంటుందని త్వరగా వెళ్లమని దీప కార్తీక్‌ని పంపేస్తుంది.  

జ్యోత్స్న: వీళ్లని కలవకుండా ఆపడం కష్టం గ్రానీ. టిఫెన్ షాప్ దగ్గరకు వెళ్లి అంత వార్నింగ్ ఇచ్చినా ఇలా మళ్లీ కలిసింది అంటే దీన్ని ఏమనుకోవాలి. కలవడమే కాదు ఎవరు చూస్తే నాకు ఏంటి అనేలా ఇంటి ముందే కారు దిగింది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. వాళ్లు తెగించారు అనా. లేక మనం ఏం చేయలేమనా..
పారిజాతం: నువ్వు వెళ్లి దీపని నిలదీయ్. నాలుగు చీవాట్లు పెట్టు.
జ్యోత్స్న: గ్రానీ నువ్వే నాకు నేర్పిన పాఠాలు నువ్వే మర్చిపోతే ఎలా. దీపని ఇలాగే వదిలేస్తే బావ నాకు దక్కడేమో అని నీ భయం. ప్రపంచం సర్వనాశనం అయిపోయినా నా పెళ్లి బావతోనే అవుతుంది. అది నువ్వు గుర్తు పెట్టుకో.
పారిజాతం: వామ్మో.. నా మనవరాలిలో రెండో యాంగిల్ చూస్తే నాకే భయం వేస్తుంది. అచ్చం నాలా మారిపోయింది. ఓరేయ్ దాసు మనకు ఇక తిరుగులేదురా. ఓసేయ్ పారిజాతం నీ కలలు అన్నీ పండాయే. తొందరలోనే ఈ ఇంటి మీద మన జెండా ఎగురుతుంది అంతే.

దీప వంట చేస్తూ తన తండ్రి చావుకి కార్తీక్ కారణం కాదు అని అర్థం చేసుకొని కార్తీక్‌ని ఇన్ని రోజులు తిట్టినందుకు బాధ పడుతుంది. తను ఎన్ని తిట్టినా అవమానం చేసినా పట్టించుకోకుండా కార్తీక్ సాయం చూశాడని కుమిలిపోతుంది. కార్తీక్‌ని క్షమించాలి అని అడగాలి అని తన మీద ఏం ద్వేషం లేదు అని చెప్పాలి అనుకుంటుంది. ఇంతలో శౌర్య వచ్చి ఎవర్ని క్షమించమని అడగాలి అని అడుగుతుంది. దీప శౌర్యని దగ్గరకు తీసుకొని ఏడుస్తుంది.  

దీప: మనసులో.. నువ్వు నాకు దూరం అయితే నా పరిస్థితి ఏంటి. లేదు నిన్ను నేను కాపాడుకుంటాను. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావ్. ఆ దుర్మార్గుడి దగ్గరకు నిన్ను పంపను. 

కార్తీక్ తన తల్లికి సేవలు చేస్తుంటాడు. ఇంతలో కార్తీక్‌కి కిరణ్ కాల్ చేసి అర్జెంట్‌గా కలవాలి అంటాడు. ఇక తాను బయటకు వెళ్తాను అని వంట చేయొద్దని బయట నుంచి తీసుకొస్తానని చెప్తాడు. కాంచన సరే అంటుంది. ఇక కార్తీక్ తన తల్లిదండ్రులు ఆదర్శ దంపతులు అని అంటాడు. ఇక కాంచన వంట చేయాలి అనుకుంటుంది. మరోవైపు శ్రీధర్, కావేరితో కలిసి కారులో దీప హోటల్ ముందు నుంచి వెళ్తాడు. అది చూసిన దీప మొదటి భార్యకు బాలేకపోతే ఈయన రెండో భార్యతో షికార్లు చేస్తున్నాడని అనుకుంటుంది. కాంచన పరిస్థితి ఎలా ఉందో అనుకుంటుంది.  కాంచన వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో దీప కాంచన దగ్గరకు వెళ్తుంది. దీప వంట చేస్తుంది. వంట చేసి వెళ్తాను అని రెస్ట్ తీసుకోమని కాంచనకు దీప చెప్తుంది. 

కాంచన: ఒక మనిషిని దగ్గరగా చూసినప్పుడే వాళ్లు ఎలాంటి వాళ్లో అర్థమవుతుంది దీప.
దీప: ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు లేరా అమ్మ.
కాంచన: లేరు దీప. ఆయన ఉంటే అసలు నన్ను వంట గదిలోకే రానిచ్చేవారు కాదు. అంత ప్రేమ ఆయనకు నేను అంటే. కానీ ఏంటో ఆయన ఈ మధ్య కొడుకు కంటే చాలా బిజీ అయ్యారు. ఇంటి దగ్గర ఉండి అన్నీ చక్కబెట్టే ఆయన ఈ మధ్య క్యాంపులు అని తిరుగుతున్నారు. ఆయన ఇప్పుడు బిజినెస్ పని మీద క్యాంప్‌కి వెళ్లారు దీప. పని నేను తప్పితే ఆయనకు వేరే లోకమే లేదు.
దీప: మనసులో.. లోకం కాదమ్మా. వేరే కుటుంబమే ఉంది. మిమల్ని ఇలా వదిలేసి ఆ మనిషి రెండో భార్యతో సంతోషంగా తిరుగుతున్నారు. శ్రీధర్ రెండో భార్య గురించి కాంచన గారికి చెప్పేస్తా. 
కాంచన: నీ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది. నీ మనసు ఎన్ని ముక్కలు అయింటుందో అర్థమవుతుంది.
దీప: మనసులో.. మీకు జరిగిన అన్యాయం తెలిసినా మీ గుండె కూడా ఎన్ని ముక్కలు అవుతుందో అమ్మ. నేను మీకు ఒక విషయం చెప్పాలి అమ్మ. భార్యని నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తి గురించి.
కాంచన: నీ భర్తే అనుకున్నాను అలాంటి వారు మనకు తెలిసిన వాళ్లలో కూడా ఉన్నారా. ఎవరు దీప ఆ దుర్మార్గుడు. 
దీప: భార్య బిడ్డ ఉండగానే వాళ్లకి తెలీకుండా మరొకామెను పెళ్లి చేసుకొని ఆమెతో కూడా బిడ్డను కన్నాడు. ఇప్పుడు ఆ భర్త ఇద్దరినీ మోసం చేస్తున్నాడు. 
కాంచన: అలాంటి వాడిని జైల్లో పెట్టాలి. చెప్పుతో కొట్టాలి. వింటుంటే నాకే ఏదోలా ఉంది. ఆ ఇద్దరి ఆడవాళ్ల పరిస్థితి ఏంటో. నీ ధైర్యం వేరు దీప. నాలాంటిది అయితే విషం తాగి చచ్చిపోతుంది. నేను అయితే అస్సలు ఉండలేను. చచ్చిపోతా దీప. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కాబోయే భర్త యశ్వంత్ కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన కార్తీకదీపం డాక్టరమ్మ శోభాశెట్టి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Raj Kundra News: చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Raj Kundra News: చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
చిక్కుల్లో శిల్పాశెట్టి భర్త- రాజ్‌కుంద్రా ఇల్లు ఆపీస్‌పై ఈడీ దాడులు
Mokshagnya Teja New Look: స్టైలిష్, ఛరిష్మాటిక్, హ్యాండ్సమ్ మోక్షజ్ఞ... బాలయ్య తనయుడి న్యూ లుక్ అదుర్స్ కదూ
స్టైలిష్, ఛరిష్మాటిక్, హ్యాండ్సమ్ మోక్షజ్ఞ... బాలయ్య తనయుడి న్యూ లుక్ అదుర్స్ కదూ
Pune News In Telugu: పూణెలో దారుణం- క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆడుతూ 35 ఏళ్ల క్రికెటర్ మృతి
పూణెలో దారుణం- క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆడుతూ 35 ఏళ్ల క్రికెటర్ మృతి
Kiara Advani: కియారా అద్వానీ ఏముందిరా... కుర్రాళ్ళ గుండెల్లో నానా హైరానా
కియారా అద్వానీ ఏముందిరా... కుర్రాళ్ళ గుండెల్లో నానా హైరానా
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Embed widget