Trinayani Serial Today June 1st: 'త్రినయని' సీరియల్ : తిలోత్తమను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండమని ఇంట్లో వాళ్లకి చెప్పిన విశాలాక్షి.. మళ్లీ వచ్చిన ఆత్మ!
Trinayani Serial Today Episode : గాయత్రీ దేవి ఆత్మను బంధించడానికి మరోసారి గంటలమ్మ విశాల్ ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode : ఆత్మగా వచ్చింది కాబట్టి పునర్జన్మలోనూ గాయత్రీ దేవి చనిపోయి ఉంటుందని సుమన అంటుంది. దాంతో విక్రాంత్, దురంధర సుమనను తిడతారు. సుమన నయనినే అడుగుతాను అని అంటే మళ్లీ తిడతారు. నయనికి డబ్బు ఉందనే దురంధర నయనికి సపోర్ట్ చేస్తుందని సుమన అంటుంది. వల్లభ అఖండ స్వామి దగ్గరకు వస్తాడు. గంటలమ్మ ఇంటికి వచ్చిందని చెప్తాడు. ఆత్మని బంధించే టైంలో నయని వల్ల గంటలమ్మను తన పెద్దమ్మ ఇంటి నుంచి తరిమేసిందని చెప్తాడు.
అఖండ: మాంత్రికురాలు గంటలమ్మ అంత త్వరగా ఓటమిని ఒప్పుకోదు వల్లభ.
వల్లభ: చిన్నపాటి యుద్ధమే జరిగింది.
అఖండ: పసిబిడ్డలా ఉన్న గాయత్రీ దేవి ఆత్మలా అవతరించింది అంటే కేవలం గంటలమ్మను నిలవరించడానికే అయింటుంది. ఇలా జరిగింది అంటే నువ్వు మీ అమ్మ జాగ్రత్త పడండి.
వల్లభ: మా మమ్మీ ఉంటే కదా.
అఖండ: ఉంది.
వల్లభ: ఎక్కడా.
అఖండ: ఈ భూమ్మీద. మీ అమ్మ చనిపోయి ఉంటే గంటలమ్మకి ముందు మీ అమ్మ ఆత్మనే కనిపించేదిరా.
వల్లభ: ఇది లాజికే కానీ పెద్దమ్మ ఆత్మ కనిపించింది అంటే ఏం అనుకోవాలి.
అఖండ: ఎవరు అనుకోవాలో వాళ్లు అనుకుంటే చాలు.
విశాల్ తన తల్లి ఫొటో పట్టుకొని ఉంటాడు. నయని అక్కడికి రావడంతో నయని తన తల్లి ఆత్మని చూడటం వల్ల సంతోషంగా ఉందని అంటాడు. ఇక నయని తన కన్న బిడ్డను ఎత్తుకెళ్లిపోయిన వారిని నయని తిట్టుకుంటుంది. పసిపిల్లగా ఉండాల్సిన అమ్మగారు ఆత్మలా ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇక ఈ సారి అమ్మగారు ఆత్మగా కనిపిస్తే మాత్రం పసిబిడ్డగా ఎక్కడున్నారో చెప్పమని అంటాను అని నయని అంటుంది. ఇంతలో వల్లభ గురువుగారిని తీసుకొని వస్తాడు. తన తల్లి ఇంకా రాలేదు అని విశాలాక్షి శ్రీశైలం వెళ్లిపోతా అంటుందని చెప్తాడు.
సుమన: అలా ఎలా వెళ్లిపోతుంది బావగారు.
విశాలాక్షి: నావెంట మీరు వస్తారా.
డమ్మక్క: వెళ్తే మాత్రం తిరిగి రారు.
దురంధర: ముందు తిలోత్తమ వదిన ఎక్కడుంది చెప్పండి.
వల్లభ: అసలు అమ్మ కూతిరిలా పుట్టాక మళ్లీ అమ్మలా ఎలా వస్తుంది.
విశాలాక్షి: ఎందుకు రాదు నేను నయని అమ్మ అంటాను. డమ్మక్క నన్ను అమ్మ అంటుంది. అంటే బిడ్డను నేనే అమ్మను నేనా కదా. అలాగే గాయత్రీ దేవి కూడా రావొచ్చుకదా.
సుమన: గురువుగారు ఇప్పుడు గాయత్రీదేవి అత్తయ్య ఆత్మ పునర్జన్మలో బిడ్డగా పుట్టిందా. పుట్టి చనిపోయి మళ్లీ ఆత్మగా వచ్చిందా. వచ్చినా కూడా మళ్లీ ఆత్మలా ఎలా వస్తుంది.
గురువుగారు: మంచి ప్రశ్న అడిగావు. ఏ వయసులో చనిపోయిందో ఆ శక్తిని అనుసరించి ఆత్మ పునర్జన్మ కోసం పాకులాడుతూ ఉంటుంది. పసి బిడ్డగా ఉన్న తన ప్రాణాన్ని నలపాలి అని చూస్తే ఆత్మ బలవంతంగా ఉంటుందే తప్ప బలహీనంగా రాదు.
సుమన: సర్పదీవికి వెళ్లి వచ్చిన తిలోత్తమ అత్తయ్య తిరిగి వస్తే ఆవిడను మేం చూసుకుంటాం.
విశాలాక్షి: సర్పదీవికి వెళ్లిన ముగ్గురు విడిపోయారు.
దురంధర: మరి విడిపోతే గాయత్రీ, ఉలూచి కలిసే వచ్చారు కదా.
విశాలాక్షి: నేను విషయం చెప్తా మీరు వివరాలు తెలుసుకోండి. ఒక్కోక్కరు ఒక్కో దారికి వెళ్తే గాయత్రీ దేవి ఆత్మ బలం వల్ల గాయత్రీ పాపని గురువుగారు ఇంటికి తీసుకెళ్లారు.
వల్లభ: మరి ఉలూచి.
విశాల్: ఉలూచి కూడా వాళ్లతోనే వచ్చింది మనం ముందు అమ్మ జాడ తెలుసుకోవాలి.
విశాలాక్షి: తిలోత్తమ అమ్మ కూడా వాళ్లలానే ఎలాగోలా బయట పడింది. ఎలా అన్నది ఎలా ఉన్నది అనేది మీరు తెలుసుకోవాల్సిన అంశం.
విశాల్: ఎలా.
విక్రాంత్: ఉలూచిలా అమ్మ రూపం కూడా మారిపోయింది అంటున్నారు ఎలా మరి.
విశాల్: రేయ్ మనం గుర్తు పట్టకపోయినా అమ్మ మాత్రం మనల్ని గుర్తు పడుతుంది కదా.
విశాలాక్షి: చెప్పాను కదా ఇక నేను వెళ్లొచ్చా.
సుమన: అత్తయ్య వచ్చే వరకు నువ్వు వెళ్లడానికి వీలులేదు.
గురువుగారు: సుమన విశాలాక్షి వెళ్తే కానీ తిలోత్తమ రాదు.
వల్లభ: అమ్మరాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు. విశాలాక్షి వెళ్లిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు.
గురువుగారు: నేను బాధ్యత వహిస్తాను. తిలోత్తమ తిరిగిరాకపోతే నేను సంజాయిషీ ఇస్తాను.
విశాలాక్షి: వెళ్లే ముందు ఒక మాట. జీవితంలో ఎదురయ్యే ప్రతీ దాన్ని స్వీకరించే ధైర్యం ఉంటేనే మీరు అనుకున్నది నెరవేరుతుంది. లేదంటే మీ నీడకు కూడా మీరు భయపడతారు. వెళ్లొస్తాను.
రాత్రి గంటలమ్మ మళ్లీ వల్లభ దగ్గరకు వస్తుంది. వల్లభ భయంతో వణికిపోతాడు.గాయత్రీ దేవిని బంధించి తీసుకెళ్తానని అంటుంది. గాయత్రీ పాప నుంచి గాయత్రీ దేవి ఆత్మ బయటకు వచ్చి పాప పడుకుంటేనే తాను గంటలమ్మను తరిమికొట్టగలనని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.