Trinayani Serial Today January 3rd Episode - 'త్రినయని' సీరియల్: తిలోత్తమకు గట్టి షాక్,. కొరియర్‌లో గాయత్రీదేవి టేప్ రికార్డర్‌తో పాటు లాంతరు గిఫ్ట్!
Trinayani Today Episode గాయత్రీ దేవి వాడిన టేప్ రికార్డర్‌తో పాటు తిలోత్తమ దొంగతనం చేసిన లాంతరు ఇప్పుడు తిలోత్తమ కోసం ఎవరో కొరియర్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Telugu Serial Today Episode
హాసిని: నాకు ఎందుకో అత్తయ్య, మా ఆయన మీద అనుమానంగా ఉంది. ఒకసారి గుడి దగ్గర ఉండే సీసీ కెమెరా ఫుటేజీ తెచ్చి చూస్తే మంచిది.
తిలోత్తమ: అనవసరంగా అబండాలు వేస్తే బాగోదు చెప్తున్నా.
ఇంతలో నాగులాపురం నుంచి తిలోత్తమ పేరుమీద ఓ పోస్ట్ వస్తుంది. విశాల్ దాన్ని తెరచి చూస్తే అందులో ఓ లాంతరు వస్తుంది. ఇక దాన్ని చూసిన తిలోత్తమ నో అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ ఏమైందని అడుగుతారు. ఇక ఆ లాంతరు ఎవరు పంపించారు అని అనుకుంటుంటారు. ఇక ఆ బాక్స్‌లో చిన్న టేప్ రికార్డర్ కూడా ఉంటుంది.
గతంలోకి..
తిలోత్తమ గాయత్రీదేవి దగ్గర పీఏగా పనిచేసినప్పుడు విశాల్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ టేప్ రికార్డర్ పట్టుకొని తిలోత్తమ దగ్గరకు వస్తాడు. తన మమ్మీ పాటలు పాడినప్పుడు అందులో రికార్డ్ చేస్తుందని.. అది నీ రూమ్‌లో ఉందని చెప్పి తిలోత్తమకు చూపిస్తాడు. దాన్ని చూసిన తిలోత్తమ గాయత్రీ మేడం ఇది నా రూంలో ఎందుకు పెట్టారు. నా మీద అనుమానం వచ్చిందా అని అనుకుంటుంది.
ప్రస్తుతం..
విశాల్: ఇది చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇచ్చింది.
నయని: క్యాసెట్ కూడా ఉంది ఆన్ చేయండి విక్రాంత్ బాబు.
గాయత్రీ దేవి వాయిస్..
"హాయ్ తిలోత్తమ వినిపిస్తుంది కదా తిలోత్తమ.. ఆల్‌రైట్.. ఇదంతా నేను ఎందుకు వినిపిస్తున్నాను అంటే నీకో సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇద్దామని.. నర్శింహామూర్తి గారి కంపెనీకి వెళ్లే దారిలో విద్యారణ్యస్వామి వారి ఆశ్రమం దగ్గర ఆగాం. అక్కడ ఆగాం. అక్కడును ఈ లాంతరును ఎవరికీ చెప్పకుండా నువ్వు కారులో పెట్టినందుకు తిట్లు తిన్నావ్ గుర్తుందా.. ఆ పని ఎందుకు చేశావ్ అని అడిగితే ముచ్చటపడి చేశాను అన్నావు. మూడు నెలల తర్వాత నేను విద్యారణ్య స్వామి వారిని కలిశాను. ఈ లాంతరు నీ గిఫ్ట్‌గా ఇవ్వడానికి అయినా కావాలని అడిగి తీసుకున్నా. నీ భర్త్‌డే రోజు నీకు ఇవ్వాలని ప్లాన్ చేశాను కానీ.. " ఇక టేప్ రికార్డర్ ఆగిపోతుంది. మరి వాయిస్ రాదు. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ రకరకాలుగా తమ అనుమానాలను వ్యక్తపరుస్తారు. అయితే తన తల్లి ఆ లాంతరును తిలోత్తమకు గిఫ్ట్‌గా ఇచ్చిందని విశాల్ చెప్తాడు.
తిలోత్తమ: వీడికి అన్నీ గుర్తున్నట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు ఉన్నారు.
గురువుగారు: నయని ఆ లాంతరు నువ్వు తీసుకో.
తిలోత్తమ: అదేంటి గురువుగారు అది నా గిఫ్ట్ కదా..
గురువుగారు: నువ్వు పారేసుకున్నాక అది నీది కాదు తిలోత్తమ..
హాసిని: పారేసుకున్నారా.. అంత మోజుపడిన దాన్ని పారేసుకున్నారు అంతే సంథింగ్ ఏదో ఉండే ఉండాలి.
నయని: బాబుగారు బాక్స్‌లో పెట్టండి.. జాగ్రత్తగా దాచిపెడదాం.
డమ్మక్క: లాంతరును చూసి ఎందుకు భయపడిందో మీ అమ్మ చెప్పనేలేదు.
ఇక తిలోత్తమ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక హాసిని తిలోత్తమ గదికి నీరు తీసుకెళ్లి ఇచ్చి.. సెటైర్లు వేస్తుంది. తిలోత్తమ భయపడుతుందని అంటుంది. ఇక హాసిని కొన్ని ప్రశ్నలను మీకు మీరే వేసుకోవాలి అత్తయ్య అంటుంది. ఇక వల్లభ హాసినిని తిట్టి వెళ్లిపోమని చెప్తే తిలోత్తమ పిలిచి ఆ ప్రశ్నలు ఏంటి అని అడుగుతుంది.
హాసిని: 1. సుమారు 21 ఏళ్ల కిందట మీరు పారేసుకున్న లాంతరు ఇప్పుడు ఎలా వచ్చింది. 2. మీ మమ్మీ లాంతరు ఎక్కడో పారేసుకుంటే అది నాగులాపురం నుంచి ఎలా వస్తుంది. 3. లాంతరు మీరు ఇచ్చినట్లు విశాల్‌కి గుర్తుంటే మరి అతను కాకుండా ఇంకెవరు మీ పేరు మీద కొరియర్ చేస్తారు.
తిలోత్తమ: తింగరి కోడలు చాలా తెలివిగా ఆలోచించి చెప్పిందిరా లోతుగా వెళ్తే అర్థమవుతుంది.
గురువుగారు: విశాలా.. లాంతరు పంపింది నువ్వేనా..
విశాల్: నేను కాదు గురువుగారు.
గురువుగారు: ఆశ్చర్యంగా ఉందే.. విక్రాంతా నువ్వా..
విక్రాంత్: నేను లాంతరు చూడటం ఇదే మొదటి సారి గురువుగారు.
పావనా: గంగాధరం ఏమైనా కొరియర్ చేసుంటాడా..
విశాల్: నో.నో..అందులో వాక్‌మెన్‌ను అమ్మ వాడేది అని నాకు తప్ప ఎవరికీ తెలీదు. నేను నయనీకి కూడా చెప్పలేదు.
గురువుగారు: నయనీకి కూడా తెలీదు అంటే.. ఇంకెవరు పంపించుంటారు అంతు పట్టడం లేదు. ఏదైనా ఆపదో.. ఆటంకమో వస్తే అమ్మవారి క్రుపతో పరోక్షంగా సూచించగలను కానీ ఇలాంటి విషయాలు చెప్పడం కష్టం.
విశాల్: స్వామి తిలోత్తమ అమ్మ గురించి మా ముగ్గురుకి బాగా తెలుసు. కానీ మాకు తెలుసు అన్న విషయం తనకు తెలీదు. ఇప్పుడు లాంతరు గురించి మేము ఎవరైనా తెలుసుకుంటామని తను చాలా టెన్షన్ పడుతుంది అనుకుంటా.
గురువుగారు: అసలు దాని వల్ల ఏం జరుగుతుందో.. ఏం జరగనుందో మీకు తెలీదు విశాలా.. అది మీరే తెలుసుకుంటారు. నయని లాంతరు జాగ్రత్తగా పెట్టావు కదా.. అందులో కిరోసిన్ ఉంటుంది. పెట్టెలో పెట్టి తాళం వేయొద్దు. ఇక నయని దాని గురించి తనకు ఏం తెలీదు అని.. గాయత్రీ దేవి గారు కూడా ఏం చెప్పలేదు అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Read Also: ‘హనుమాన్’ను రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ