Trinayani Serial Today January 24th: గాయత్రీ దేవి జాడ తెలుసుకోవడానికి తిలోత్తమకు మరో అవకాశం.. ఆ పెట్టె తెరిచిన విశాల్!
Trinayani Serial Today Episode: స్టోర్ రూంలో ఉన్న గాయత్రీ దేవి తాళూక పెట్టెను విశాల్ చేత తిలోత్తమ తెరిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Telugu Serial Today Episode: నయని గురువుగారికి వస్త్రధానం చేస్తుంది. ఇక సుమన గురువుగారికి దానం ఇద్దామని ఉప్పు కలిపిన నల్లనువ్వులు, జిమ్మి ఆకులు తీసుకొచ్చి ఆయనకు ఇవ్వకుండా గాయత్రీపాప మీద వేసేస్తుంది. అందరూ సుమనను అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా పాప మీద వేసేస్తుంది.
నయని: సుమన శనీశ్వరుడికి సమర్పించాల్సినవి పసిబిడ్డ మీద తల మీద వేస్తావా..
సుమన: దరిద్రపు బతుకు బతికిన ఈ పిల్లని లక్ష్మీ దేవిని చేశాకా ఇంకేంటి ప్రాబ్లమ్ అని సుమన అనగానే నయని లాగిపెట్టి ఒకటి కొడుతుంది.
గురువుగారు: నయని ఆవేశపడకు.
నయని: క్షమించండి స్వామి.. మహాజ్జాతకురాలు అని మీరే చెప్పాక గాయత్రీ పాపని హీనంగా చూస్తే నా చెల్లెలు అని కూడా చూడను.
సుమన: అవే స్వామి వారి పాదాల మీద వేస్తే కొట్టేవారు కాదు కదా.. నువ్వేలా చేయి చేసుకుంటావ్.
హాసిని: మహాత్ములకు ఏ పాపం అంటదు. అయినా కాళ్లమీద పోయాల్సినవి పాప తలమీద పోస్తే నీ తలపొగరు దించరా ఏంటి.
తిలోత్తమ: తనకు మంచి జరగాలి అని అలా చేసి ఉండొచ్చు.
విశాల్: పసి పిల్లల మీద అక్కసు తప్ప ఆశీర్వాదం ఆశపడలేదు అమ్మా.
విక్రాంత్: దాన్ని లాగి పడేయండి బ్రో.
ధురందర: సుమన నువ్వు లోపలికి వెళ్లు అందరూ కలిసి నిన్ను కొట్టేలా ఉన్నారు.
డమ్మక్క: అసలు విషయం దారి మళ్లింది.
విక్రాంత్: ఏం సాధించావే నువ్వు.. ముఖం చిట్టించి చూడకు పగిలిపోతుంది దవడ.
సుమన: నా చెంప ఏమైనా చాకిరేవు బండ అనుకున్నారా ప్రతీ వాళ్లు ఉతికేసి పోతున్నారు.
విక్రాంత్: నయని వదిన ఉతికింది నేను ఆరేస్తా ఇప్పుడు.
సుమన: గొడవ పెట్టుకోవడానికే మీరు వచ్చుంటే మీరు గదిలోకి రాకుండి వెళ్లిపోండి.
విక్రాంత్: నేను ఎక్కడికి వెళ్లాలి ఇది మా బ్రో ఇళ్లు.
సుమన: బ్రో.. బ్రో అని పిలిచే విశాల్ బావ గారు మీ అమ్మకి పుట్టిన వాడు కాదు. అదే నేను అనుకోండి మా అక్కకి తోడబుట్టిన దాన్ని. మీ కన్నా నాకే ఎక్కువ హక్కు ఉంది.
విక్రాంత్: ఉండటానికి కాదే వండటానికి కూడా నువ్వు పనికిరావు. నీకు హక్కు ఉంద అని చెప్పుకోవడాని కంటే ఆరుబయట ఉన్న కుక్కకు ఇచ్చే విలువ కూడా నీకు ఇవ్వరు అని చెప్పుకో. నిజం అని చెప్పట్లు కొడతారు. చెంప మీద కొట్టడం తగ్గిస్తారు.
సుమన: నేను చేసింది మంచి పనే.. గాయత్రీ పాప గొప్పగా బతుకుతుందని అందరూ అంటే నేను వాటిని పాప నెత్తిన వేసి నా కష్టాలు తొలగిపోవాలి అని అనుకున్నాను.
విక్రాంత్: నువ్వు చేసినవి అప్పులు కాదు ఘోరాలు.. పాపాలు.. అవి ఎంతో మంది నీకు ఇచ్చిన శాపాలు.. కొంచెం బుద్ధి జ్ఞానం పొంది మెసలుకో. నీ పిచ్చి చేష్టలకు నన్ను చూసి నవ్వుతున్నారే నీ పెళ్లాం ఎందుకు ఇలా చేస్తుంది అని.
సుమన: పక్కవారు నేను మీ భార్యని అని గుర్తుపట్టారు కానీ మీరు గుర్తుంచుకోవడం
లేదు.
నయని: సుమన ఎందుకు అలా చేస్తుందో అర్థమేకాదు అక్క.
హాసిని: మనలో మన మాట ఇది బ్రహ్మరాక్షసి పని అంటావా..
నయని: తిలోత్తమ అత్తయ్య అంటావా.. అత్తయ్య కాదు కదా అలా చేసింది.
విశాల్: అలా చేస్తే అమ్మకు వచ్చిన లాభం ఏంటి వదినా. ఎవరు ఏం చేసినా అమ్మకు ఏం కాదు వదినా..
నయని: ఏ అమ్మ బాబుగారు. సుమన అలా చేసినందుకు ఏదైనా అయితే పాపకు ఏం కాదు అని చెప్పాలి కానీ అమ్మకు ఏం కాదు అని చెప్తున్నారు బాబుగారు.
విశాల్: అదే నయని ఇవాళ గాయత్రీ పాపని మా అమ్మ అనుకోమన్నారు కదా స్వామిగారు. నయని ఈ విషయం వదిలేయండి.. స్టోర్ రూం తాళాలు ఎక్కడ. ఎవరికీ చెప్పలేదా..
నయని: లెథర్ బ్యాగ్‌లో ఉన్నాయి. అక్కడ ఉన్నట్లు మీకు నాకు ఇప్పుడు అక్కకి తప్ప మరెవరికీ తెలీదు.
హాసిని: ఏమైంది విశాల్.
విశాల్: జేబులో నుంచి తీసి.. లెథర్ బ్యాగ్‌లో ఉండాల్సిన తాళాలు నీ హ్యాండ్ బ్యాగులో దొరికాయి వదిన.
హాసిని: అమ్మ బాబోయ్.. ఇదేంటి విశాల్.. చెల్లి అవి ఏం తాళాలో కూడా నాకు తెలీదు. నా మీద ఒట్టు.
నయని: ఛా.. ఛా ఎందుకు అక్క అలా అంటావ్.. బాబుగారు ఏమైనా విలువైనవి పోయాయా..
విశాల్: పోలేదు కానీ అందులోకి ఎవరో పోయారు. వెళ్లి అక్కడ ఏం చేశారో తెలీదు కానీ తాళాలు మాత్రం నీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టారు.
నయని: ఒక్కనిమిషం బాబుగారు మన రూంలో నుంచి తీసిన తాళాలు తిరిగి అక్కడే పెడితే ఎవరికీ డౌట్ రాదు కదా..
హాసిని: అనుమానం రావాలి అనే నా బ్యాగులో పెట్టారు చెల్లి. ఇది మా ఆయన పనే.
నయని: తన వెనక ఉండే ధైర్యం తిలోత్తమ అత్తయ్య. ఏం చేయాలి అనుకుంటున్నారో మనం పసిగట్టాలి అని ఇలా చేశారు అంటే..
విశాల్: మనసులో.. స్టోర్ రూంలోకి నా కన్న తల్లి జ్ఞాపకాల కోసమే వెళ్లి ఉంటారు.
తిలోత్తమ: అఖండ స్వామితో.. విశాల్ గదిలో నుంచి తాళాలు తీసుకొని స్టోర్ రూంలోకి వెళ్లాం. అక్కడ మూట కట్టిన పెట్టె ఏంటా అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
అఖండ: అందులో నువ్వు హత్య చేసిన గాయత్రీ దేవి గుర్తులు ఉన్నాయి తిలోత్తమ. తెలుసుకొనే దారి దొరికింది.
తిలోత్తమ: రాత్రి కలలోకి గాయత్రీ అక్కయ్య వచ్చింది స్వామి.
అఖండ: కలలో అప్రమత్తంగా ఉన్న మీరు తెలీకుండానే గాయత్రీ దేవి గుర్తులు ఉన్న చోటకే వెళ్లారు. విధి మిమల్ని అటుగా అడుగులు వేయించింది. ఈ పూటకు గాయత్రీ దేవిలా ఉండనున్న ఆ పసి పాప ద్వార మీకు నిజం తెలిసే అవకాశం వచ్చినట్లే తిలోత్తమ. గాయత్రీ దేవి ఎవరో ఎక్కడ నీడై నీ మీద పడగ విప్పి నిల్చొని ఉందో తెలుసుకునే దారి దొరికింది. మీరు చూసిన మూట విప్పితే గాయత్రీ దేవి తాళూకు వస్తువుల్లో ఏదైనా కానీ గాయత్రీ పాప మెడలో వేయండి. ఆ మూటను మీరు విప్పకూడదు. విశాల్ బాబే విప్పాలి. గాయత్రీ దేవి వస్తువులను తిలోత్తమ తాకరాదు.
తిలోత్తమ: అర్థమైంది స్వామి నా ఈ చేతులకు గాయత్రీ అక్కయ్య రక్తం అంటింది కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. గాయత్రీ అక్క జాడను పట్టుకొని వస్తాం.
అఖండ: అక్కడ ఏం జరగబోతుందో ఎవరూ ఊహించలేరు.
తిలోత్తమ అందర్ని హాల్‌లోకి రమ్మని చెప్తుంది. గురువుగారిని కూడా పిలుస్తుంది. ఇంతలో విశాల్ పెట్టె పట్టుకొని వస్తాడు. ఇప్పుడు ఎందుకు దాన్ని బయటకు తీశారని గురువుగారు అడుగుతారు. దానికి విశాల్ ఈ అమ్మే మా అమ్మ గుర్తులను బయటకు తీసుకురమ్మని చెప్పింది స్వామి అని చెప్తాడు. ఏముందు అందులో నయని అడుగుతుంది. ఇక విశాల్ మూట విప్పుతాడు. ఆ పెట్టెను ఓపెన్ చేస్తే రకరకాల ఇబ్బందులు రావొచ్చు అని తిలోత్తమ అంటుంది. గురువుగారు కూడా తెరవమని చెప్తారు. విశాల్ పెట్టె తెరవగానే అందులో గాయత్రీ దేవి ఫొటోలో ఉన్న చీర ఉంటుంది. అందరూ గాయత్రీ అమ్మ చీర అని నయని ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో గాయత్రీ దేవి చీరలు అన్ని ఉండగా ఈ చీరను ఇంత భద్రంగా ఎందుకు ఉంచారని హాసిని అడుతుంది. దానికి విశాల్ అమ్మ చివరి సారిగా కట్టిన చీర ఇది అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.