Trinayani Serial Today January 22nd: గాయత్రీ దేవి ఫొటో తగలబెట్టేయాలన్న తిలోత్తమ ప్లాన్‌ను తిప్పికొట్టిన గాయత్రీ పాప!
Trinayani Serial Today Episode: గాయత్రీ దేవి ఫొటోని కాల్చేయాలి అని తిలోత్తమ ప్లాన్ చేయగా లాంతరు నుంచి కిరోసిన్ తిలోత్తమ మీద పడేలా గాయత్రీ పాప ప్లాన్ చేయడంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: ఇంట్లో అందరూ విశాల్‌కు పునర్జన్మలో పుట్టిన తన తల్లి ఎవరూ అని ప్రశ్నించగా విశాల్ విశాలాక్షి వైపునకు చూపిస్తాడు. అందరూ షాక్ అవడంతో పాటు. తన అక్క పెళ్లి జరిగి నాలుగేళ్లు అవుతుంటే పదేళ్ల బిడ్డ ఎలా ఉంటుంది అని సుమన ప్రశ్నింస్తుంది. ఇక తిలోత్తమ కూడా నయని మీద ఒట్టు వేశావ్ నిజం చెప్పు విశాల్ అని నిలదీస్తుంది.
నయని: బాబు గారు మన బిడ్డ విషయంలో ముఖ్యంగా అమ్మగారి విషయంలో మీరు తమాషా చేయరు ఇలా ఎందుకు చెప్తున్నారు.
విశాల్: నయని నేను నిజమే చెప్తున్నా ఆ రోజు గుడిలో విశాలాక్షినే మా అమ్మ గాయత్రీ దేవిలా కనిపించింది. అందుకే తననే మా అమ్మ అనుకున్నాను.
డమ్మక్క: గాయత్రీ అమ్మలా విశాలాక్షి అమ్మ కనిపించకూడదా ఏంటి.
విశాల్: పసిపిల్లలానే కనిపించింది.
హాసిని: విశాలాక్షినే తన అమ్మగా భ్రమపడుతున్నాడు విశాల్ అందుకే ధైర్యంగా ప్రమాణం చేసి మరీ చెప్పాడు. నమ్మకపోతే తనేం చేస్తాడు పాపం.
విక్రాంత్: విశాలాక్షి గారడి చేస్తుంది అని అందరికీ తెలుసుకదా బ్రోకి పెద్దమ్మలా కనిపించిందేమో.
తిలోత్తమ: కనిపించింది సరే ఏ రూపంలో.. చిన్న పిల్ల అయినా రూపం ఉంటుంది కదా..
ఎద్దులయ్య: మాయా రూపం పెద్దమాత.
డమ్మక్క: నేను మొన్నే చెప్పాను. మా అమ్మ చిన్న పిల్లలా ఇంటికి వస్తుంది అని మీకు అర్థమైందా..
విశాలాక్షి: చూసే కళ్లను బట్టి నేను కనిపిస్తాను. వెళ్లొస్తాను. అమ్మా నిజం చెప్పిన నాన్నని ఇబ్బంది పెట్టకు. ఎవరి తెలివితో వాళ్లు ఆలోచించండి అర్థమవుతుంది. వెళ్లొస్తాను.
నయని: మిమల్ని అపార్థం చేసుకున్నందుకు బాధ పడ్డారు కదూ.
విశాల్: నయని నువ్వు అర్థం చేసుకున్నందుకే ఇలా అడుగుతున్నావ్. మా అమ్మ ఫొటోకి కాకుండా నీ మీద ఒట్టు వేసి చెప్పమన్నప్పుడు ఇద్దరికీ తేడా ఏంటి నయని ఇలా చేస్తుందా అని కొంచెం ఫీలయ్యాను.
నయని: నేను ఇంకో జన్మ ఎత్తుతానో లేదో తెలీదు బాబుగారు. అమ్మగారు అయితే పునర్జన్మ ఎత్తారు. మన బిడ్డగా మన దగ్గరకు రావాలి అనుకున్నప్పుడు తన మీద ప్రమాణం చేయడం వల్ల ఏ నష్టం జరుగుతుందా అని భయపడ్డాను.
హాసిని: మీ ఇద్దరిదీ ప్రేమ. అమ్మవారి పేరు పెట్టుకున్న విశాలాక్షిది గాయత్రీ అమ్మగారి భక్తి అనుకుంటా. అందుకే ఒకరికి ఇంకొకలా కనిపించి సంతోష పెట్టారు కానీ అందర్నీ భ్రమలోకి నెట్టేశారు.
నయని: నాకు అయితే క్లారిటీ వచ్చేసింది అక్క. విశాలాక్షి గారడి చేస్తుంది కదా అమ్మగారి ఆత్మలా కనిపించింది లేక పసిబిడ్డలా కనిపించిందా ఆ విషయం కోసమే ఆరా తీయాలి అని.
విశాల్: నయని ఇప్పుడు చెప్తే ఎలా.. విశాలాక్షి వెళ్లిపోయింది కదా..
నయని: చెప్పాల్సింది మీరు బాబుగారు. కనిపించింది మీరే కదా..
హాసిని: చెప్పు విశాల్ ఆత్మలా కనిపించింది కదా..
నయని: అయినా అలా కనిపించే అవకాశం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకుంటే అమ్మగారు బతికే ఉన్నారు కదా..
విశాల్: అవును చిన్నపిల్లలానే కనిపించింది మా అమ్మ.
నయని: రూపురేఖలు చూశారు కాబట్టి ఆ రూపంలో ఉన్న పసిబిడ్డను వెతుక్కుంటూ పోతే ఆ రూపంలో ఉన్న పసిపిల్ల కనబడుతుంది కదా బాబుగారు.
హాసిని: చిన్నపిల్లల ముఖ కలయికలు పోల్చుకోవడం కష్టం కదా నయని.
నయని: అలాంటప్పుడు ఆ పాపే అమ్మగారు అని ఎలా చెప్పగల్గుతారు.
విశాల్: నయని విశాలాక్షినే చంటి పాపలా నాకు కనిపించడంతో మా అమ్మని చూడాలి అన్న నా కోరిక తీర్చడానికి తను అలా కనిపించేసరికి నేను అలా ఫీల్ అయ్యాను. ఆ పాప ఎలా ఉంది అంటే గాయత్రీ పాపలా ఉంది.
నయని: గానవిలా ఉండాలి కానీ గాయత్రీ పాపలా ఉండటం ఏంటి.
తిలోత్తమ: గాయత్రీ దేవి ఫొటో పట్టుకొని వల్లభతో.. గాయత్రీ అక్కయ్య పసిబిడ్డలా వస్తే నా ఒళ్లో కూర్చొబెట్టుకొని చరమగీతం పాడేదాన్నిరా. ఇంకెప్పుడు లేచేదే కాదు. అంటూ తన చేతిలో ఉన్న స్ఫ్రే కొడుతుంది. ఆ ప్లేమబుల్ స్ఫ్రేకు దగ్గరగా మంట వస్తే ఆ ఫొటో కాలిపోతుంది.
వల్లభ: అలా చేస్తే..
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్యకు కీడు జరగడానికి ఇది సంకేతం అంటాం.
వల్లభ: ఓ దెబ్బకు పెద్దమరదలు నయని విశాల్‌ను కంగారు పెడుతుంది. మనల్ని కన్ఫ్యూజ్ పడేసిన విశాల్ క్లారిటీకి వస్తాడు.
తిలోత్తమ: కరెక్ట్. మరోవైపు గాయత్రీ పాప మేడ మీద నుంచి చూస్తూ ఉంటుంది.
ఎద్దులయ్య: ఇక్కడి నుంచి పాపిస్టి వాళ్లు ఏం చేయాలి అనుకుంటున్నారో చూస్తున్నావా గాయత్రీ అమ్మ. నువ్వు ఏం చేయాలి అనుకున్నావో గ్రహించే ఈ లాంతరు తీసుకొచ్చా.. నువ్వేం చేయాలి అనుకుంటున్నావో చేయ్ మాత. ఇదిగో లాంతరు.
తిలోత్తమ: సుమన వచ్చింది. సుమన నువ్వు వెళ్లి దిష్టి హారతి తీసుకురా..
పావనా: దిష్టి ఎవరికి అక్క.
తిలోత్తమ: ఉలూచికి కాదు. గాయత్రీ అక్కకి.
విశాల్: ఫొటోకి దిష్టి తీయడం ఏంటి.
తిలోత్తమ: ప్రామిస్ చేయమని మీ అమ్మని మేము.. ప్రాణంతో లేదు అని శార్థకర్మల కోసం సుమన ఎవరికి వాళ్లు పొరపాటు చేశాం. అందుకే ఒకసారి దిష్టి తీస్తే మంచిది అనిపించింది.
సుమన: అవును అత్తయ్య నేను అలా చేసినందుకే కదా విశాల్ బావగారు నా మీద చేయి చేసుకోవడం మా అక్క రివాల్వర్‌తో షూట్ చేయడానికి రెడీ అయిపోవడం జరిగింది. మీరు అన్నట్లు పెద్దత్తయ్యకి దిష్టి తీసి దండం పెట్టుకొని నీ జోలికి రాము తల్లీ అంటే సరిపోతుంది కదా.
విక్రాంత్: ఎప్పుడూ లేనిది వీళ్లకి ఏంటి ఇంత బుద్ధి వచ్చింది.
నయని: అత్తయ్య అమ్మగారి ఫొటో ఎంత సేపు అని చేతిలో పట్టుకుంటారు నాకు ఇవ్వండి గోడకి తగిలిస్తాను.
వల్లభ: పెద్ద మరదలా నేను ఉన్నాకదా నేను పెడతానులే.
మరోవైపు గాయత్రీ పాప లాంతరు నుంచి కిరోసిన్ తిలోత్తమ చీర మీద పడేలా పెడుతుంది. ఆ విషయం తిలోత్తమకు తెలీదు. ఇక ఫొటో గోడకు తగిలించేందుకు వల్లభ తీసుకెళ్లి ఉలూచిని తిలోత్తమకు ఇస్తాడు. తిలోత్తమ ఉలూచికి పాలు పడుతుంటుంది.
ఎద్దులయ్య: ఏదో వాసన వస్తోంది మాతా గ్రహించారా..
విశాల్: ఏం వాసన ఎద్దులయ్య.
తిలోత్తమ: ఎద్దులయ్య గ్రహించినట్లు ఉన్నాడు.
నయని: కిరోసిన్ ఆయిల్ వాసన వస్తోంది.
ఎద్దులయ్య: అవును మాతా అదే..
విక్రాంత్: ఇక్కడెక్కడా పడినట్లు కనిపించడం లేదే.
వల్లభ: మమ్మీ చిన్న మరదలు దిష్టి తీసుకొచ్చింది.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్య ఫొటోకి చూపి మూడు సార్లు తిప్పి దిష్టి తీయమను. సుమన ఫొటోకి దిష్టి తీయడానికి రెడీ అవుతున్నప్పుడు హాసిని వచ్చి ఆగు చిట్టీ ముందు దేవుడి హారతి తీసుకో అని తాను తెచ్చిన హారతి చూపిస్తుంది. ఇక నయని తిలోత్తమ చీర మీద కిరోసిన్ పడటం చూసి అత్తయ్య కిరోసిన్ ఎక్కడో రావడం లేదు మీ చీర కొంగు తడిగా ఉంది చూడండి అంటుంది. తిలోత్తమ చూసి షాకు అవుతుంది. దీంతో ముందు మీరే హారతి తీసుకోండి అని హాసిని తిలోత్తమ వెనక పడుతుంది. అందరూ హాసినిని ఆపడానికి ప్రయత్నిస్తారు. హాసిని తిలోత్తమ వెంట పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సీతే రాముడి కట్నం సీరియల్ జనవరి 20th: రామ్ భార్యగా మధుమిత.. ఆల్బమ్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన సీత!