Trinayani Serial Today February 20th: 'త్రినయని' సీరియల్: నిజం చెప్పేస్తా అన్న గురువుగారు.. గాయత్రీనే తన తల్లి అని నయనితో చెప్పిన విశాల్!
Trinayani Serial Today Episode గాయత్రీ పాపని ఇంట్లో నుంచి పంపేస్తా అని నయని అనడంతో పాపే నా తల్లి అని విశాల్ ఓపెన్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode నయని గాయత్రీ పాపని పట్టుకొని ఏడుస్తుంది. సమయానికి నాగయ్య పాము రాకపోయి ఉంటే సుమన నిన్ను ఎక్కడ పడేసేదో తలచుకుంటేనే బాధేస్తోంది అని గాయత్రీ పాపతో చెప్తూ విలవిల్లాడిపోతుంది. నీకేం కాలేదు అని అంటుంది. ఇంతలో విశాల్ వచ్చి ఏం కాదు కూడా అని అంటాడు.
నయని: బాబుగారు నేను చెప్తూనే ఉన్నాను అందరికీ గాయత్రీ పాప మీదే అసూయ ఉంది అని. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా క్షేమంగా ఉంటుంది ఏమో ప్రయత్నించండి అని అంటే మీరు వద్దు అన్నారు.
విశాల్: దత్తత తీసుకున్న గాయత్రీని బయట ఎక్కడైనా పెడితే బాగుంటుంది అని పైకి అంటున్నావ్ కానీ వదిలేసే దానివే అయితే అలా గుండెలకు హత్తుకోవు నయని.
నయని: ఏం చేయను రోజుల పాపగా ఉన్నప్పుడు పరిచయం అయిన ఈ బంగారు తల్లికి నా పాలే పట్టి నా బిడ్డగానే చూసుకున్నాను. గాయత్రీ అమ్మగారు నా దగ్గరకు ఎప్పుడు వస్తారో గానీ తన పేరు పెట్టుకున్న ఈ పాప ముందే వచ్చిందని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు తిలోత్తమ అత్తయ్య కావొచ్చు, నా చెల్లే కావొచ్చు పసి పిల్ల అని చూడకుండా ద్వేషం పెంచుకోవడం చూస్తుంటే ఎప్పుడు ఏం చేస్తారో అని భయం వేస్తుంది బాబుగారు.
విశాల్: నయని గాయత్రీని బలవంతంగా తీసుకున్న సుమన గడపదాటాలి అనుకుంది కానీ ఆ పని చేయొద్దు అని చేయనివ్వను అని నోరు లేని పామే అడ్డంగా నిలబడింది అంటే మన బిడ్డగా దత్తత తీసుకున్న మనం ఎంత భరోసా ఇవ్వాలి పాపకి.
నయని: గాయత్రీని కంటికి రెప్పలా మనం చూసుకుంటాం. కానీ బయట వాళ్లు పాప మీద కక్ష పెంచుకుంటున్నారు. తన పేరిట ఆస్తి ఉందని సుమన, గాయత్రీ అమ్మగారి పేరు ఉంటడం వల్లే అప్పుడప్పుడు తనకు గాయాలు అవుతున్నాయి అని తిలోత్తమ అత్తయ్య ఆరోపిస్తున్నారు.
విశాల్: కరెక్టే కానీ వాళ్లని అలా అనుకోనివ్వు. నేను పాపని దూరం పెట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించలేను.
నయని: ఎందుకు అంత ప్రేమ పెంచుకున్నారు.
విశాల్: ఎందుకు అంటే మా అమ్మ కాబట్టి. నయని మా అమ్మ ఇంటికి వచ్చేంత వరకు ఈ గాయత్రీనే మా అమ్మ అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇంకెప్పుడూ పాపని వదిలేసి వద్దామని నువ్వు అనుకోవు అనుకుంటున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు అయినా ప్లీజ్.
సుమన: ఉలూచి పాపని ఒక్క పూట కూడా సరిగా చూసుకోలేక ఆఫీస్‌కు తీసుకొచ్చి నా భవిష్యత్ నాశనం చేసిన మీరు ఉలూచిని వదిలి నన్ను వెళ్లిపోమంటారా..
విక్రాంత్: అబ్బా మెంటల్ దానా మందులు వేసుకో అంటే ఏదేదో అంటున్నావ్.. ఇవిగో మందులు నీకు నచ్చితే వేసుకో లేకపోతే చావు..
సుమన: నేను చావను బతుకుతా.. ఎంత గొప్పగా బతుకుతా అంటే మీ అందరూ నన్ను చూసి ఓర్వలేనంతగా..
విక్రాంత్: ఆల్రెడీ హాస్పిటల్‌లో చేశావ్ కదా.. విక్రాంత్ గాడి పెళ్లి హాస్పిటల్ నుంచి పేషెంట్ డ్రెస్‌లో పారిపోయింది అని వీడియోలు పెడుతున్నారు.
సుమన: ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యంగా మా అక్క నన్ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించినా ఇంకా బతికేఉన్నాను చూడమని ఆ రూపంలోనే వచ్చాను.
విక్రాంత్: ఏం మనిషివే నువ్వు ఎవరు ఎలాంటి వారో తెలీదు.. నయని వదిన ప్రాణం పోస్తుంది కానీ తీయదు. నేను దేవత అని అనడం కాదే తనెప్పుడో ఎంతో మంది దృష్టిలో దేవత అయింది.
సుమన: కానీ నాకు గండం వస్తుంది అని చెప్పలేదు.
విక్రాంత్: ఉలూచి పాప ఉండటం వల్లే నీ ఆయుష్షు ఇంకా ఉంది. లేదంటే నా చేతుల్లోనే పోయేదానివి.
సుమన: నా మొగుడే నన్ను హింసించి ద్వేషించేలా చేసింది అన్న మాట నాకు అవకాశం రాకపోదు.
వల్లభ: ఎద్దులయ్య, డమ్మక్కలను చూసి సుమన గల్లంతు అయి ఉంటే మళ్లీ ఇటు వచ్చేవారు కాదేమో..
సుమన: నేను ఇంకా కేసు వేయలేదు ఆలోచించండి.
విశాల్: సుమన ఈ ఇంటి పరువు తీయాలి అనే ఆలోచిన మానుకుంటే మంచిది.
సుమన: ప్రాణాలు తీయాలి అనుకుంటే తప్పు లేదు కానీ నేను అంటే తప్పా.
గురువుగారు: ఎవరు ఎవరి ప్రాణాలు తీయాలి అనుకున్నారు సుమన.
సుమన: పాలల్లో విషం కలిపారు స్వామి.
గురువుగారు: ఎవరు..
సుమన: విశాలాక్షి అనుకుంటా..
గురువుగారు: నువ్వేలా అనుకుంటావు.
విక్రాంత్ : తను అలా అనుకుంటుంది అంతే.
విశాల్: స్వామి ప్రమాదం సుమనకే అన్న విషయం నయనీ చెప్పకపోవడం వల్ల అపార్థం చేసుకుంటుంది సుమన.
తిలోత్తమ: ఇదంతా విశాలాక్షి, నయని ఆడిన నాటకం అని చిన్నకోడలు వాదిస్తోంది గురువుగారు.
నయని: స్వామి అసలు నా దృష్టికి ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు.
గురువుగారు: న్యాయ అన్యాయాలను గమనించి విశాలాక్షి అమ్మవారే పాలలో విషం కలిపి ఉంది అన్న విషయం నీకు గ్రహించకుండా చేసింది నయని.
హాసిని: అమ్మవారు చిట్టీ చావాలి అనుకుందా అయితే.
దురంధర: నయనీకి ముందే తెలియకపోవడం వల్ల సొంత చెల్లెల్ని కాపాడలేకపోయింది కదా గురువుగారు.
ఎద్దులయ్య: ఎవరు పడిన గోతిలో వాళ్లే పడతారు అంటే ఇదే కాబోలు.
సుమన: విశాలాక్షి పేరు చెప్పి మా అక్కని కాపాడాలి అనుకుంటున్నారా స్వామి. మా అక్కేమో విశాలాక్షిని కాపాడుతుంది. నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరితో చెప్పుకోవాలి.
గురువుగారు: నయని విశాలాక్షి అమ్మని వెళ్లిపోమని చెప్పకుండా ఉండాల్సింది.
నయని: ఆవేశంతో తనని ఎవరు ఏం చేస్తారో అన్న భయంతోనే వెళ్లిపోమన్నాను అంతే కానీ వేరే ఏ ఉద్దేశం కాదు.
గురువుగారు: సుమన ప్రాణాలు తీయాలి అనుకున్నది మీలో ఎవరో కాదు. ఇక్కడున్న వాళ్లలో ఒకరు పాల్లో విషం కలిపారు.
విశాల్: అర్థం కాలేదు స్వామి. మేం ఎవరూ కాదు అంటున్నారు. మళ్లీ మాలో ఒకరు విషం కలిపారు అంటున్నారు. సూటిగా చెప్పండి స్వామి.
గురువుగారు: విషమే విషాన్ని కలిపింది.
నయని: విషం విషాన్ని కలపడం ఏంటి స్వామి.
విశాల్: ఇందులో సూక్ష్మాధర్మం ఉంది నయని.
తిలోత్తమ: సూటిగా చెప్పడం ఇష్టం లేక పరోక్షంగా చెప్తున్నారు. ఆ ఒక్కరూ ఎవరై ఉంటారు.
హాసిని: నాకు తెలుసు ఉలూచినే కలిపింది. రాత్రి అయితే పాముగా మారే ఉలూచి పాప పొరపాటున ఆ పాలల్లో విషం చిమ్మిందేమో ఎవరికి తెలుసు. విషం విషాన్ని కలపడం అంటే ఇదే కదా..
విశాల్: వదిన లాజిక్‌గా మాట్లాడింది కానీ నమ్మసక్యం కాదు.
ఎద్దులయ్య: అదంతా కాదండి విషం కలిపిన పాలు తాగుతున్నది తల్లి అని తెలిసినా ఉలూచి ఎందుకు ఊరికే ఉన్నదో అది ఆలోచించండి.
హాసిని: నాకు అర్థమైంది మనసులో విషం నింపుకున్న వారి పనే అయింటుంది.
గురువుగారు: హాసిని చాలా దగ్గరకు వచ్చింది.
నయని: స్వామి ఒకరి మీద ఒకరు నింద వేసుకోకుండా ఉండాలి అంటే మీరే నిజం చెప్పాలి.
గురువుగారు: చెప్పమంటావా సుమన..
విక్రాంత్: చెప్పండి స్వామి మీరు రావడం చాలా మంచిది అయింది లేదంటే విశాలాక్షిని తనని పంపించిన మా వదినను ఆడేసుకుంది ఈ పిచ్చిది.
సుమన: మనసులో.. నేనే విషం కలిపాను అని తెలిస్తే నన్ను చంపేస్తారు. అందరూ నన్ను అసహ్యించుకోవడం ఖాయం.
గురువుగారు: చెప్పమంటావా సుమన.
సుమన: అక్కర్లేదు స్వామి.
హాసిని: అదేంటో చిట్టీ ఆదోషి ఎవరో అని నీకు ఉండకపోవచ్చు మాకు ఉంది. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను.
డమ్మక్క: గురువుగారు వీళ్ల ముచ్చట ఎందుకు కాదు అనాలి చెప్పండి.
సుమన: వద్దు స్వామి. ఇప్పటికే ఇంట్లో అయిన గొడవ చాలు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.